తేలిన రిజర్వేషన్లు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్, వార్డు స్థానాల రిజర్వేషన్లపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చైర్‌పర్సన్ పీఠాన్ని రాష్ట్రం యూనిట్‌గా జనరల్ మహిళకు కేటాయిస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టికే.శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వార్డు స్థానాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా ఆధ్వర్యంలో ఖరారు చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సి పల్ అధికారులతో కలిసి శనివారం లక్కీడ్రా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయించగా బీసీ రిజర్వేషన్లను బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా ఖరారు చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాట కుండా చూశారు. ఇక మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయిస్తూ లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేశా రు. ఆశావహులు, ఆ యా రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ వార్డుల రిజర్వేషన్ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదు రు చూశారు. అనుకూలంగా వచ్చిన వారు సంతోషం వ్యక్తం చేశా రు. రాని వారు నిరాశతో వెనుదిరి గారు. గత కౌన్సిల్‌లో పని చేసి మరోసారి ఎన్నికల బరిలో నిలు ద్దామని భావించిన పలువురు రిజర్వేషన్ తారుమా రు కావడంతో పోటీకి అవకాశం లేకుండా పోయింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, రెవెన్యూ అధికారి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
హీటెక్కిన రాజకీయం
రిజర్వేషన్ల ఖరారుతో మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆశావహులు పార్టీ టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అలాగే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అవుతున్నారు.
మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలు
వార్డు రిజర్వేషన్ వార్డు రిజర్వేషన్
1 ఎస్సీ మహిళ 26 బీసీ జనరల్
2 జనరల్ 27 జనరల్
3 బీసీ మహిళ 28 జనరల్
4 జనరల్ 29 జనరల్ మహిళ
5 జనరల్ మహిళ 30 జనరల్
6 జనరల్ మహిళ 31 బీసీ మహిళ
7 బీసీ మహిళ 32 బీసీ మహిళ
8 ఎస్సీ జనరల్ 33 బీసీ జనరల్
9 ఎస్టీ మహిళ 34 జనరల్
10 బీసీ మహిళ 35 జనరల్ మహిళ
11 ఎస్సీ మహిళ 36 బీసీ మహిళ
12 ఎస్టీ జనరల్ 37 జనరల్ మహిళ
13 జనరల్ మహిళ 38 బీసీ మహిళ
14 ఎస్టీ జనరల్ 39 జనరల్ మహిళ
15 జనరల్ మహిళ 40 జనరల్
16 జనరల్ మహిళ 41 జనరల్ మహిళ
17 ఎస్సీ జనరల్ 42 ఎస్సీ మహిళ
18 ఎస్సీ జనరల్ 43 బీసీ జనరల్
19 జనరల్ 44 బీసీ జనరల్
20 బీసీ జనరల్ 45 జనరల్ మహిళ
21 జనరల్ 46 బీసీ జనరల్
22 జనరల్ 47 జనరల్
23 జనరల్ 48 జనరల్ మహిళ
24 బీసీ జనరల్ 49 బీసీ జనరల్
25 జనరల్ మహిళ


