మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్‌రూరల్: మహిళలు, విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలు, విద్యార్థినుల రక్షణే ధ్యేయంగా జిల్లాలో పోలీస్ అక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మహిళలపై జరిగే నేరాలపై మహిళా కానిస్టేబుళ్లతో ఆయా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు అత్యవసర సమయంలో షీ టీంకు, డయల్ 100 ద్వారా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. అనంతరం వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఇందులో అదనపు ఎస్పీ కాజల్‌సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ లలిత కుమారి, సీఐలు స్వామి, సునీల్ కుమార్, ప్రభాకర్, నాగరాజు, ప్రణయ్‌కుమార్, ప్రేమ్‌కుమార్, అంజమ్మ, తదితరులున్నారు.


