రోడ్ సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేస్తాం..
నవంబర్ 15 నుంచి జిల్లాలో రోడ్ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. హైవే సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తాం. జిల్లాలో బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం. గుడిహత్నూర్ నుంచి జన్నారం వరకు సైన్‌బోర్డులను ఏర్పాటు చేయించాం. బ్రిడ్జిల పైనుంచి వాహనాలు పడిపోకుండా వాటికి సైడ్‌వాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. వాహనదారులు వేగం తగ్గించేందుకు త్రీడి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు జిల్లాలో డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నాం.
– అఖిల్ మహాజన్, ఎస్పీ


