ఫోర్బ్స్ జాబితాలో షారుక్, అక్షయ్ | Shah Rukh Khan, Akshay Kumar among world's highest paid actors | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్ జాబితాలో షారుక్, అక్షయ్

Aug 27 2016 3:35 AM | Updated on Sep 4 2017 11:01 AM

ఫోర్బ్స్ జాబితాలో షారుక్, అక్షయ్

ఫోర్బ్స్ జాబితాలో షారుక్, అక్షయ్

ప్రపంచంలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల టాప్-10 జాబితాలో (2016కు) బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు చోటు దక్కింది. ఫోర్బ్స్

న్యూయార్క్: ప్రపంచంలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల టాప్-10 జాబితాలో (2016కు) బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు చోటు దక్కింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో రెజ్లింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఐరన్ మ్యాన్, డ్వాన్ జాన్సన్ రూ. 432కోట్లతో మొదటి స్థానంలో ఉండగా జాకీచాన్ రూ.408 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రూ. 221 కోట్లతో ఎనిమిదో స్థానంలో, అక్షయ్ కుమార్ రూ. 211 కోట్ల ఆదాయంతో పదో స్థానంలో (బ్రాడ్ పిట్‌తో కలిసి) ఉన్నారు. బజరంగీ భాయ్‌జాన్‌తో కలెక్షన్ల వర్షం కురిపించిన హీరో సల్మాన్ ఖాన్ రూ. 191కోట్ల ఆదాయంతో 14వ స్థానంలో, అమితాబ్ బచ్చన్ 134 కోట్ల రూపాయలతో 18వ స్థానంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement