జేసీ వాహనం డ్రైవర్ మృతి
బోథ్: ఆదిలాబాద్ జిల్లా జేసీ శ్యామలాదేవి వాహనం డ్రైవర్ నూతుల రవీందర్ రెడ్డి (కాల్వ రవి) గుండెపోటుతో మృతిచెందారు. బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామానికి చెందిన ఆయన గత 10 సంవత్సరాలుగా జేసీ వాహన డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్‌లో నివాసముంటున్న ఆయనకు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించారు. కాగా ఈసీజీ తీసే క్రమంలో ఆయన మృతిచెందారు. గురువారం ధన్నూర్ బి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతిపట్ల జేసీ శ్యామలాదేవి సంతాపం తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.


