దాడికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

దాడికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి

Aug 11 2024 2:36 AM | Updated on Aug 11 2024 2:36 AM

దాడికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి

దాడికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి

మాజీ ఎంపీ చింతా అనురాధ

సాక్షి, అమలాపురం: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రసంగాలతో ఊదరగొడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు విజయవాడలోని అంబేడ్కర్‌ విగ్రహంపై జరిగిన దాడికి ఎటువంటి సమాధానం చెబుతారని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ ప్రశ్నించారు. శనివారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి అమానుషమన్నారు. అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడిచిన గత ప్రభుత్వం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆమె గుర్తు చేశారు. అలాగే 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగ నిర్మాత పట్ల తన గౌరవ మర్యాదలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాటారన్నారు. ఆయనపై కక్షతో విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించడం అన్యాయమన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement