breaking news
World top-10 list
-
ఆసియా కుబేరుల జాబితా విడుదల
ముంబై: ఆసియా కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఆయన సంపద రూ.లక్ష కోట్ల మేర తరిగిపోయినప్పటికీ.. రూ.8.6 లక్షల కోట్ల నికర సంపదతో మొదటి స్థానాన్ని కాపాడుకున్నారు. కానీ, ప్రపంచ టాప్–10లో స్థానాన్ని కోల్పోయారు. ఇదే కాలంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద 13 శాతం పెరిగి (రూ.లక్ష కోట్లు) 8.4 లక్షల కోట్లకు చేరుకోవడంతో ముకేశ్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంలో సంపదను ఎక్కువగా పెంచుకున్నది అదానీయే కావడం గమనార్హం. గత ఏడాది కాలంలో 13 మంది బిలియనీర్లు దేశంలో కొత్తగా పుట్టుకొచ్చారు. మొత్తం బిలియనీర్లు (బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపద) 284 మంది కాగా, వీరి ఉమ్మడి సంపద ఏడాది కాలంలో 10 శాతం పెరిగి రూ.98 లక్షల కోట్లకు చేరుకుంది. దేశ జీడీపీలో వీరి సంపద మూడింట ఒక వంతుగా ఉంది. ఈ వివరాలతో హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ (కుబేరుల జాబితా) 2025 విడుదలైంది. వీరి సంపద లెక్కింపునకు ఈ ఏడాది జనవరి 15ను కటాఫ్ తేదీగా హరూన్ పరిగణనలోకి తీసుకుంది. → హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ రూ.3.5 లక్షల కోట్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలోకి తొలిసారి వచ్చి చేరారు. కంపెనీలో 47 శాతం వాటాను ఆమె పేరిట తండ్రి శివ్‌నాడార్ బదిలీ చేయడం ఇందుకు దారితీసింది. ప్రపంచంలో టాప్–10 మహిళా కుబేరుల్లో 5వ స్థానం సొంతం చేసుకుని, ఈ గుర్తింపు సాధించిన తొలి భారత మహిళగా నిలిచారు. → రేజర్‌పే సహ వ్యవస్థాపకులైన శశాంక్ కుమార్ (34), హర్షిల్ మాథుర్ (34) చెరో రూ.8,463 కోట్ల నెట్‌వర్త్‌తో భారత్‌లోనే యువ బిలియనీర్లుగా ఈ జాబితాకెక్కారు. → సంపద అంతా కొద్ది మంది చేతుల్లోనే బందీ అవుతోందన్న ఆందోళనలు ఉన్నప్పటికీ.. ఒక్కో బిలియనీర్ సగటు సంపద (రూ.34,514 కోట్లతో) విషయంలో భారత్ ప్రపంచంలో ముందుంది. రెండో స్థానంలో ఉన్న చైనాలో ఒక్కో బిలియనీర్ సగటు సంపద విలువ రూ.29,027 కోట్లు. → గడిచిన ఏడాది కాలంలో 175 మంది భారతీయ బిలియనీర్ల సంపద నికరంగా పెరగ్గా.. 109 మంది సంపద అంతకు ముందు ఏడాదితో పోల్చితే తగ్గింది. → అత్యధికంగా 90 మందితో దేశంలో బిలియనీర్ల రాజధానిగా ముంబై నిలిచింది. కానీ, 92 మంది బిలియనీర్లతో ఆసియాలో బిలియనీర్ల రాజధానిగా షాంఘై నిలిచింది. 129 మంది బిలియనీర్లతో ప్రపంచ రాజధానిగా న్యూయార్క్ వరుసగా రెండో ఏడాది తన స్థానాన్ని కాపాడుకుంది. → టెస్లా సీఈవో ఎలాన్‌మస్క్ 420 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. → అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ 266 బిలియన్ డాలర్లతో, మెటా చీఫ్ జుకెర్‌బర్గ్ 242 బి.డాలర్లతో ప్రపంచంలో 2,3 స్థానాల్లో ఉన్నారు. → ఈ ఏడాది హరూన్ ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్‌కు 18వ ర్యాంక్ లభిస్తే, అదానీ 27వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. → 870 మంది బిలియనీర్లతో అమెరికా ప్రపంచ కుబేరుల కేంద్రంగా నిలిస్తే, 823 మందితో చైనా రెండో స్థానంలో ఉంది. → మొత్తం 9 మంది భారత మహిళలకు ప్రవేశం లభించగా, వీరి ఉమ్మడి సంపద రూ.9 లక్షల కోట్లు. -
మత్తులో మనోళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్న చీకటి కోణాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డ్రగ్స్ వినియోగంపై సర్వేల వివరాలు వెలువడుతున్నాయి. టాప్–10 నగరాల్లో ఢిల్లీ, ముంబై.. జర్మనీకి చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ ఏబీసీడీ ప్రపంచంలోని 120 దేశాల్లో 2018 డ్రగ్స్ వినియోగంపై డేటా ఆధారంగా జాబితాను రూపొందించింది. ఏబీసీడీ జాబితా ప్రకారం.. ► ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ వినియోగం న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం 70 వేల 252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ► పాకిస్తాన్‌లోని కరాచీ నగరం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 38 వేల 56 కిలోల డ్రగ్స్‌ను వినియోగిస్తారు. ► ప్రపంచంలోని టాప్–10 నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో, దేశ ఆర్థి క రాజధాని ముంబై ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీవాసులు ప్రతీ సంవత్సరం 34 వేల 708 కిలోల డ్రగ్స్ వినియోగించగా, ముంబై వాసులు ప్రతీ ఏటా 29 వేల 374 కిలోల మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. ► నాలుగోస్థానంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ( 32,713 కిలోలు), ఐదోస్థానంలో ఈజిప్ట్‌లోని కైరో ( 29,565 కిలోలు), ఏడో స్థానంలో ఇంగ్లండ్ రాజధాని లండన్ (28,485 కిలోలు), ఎనిమిదోస్థానంలో అమెరికాలోని షికాగో (22,262 కిలోలు), తొమ్మిదోస్థానంలో రష్యా రాజధాని మాస్కో ( 20,747 కిలోలు), పదో స్థానంలో కెనడా రాజధాని టొరంటొ ( 20,638 కిలోలు) ఉన్నాయి. 5 ఏళ్లలో 14.74 లక్షల కిలోల డ్రగ్స్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2019లో 3.42 లక్షల కిలోల కంటే ఎక్కువ మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. 35,310 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన వారిలో 35 వేల మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 2015 – 2019 మధ్య దేశవ్యాప్తంగా ఎన్సీబీ 14.74 లక్షల కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది. 2018 లో అత్యధికంగా 3.91 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రోజుకు 23 మంది మృతి.. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసౖలైన వారు ఆ వ్యసనాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. డ్రగ్స్ వినియోగంతోనూ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. డ్రగ్స్ దొరకని పరిస్థితుల్లోనూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దేశంలో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని ఎన్సీబీ గణాంకాలు సూచిస్తున్నాయి. గతేడాది 7,860 మంది డ్రగ్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ అధిక మోతాదు కారణంగా 704 మంది మరణించారు. 2019లో డ్రగ్స్ కారణంగా 8,564 మంది మృతి చెందారు. దీని ప్రకారం ప్రతిరోజూ 23 మంది మాదకద్రవ్యాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. -
ప్రపంచ అందగాళ్లలో హృతిక్ ఫస్ట్
‘ఆసియన్ సెక్సియస్ట్ మేన్, మేన్ ఆఫ్ ది ప్లానెట్’ వంటి టైటిల్స్ దక్కించుకున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాజాగా మరో అరుదైన టైటిల్ సొంతం చేసుకున్నారు. ఓ అంతర్జాతీయ వెబ్సైట్ ఇచ్చిన ‘వరల్డ్ టాప్ టెన్ హ్యాండ్సమ్ హీరో’ల ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచారు ఈ ఆరడుగుల అందగాడు. అది కూడా ప్రముఖ హాలీవుడ్ నటులు రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్ ఇవాన్స్‌లను వెనక్కి నెట్టి మరీ తొలి స్థానంలో నిలవడం విశేషం. మరో బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ఇంతవరకూ ఏ భారతీయుడూ సాధించని ఘనతను హృతిక్ సాధించాడంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు హృతిక్‌ని అభినందిస్తున్నారు. ఇక ఆయన ఫ్యాన్స్ ఆనందాలకు అవధుల్లేవు. మా హీరోనే అందగాడు అంటూ పండగ చేసుకుంటున్నారు. ప్రపంచ టాప్‌టెన్ హ్యాండ్సమ్ హీరోల్లో వరుసగా హృతిక్ రోషన్, రాబర్ట్ ప్యాటిన్సన్, గాడ్ఫ్రే గావో, క్రిస్ ఇవాన్స్, సల్మాన్ ఖాన్, డేవిడ్ బోరియానాజ్, నోవా మిల్స్, హెన్రీ కవిల్, టామ్ హిడిల్స్టన్, సామ్ హ్యూగన్ నిలిచారు. -
ఫోర్బ్స్ జాబితాలో షారుక్, అక్షయ్
-
ఫోర్బ్స్ జాబితాలో షారుక్, అక్షయ్
న్యూయార్క్: ప్రపంచంలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల టాప్-10 జాబితాలో (2016కు) బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు చోటు దక్కింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో రెజ్లింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఐరన్ మ్యాన్, డ్వాన్ జాన్సన్ రూ. 432కోట్లతో మొదటి స్థానంలో ఉండగా జాకీచాన్ రూ.408 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ రూ. 221 కోట్లతో ఎనిమిదో స్థానంలో, అక్షయ్ కుమార్ రూ. 211 కోట్ల ఆదాయంతో పదో స్థానంలో (బ్రాడ్ పిట్తో కలిసి) ఉన్నారు. బజరంగీ భాయ్‌జాన్‌తో కలెక్షన్ల వర్షం కురిపించిన హీరో సల్మాన్ ఖాన్ రూ. 191కోట్ల ఆదాయంతో 14వ స్థానంలో, అమితాబ్ బచ్చన్ 134 కోట్ల రూపాయలతో 18వ స్థానంలో ఉన్నారు.