‘ఖండాల’కు టీటీడీసీ గుర్తింపు
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని ఇంద్రవెల్లి అట వీ రేంజ్ పరిధిలో గల ఖండాల జలపాతానికి తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఏటా మాదిరిగా టీటీడీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో ఈనెల 13 నుంచి ఇంటర్నేషనల్ కై ట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ’ పోటీలో ఖండాల జలపాతానికి కన్సోలేషన్ బహుమతి దక్కింది. ఈమేరకు ఆ శాఖ ఎండీ వల్లూరి క్రాంతి చేతుల మీదుగా ఇంద్రవెల్లి ఎఫ్‌ఆర్వో సంతోష్ శుక్రవారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ, ఖండాలకు దక్కిన గుర్తింపు వెనుక అటవీశాఖ నిరంతర కృషి ఉందన్నారు. కాగా, టూరిజం శాఖ గుర్తింపుతో ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని పర్యాటకులు, స్థానికులు పేర్కొంటున్నారు.
‘ఖండాల’కు టీటీడీసీ గుర్తింపు


