విధుల్లో నిర్లక్ష్యం వద్దు
ఆదిలాబాద్‌టౌన్: పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వ హించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల ని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం నిర్వహించి న పరేడ్‌ను పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశా రు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నా రు. వ్యాయ మం చేస్తూ శారీరక ధృడత్వం కలిగి ఉండాలన్నారు. ప్రతీ శనివారం నిర్వహించే పరేడ్‌లో పాల్గొని పరిపూర్ణత చెందాలని సూచించారు. క్ర మశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కాగా ఈ ప రేడ్‌లో లాఠీడ్రిల్, ఆమ్స్ డ్రిల్, ట్రా ఫిక్ డ్రిల్ వంటి అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 50ఏళ్లు పై బడిన వారికి ప్రత్యేకంగా యోగా నిర్వహించనున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీఐలు కె. నాగరాజు, ప్రేమ్ కుమార్, కె.ఫణిదర్, ప్రణయ్‌కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు, రిజ ర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
జిల్లా పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం విడుదల చేశారు. ఇందులో ఏఎస్పీ మౌనిక, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పి పోతారం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
ప్రాచీన కళల పరిరక్షణ అందరి బాధ్యత
ఆదిలాబాద్: ప్రాచీన కళల పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ప్రాంగణంలో మంథనం ఒక సంకల్పం కళా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మృన్మయ మట్టి కళాకృతుల ప్రదర్శనను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు కళలంటే ఎంతో మక్కువ అని తెలి పారు. నేటి తరానికి వారసత్వ కళలను పరిచయం చేయాలని వేదిక సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో వేదిక నిర్వాహకులు నిష్కాంతరావు దేశ్‌పాండే, సంజీవ్ రెడ్డి, నవల రచయిత వసంతరావు దేశ్‌పాండే, సాగర్, నితిన్, అనిరుధ్ పాల్గొన్నారు.


