కళాశాలలపై నిఘా
మూడు బృందాలతో తనిఖీలు మౌలిక వసతులు, విద్యాబోధనపై పరిశీలన ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నివేదిక కళాశాల యాజమాన్యాల్లో గుబులు
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు, ప్రైవేట్ జూనియర్ కళా శాలలపై ఇంటర్మీడియెట్ బోర్డు నిఘా పెట్టింది. సర్కారు కళాశాలల్లో ఇప్పటికే ప్రక్షాళన చేసిన ప్రభుత్వం ఆచరణలో క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనా నికి చర్యలు చేపట్టింది. దీంతో పాటు వేలల్లో ఫీజు లు చెల్లిస్తున్న ప్రైవేట్‌కళాశాలల్లో విద్యాబోధన, మౌ లిక వసతులు తదితర అంశాలపై తనిఖీలు చేపడుతున్నారు. వివరాలను ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లో న మోదు చేస్తున్నారు. జీపీఎస్ ఆధారంగా చేపడుతు న్న ఈ తనిఖీలు యాజమాన్యాల్లో దడ పుట్టిస్తుండగా ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు తెలిసే అవకాశముంది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీ సుకోనున్నట్లుగా తెలుస్తోంది. తనిఖీలు ఈ నెల 1 నుంచి చేపట్టాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల మంగళవారం నుంచి జిల్లాలో మొదలయ్యాయి. అన్నియాజమాన్యాల్లోని కళాశాలలను ప్రత్యేక బృందాలు విడతల వారీగా తనిఖీ చేయనున్నాయి.
మూడు బృందాల ఏర్పాటు ..
జిల్లాలో మొత్తం 77జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో 13 ప్రభుత్వ, 44 ప్రభుత్వ సెక్టార్, కేజీబీవీ లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల కళాశాలలు న్నాయి. వీటితో పాటు మరో 20 ప్రైవేట్ కళాశాలలున్నాయి. వీటిని తనిఖీ చేసేందుకు ఇంటర్ బోర్డు మూడు బృందాలను ఏర్పాటు చేసింది. మొదటి బృందంలో డీఐఈవో, మరో బృందంలో ప్రత్యేకా ధికారి అయిన ఇంటర్మీడియెట్ బోర్డు డిప్యూటీ సెక్రెటరీ, ఇంకో బృందంలో డిప్యూటీ సెక్రటరీలతో తని ఖీలు చేపడుతున్నారు. తొలి విడతలో డీఐఈవోకు 9 కళాశాలలు, మరో ఇద్దరికి 12 చొప్పున కళాశాలలను తనిఖీలు చేసే ఆదేశాలు జారీ చేశారు. డీఐఈ వో మొదటిరోజు బేల, బోథ్, బజార్‌హత్నూర్ ప్ర భుత్వ కళాశాలలను తనిఖీచేశారు. మూ డు రోజుల పాటు తనిఖీలు కొనసాగనున్నాయి. మరో విడతలో మరిన్ని కళాశాలల్లో తనిఖీలు చేపట్టనున్నారు.
పరిశీలించే అంశాలివే..
ఈ తనిఖీల్లో కళాశాలల్లో టైంటేబుల్ అమలు.. సిలబస్ ఎంతవరకు పూర్తయింది.. విద్యార్థులు, అధ్యాపకుల హాజరుశాతం.. మౌలిక వసతులు ఉన్నాయా లేవా.. విద్యార్థులు ఏమైనా ఇబ్బందులకు గురవుతున్నారా వంటి తదితర అంశాలను పరిశీలించనున్నారు. అకడమిక్ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..ఏయేగ్రామాల నుంచి అడ్మిషన్లు పొందుతున్నారు.. తరగతులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రై వేట్ కళాశాలల్లో తనిఖీలు చేపడుతున్నాం.జీపీఎస్ ట్రాకింగ్ విధానంలో ఎప్పటికప్పుడు నివేదికలను ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్నాం.జిల్లాకు మూడు బృందాలను నియమించి తనిఖీలు చేపడుతున్నాం.
– జాదవ్ గణేశ్ కుమార్, డీఐఈవో


