
సైక్లింగ్‌తో ప్రయోజనాలు
ఆదిలాబాద్: సైక్లింగ్‌తో ఎన్నో ప్రయోజనాలు న్నాయని ఎన్‌సీసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కిచ్చర్ తెలిపారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘సన్ డేస్ ఆన్ సైకిల్’ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కెడెట్లతోపాటు ప్రతి ఒక్కరూ సైక్లింగ్ చే యడం అలవాటు చేసుకోవాలని సూచించా రు. సైకిల్ ర్యాలీ స్టేడియం నుంచి ప్రారంభమై కుమురంభీం చౌక్, ప్రొఫెసర్ జయశంకర్ చౌక్ మీదుగా స్టేడియం వరకు సాగింది. సుబేదార్లు జగదీప్‌సింగ్, సునీల్‌కుమార్, హవల్దార్లు నరేశ్‌కుమార్, బ్రిజేశ్ కుమార్, అసోసియేట్ ఆఫీస ర్లు భూమన్న, చంద్రకాంత్, కెడెట్లు ఉన్నారు.