breaking news
workation
-
‘వర్క్ ఫ్రమ్ ఫారెస్ట్’.. మూడు రోజులకు రూ.14 వేలు!
తిరువనంతపురం: ఇంట్లో కూర్చొని పని చేయడం (వర్క్ ఫ్రమ్ హోమ్) గురించి మనకు తెలిసిందే.. మరి అడవిలో ఉండి పని చేయడం(వర్క్ ఫ్రమ్ ఫారెస్ట్) ఎలా ఉంటుంది? కేరళ ప్రభుత్వం ఇప్పుడు ఇదే ఆలోచనతో కొత్త వర్కేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేరళ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కేఎఫ్డీసీ) ఆధ్వర్యంలో గవి, సూర్యనెల్లి ప్రాంతాల్లో రిమోట్ ఉద్యోగులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.అడవిలోనే పని.. మధ్యలో ట్రెక్కింగ్అటవీ శాఖ పర్యవేక్షణలో ఈ ‘వర్కేషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘వర్క్’, ‘వెకేషన్’ అనే రెండు పదాల కలయికే వర్కేషన్. అంటే ఉద్యోగ బాధ్యతలను కొనసాగిస్తూనే ప్రకృతి మధ్యలో కొంత సమయం గడపడం. ఇందుకోసం గవి, సూర్యనెల్లిలో హైస్పీడ్ వై-ఫై, కేఫెటీరియా సదుపాయాలను ఏర్పాటు చేశారు. పని మధ్యలో విరామం తీసుకుని అడవిలో ట్రెక్కింగ్ చేసే అవకాశమూ ఉంటుంది.మూడు రోజుల ప్యాకేజీ.. రూ.14 వేలుఈ వర్కేషన్ కోసం మూడు రోజుల ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో వసతి, భోజనం, ట్రెక్కింగ్ ఉన్నాయి. ప్యాకేజీ ధర రూ.14,000. ఒక్క గదిలో ఇద్దరు ఉండొచ్చు. తొలి దశలో మొత్తం నాలుగు గదులను సిద్ధం చేశారు. అంటే ప్రకృతి మధ్యలో ఉండి పని చేయాలనుకునే వారికి పరిమిత సంఖ్యలోనే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.అడవి అందాల మధ్యలో..పతనంతిట్ట జిల్లాలోని గవి ప్రాంతం పెరియార్ టైగర్ రిజర్వ్‌లో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 1,036 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం పూర్తిగా అటవీ వాతావరణంతో ఉంటుంది. కుమిలి నుంచి సుమారు 28 కిలోమీటర్లు, వండిపెరియార్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో గవి ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు సుమారు 15–17 డిగ్రీల సెల్సియస్ నుంచి 24–27 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి.సూర్యనెల్లి.. పొగమంచు, తేయాకు తోటల మధ్య..ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్ పంచాయతీలో సూర్యనెల్లి ఉంది. మున్నార్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎత్తైన ప్రాంతం పొగమంచు, తేయాకు తోటలకు ప్రసిద్ధి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన తేయాకు తోటల్లో ఒకటిగా పేరున్న కొలుక్కుమలైకి ఇది ప్రవేశద్వారం. అక్కడి సూర్యోదయం, అనయిరంకల్ డ్యామ్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.పెరుగుతున్న వర్కేషన్ సంస్కృతిరిమోట్ వర్క్‌తో పాటు వర్కేషన్ విధానం ప్రపంచంలోని పలు ప్రాంతాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. జపాన్ 2020లో జాతీయ పార్కులు, హాట్ స్ప్రింగ్ ప్రాంతాల్లో వై-ఫై, పని చేసుకునే ప్రదేశాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. బార్బడోస్ 2020లో విదేశీయులు ఏడాది వరకు అక్కడ ఉండి రిమోట్‌గా పనిచేసేలా ‘వెల్కమ్ స్టాంప్’ను తీసుకొచ్చింది. ఎస్టోనియా డిజిటల్ నోమాడ్ వీసాను ప్రవేశపెట్టిన తొలి దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇండోనేషియాలోని బాలీ కూడా రిమోట్ ఉద్యోగులకు ప్రముఖ గమ్యస్థానంగా మారింది.ఇదీ చదవండి: జెన్ జెడ్ ‘బండ రాయి’ ట్రెండ్.. ఆన్లైన్లో ఉన్నా నో రిప్లై! -
Hyderabad: సిటీలో కొత్త ట్రెండ్.. ‘వర్కేషన్’ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొండాపూర్‌లో నివసించే కార్పొరేట్ ఉద్యోగి వర్థన్.. గత ఏడాదిగా గోవా, మధురై, కేరళలలో ప్రకృతి అందాలను సతీసమేతంగా ఆస్వాదిస్తున్నారు. కనీసం 15 నుంచి 20 రోజుల వ్యవధి ఉండే ట్రిప్ పూర్తయిన తర్వాత నగరానికి రావడం ఓ వారం పదిరోజులు గడపడం ఆ వెంటనే మరో టూర్.. దీనిని బట్టి ఆయనను మనం వర్క్‌కి బంక్ కొట్టే వెకేషన్ లవర్‌గా భావిస్తాం. కానీ ఆయన ఆస్వాదిస్తోంది వర్కేషన్. పిక్నిక్లోనూ పనిచేసే విధానం. ట్రావెల్ కంపెనీ బుకింగ్ డాట్ కామ్ సర్వే ప్రకారం గత ఏడాదిలోనే 68 శాతం మంది భారతీయ ప్రయాణికులు రాబోయే సంవత్సరానికి తమ వర్కేషన్స్‌ను బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పర్వత ప్రకృతి దృశ్యాలు బ్యాక్‌డ్రాప్‌గా వర్క్స్టేషన్ల పోస్ట్‌లు..బీచ్‌లకు ఆనుకుని ఉన్న గది ఇన్‌స్టా రీల్స్‌తో సోషల్ మీడియా పని–ప్రకృతి ప్రేమికుల వేదికగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్కేషన్ దాకా కోవిడ్ దెబ్బకు కార్పొరేట్ ఉద్యోగుల పనితీరు ఆన్లైన్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్/రిమోట్ వర్కింగ్ సిస్టమ్...ఇలా రూపాంతరం చెందుతూ ఇప్పుడు వర్కేషన్‌గా ఊపందుకుంది. ‘ఇంటి నుంచి కాకుండా ఇష్టమైన టూర్లో ఉంటూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూనే అసైన్డ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమనే వర్కింగ్ ట్రెండ్‌నే వర్కేషన్’గా పేర్కొంటున్నారు. ఈ వర్కేషన్ ప్రియుల్ని డిజిటల్ నోమాడ్స్‌గా పిలుస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, అన్ అకాడమీ తదితర కార్పొరేట్ సంస్థలు ‘నిరవధిక వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రకటన తర్వాత ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. వర్క్‌తో పాటే విందు, వినోదం ‘మా రిసార్ట్స్‌లో 80 శాతం వరకూ వర్కేషన్కు అనువుగా మార్చాం. బెస్ట్ వైఫై నెట్ వర్క్, ఫుడ్ ప్రీ ఆర్డర్స్ పెద్దలు పని టైమ్‌లో పిల్లల కోసం హ్యాపీ హబ్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం’ అంటూ క్లబ్ మహీంద్రా రిసార్ట్స్ ప్రతినిధి చెప్పారు. కరావొకే లాంటి సరదా సంగీతాల ఈవెంట్స్‌తో పాటు సర్ఫింగ్, కయాకింగ్, స్టాండప్ పాడ్లింగ్, స్కీయింగ్, స్పిన్నింగ్, స్కేటింగ్ వంటివి వర్క్‌తో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. రిషికేశ్, ధర్మశాల, కేరళ, కూర్గ్, గోవా తదితర ప్రాంతాలు నగర వర్కేషన్ ప్రియుల ఎంపిక జాబితాలో టాప్‌లో ఉన్నాయని ట్రావెల్ ఆపరేటర్ మీర్ చెప్పారు. నగరానికి చెందిన ఓ కంపెనీలో స్ట్రాటజీ హెడ్ గా పనిచేస్తున్న సూర్య తేజ గత రెండేళ్లుగా వారణాసి నుంచి గోవా..మధురై వరకు 65,000 కి.మీ ప్రయాణించాడు, మరి అత్యవసర పరిస్థితుల్లో ఎలా? అంటే సమాధానంగా సూర్య ఏమంటారంటే ‘గత 2021 అక్టోబర్‌లో నేను కేరళలోని, అరూకుట్టిలోని ఓ రిసార్ట్స్‌లో కయాకింగ్ యాక్టివిటీలో బిజీగా ఉంటూనే ఆన్లైన్ మీటింగ్‌కు హాజరయ్యా. కయాకింగ్ లాంటి యాక్టివిటీస్‌కి వెళ్లినప్పుడు నా వెంట వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ తప్పనిసరిగా ఉంటుంది’ అంటూ చెప్పడం పనితో పిక్నిక్ని కలిపిన వైనానికి అద్దం పడుతుంది. ఇటీవల బాగా పాపులరయిన వాటిలో డే కేషన్స్, వర్కేషన్స్. వీటికి అనుగుణంగా మేం మా ట్రావెల్ ప్యాకేజ్‌లను డిజైన్ చేస్తున్నాం. అడ్వంచర్ యాక్టివిటీస్, నేచర్ వాక్స్, ఇగ్లూ స్టేయింగ్, హార్స్ రైడింగ్, చెట్ల మీద విందు, ఎటివి బైక్స్, పెయింట్ బాల్... ఫ్యామిలీతో సహా వచ్చేవారికి అనుగుణంగా తీర్చిదిద్దాం. మా సభ్యుల్లో దక్షిణాది నుంచి 30 శాతం ఉంటే అందులో హైదరాబాద్ వాటా పెద్దదే. –ప్రతినిధి, క్లబ్ మహేంద్రా హాలిడేస్– రిసార్ట్స్


