జాతరను విజయవంతం చేద్దాం
ఇంద్రవెల్లి: ఈనెల 18 నుంచి 25 వరకు నిర్వహించే నాగోబా జాతర విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్‌సింగ్ అన్నారు. నాగోబా ఆలయంతో పాటు జాతర నిర్వహణ స్థలాన్ని శనివారం పరిశీలించారు. నిబంధనల ప్రకారం దుకాణా లు ఏర్పాటు చేసుకోవాలని పలువురికి సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అడుగడుగునా సీసీ నిఘా ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న తదితరులున్నారు.


