breaking news
Women researchers
-
ఇన్ బ్రెయిన్
మెదడు పనితీరుపై విశ్లేషణ, కార్యాచరణ సమాచారాన్ని అందించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, మానసిక వైద్యులకు ఆధునాతన బ్రెయిన్ ఇమేజింగ్–బేస్డ్ ఇన్సైట్స్ను అందించే న్యూరో–ఇన్ఫార్మటిక్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రెయిన్ సైట్ ఏఐ’ నిర్మించారు రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్...గత సంవత్సరం ఇండియా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడిఎస్సీవో) నుంచి ‘సాఫ్ట్వేర్–యాజ్–ఎ మెడికల్ డివైజ్’ సర్టిఫికెట్ పొందడం ద్వారా ‘బ్రెయిన్‌సైట్ ఏఐ’ వాణిజ్యపరంగా కీలకమైన మైలురాయిని చేరింది. ఈ సంస్థకు ఇమ్మాన్యుయేల్ సీయివో, రింఝిమ్ అగర్వాల్ సీటీవో.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ నుంచి రింజిమ్ అగర్వాల్ పీహెచ్డీ చేసింది. ఇమ్మాన్యుయల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేసింది. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ పాలసీలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ బిజినెస్‌లో ఆమెకు అపార అనుభవం ఉంది.‘సీడిఎస్సీవో లైసెన్స్ మాకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. మా ప్రాడక్స్›్ట వంద ఆస్పత్రులకు చేరువ కావాలనేది మా లక్ష్యం’ అంటుంది ఇమ్మాన్యుయేల్.‘ఆసుపత్రులలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్యులలో న్యూరోసర్జన్లు ఒకరు. మా సాంకేతికత మెదడుకు సంబంధించిన నిర్మాణాత్మక అంశాలకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్, కాగ్నిషన్లాంటి వివిధ విధులపై కూడా ఇన్సైట్స్ను అందించగలదు. మా బ్రెయిన్‌సైట్ ఏఐ సామర్థ్యం సర్జన్లలో ఆసక్తి రేకెత్తించింది’ అంటుంది అగర్వాల్.‘బ్రెయిన్‌సైట్ ఏఐ’ అందించే సమాచారం సర్జరీల సమయంలో వైద్యులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కణితి... దేహంలో ఏదైనా కీలక విధులు నిర్వహించే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే, వైద్యులు దానిని చేరుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది.బ్రెయిన్ ఏఐ ప్రాడక్ట్ ‘వోక్సెల్‌బాక్స్’ వేగంగా అభివృద్ధి చెందనుంది. మెదడుకు సంబంధించిన నాడీ కణాల కనెక్షన్లను మ్యాప్ చేయడానికి ‘ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోసెన్స్ ఇమేజింగ్’ (ఎఫ్ఎంఆర్ఐ) ఉపయోగ పడుతుంది. ఆ డేటాను ప్రాసెస్ చేసేందుకు ఉపయోగపడేదే ఏఐ–పవర్డ్ ప్రాడక్ట్ వోక్సెల్‌బాక్స్. రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలను ప్లాన్ చేయడంలోనూ, చికిత్సను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వీలైన బ్రెయిన్ మ్యాప్స్‌ను తయారు చేయడంలో ‘వోక్సెల్ బాక్స్’ ఉపయోగపడుతుంది.హెల్త్–టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్ ‘స్నోడ్రాప్’ అనే పేషెంట్ కేర్ యాప్‌ను కూడా అభివృద్ధి చేశారు. పేషెంట్ల ప్రొఫైల్స్ రూపొందించడంలో, వైద్యప్రకియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. -
ప్రభుత్వం మాది...దిక్కున్నచోట చెప్పుకోండి..
పంచాయతీ చెరువు నుంచి అడ్డగోలుగా నీటి మళ్లింపు అడ్డుకున్న మహిళా సర్పంచ్, గ్రామస్తులపై దౌర్జన్యం పోలీసులను సైతం లెక్క చేయని వైనం అధికార పార్టీ నాయకుడి నిర్వాకం పామర్రు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మాది.. మీకు చేతనైంది చేస్కోండి.. దిక్కున్నచోట చెప్పుకోండి.. ఏం జరుగుద్దో మీరే చూస్తారు.. ఇవీ అధికార పార్టీకి చెందిన ఓ నేత బెదిరింపులు. అంతేకాదు పంచాయతీ చెరువులోని నీటిని అక్రమంగా తోడేస్తుండటంపై ప్రశ్నించిన సర్పంచ్, గ్రామస్తులపై దౌర్జన్యం ప్రదర్శించారు. పోలీసులపై సైతం బెదిరింపులకు దిగారు. వివరాల్లోకి వెళితే.. పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో పంచాయతీ పరిధిలో 18 ఎకరాల చెరువు ఉంది. అదే గ్రామానికి చెందిన, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా చెలామణి అవుతున్న పొట్లూరి కృష్ణబాబు నిబంధనలకు విరుద్ధంగా ఆ నీటిని తన సొంత చెరువుల్లోకి తోడేస్తున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ పొట్లూరి కృష్ణకుమారి, గ్రామస్తులు కారే ముసిలి, పొట్లూరి రామశాస్త్రులు, అట్లూరి వెంకటేశ్వరరావు, వేములపల్లి పూర్ణచంద్రరావు, సింగవరపు రామచంద్రరావు, కాకరాల కోటేశ్వరరావు, పొట్లూరి శివయ్య తదితరులు వెళ్లి నీటి మళ్లింపును అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పొట్లూరి కృష్ణబాబు అక్కడికి చేరుకుని వారితో వాగ్వివాదానికి దిగారు. ‘నా ఇష్టం వచ్చినట్లు తోడుకుంటాను.. అడ్డుకోండి చూస్తాను.. అధికారంలో ఉన్నది మేమే.. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు..’ అంటూ దౌర్జన్యానికి దిగారు. పోలీసులతోనూ వాగ్వాదం... ఈ ఘటనపై సర్పంచ్ పొట్లూరి కృష్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పామర్రు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నీటి తరలింపుపై ఎస్సై విల్సన్ పొట్లూరి కృష్ణబాబును ప్రశ్నించగా, సమాధానం దాటవేశారు. అదే సమయంలో సీఐ శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకుని తమకు సర్పంచ్ నుంచి ఫిర్యాదు అందిందని, నీటి తోడకం చేయడానికి వీలులేదని కృష్ణబాబును వారించారు. దీంతో ‘మీకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందకుండా మీరు ఎందుకు వచ్చారు.. ఏం చేద్దామని వచ్చారు’ అంటూ సీఐని, ఎస్సైలను కృష్ణబాబు నిలదీశారు. అనంతరం సీఐ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది రాత్రంతా కాపలా ఉన్నారని గ్రామస్తులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు సర్పంచ్ పొట్లూరి కృష్ణకుమారి లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రాన్ని గ్రామస్తులకు ఇచ్చి పోలీస్‌స్టేషన్‌కు పంపగా, పోలీసులు కేసు నమోదు చేయకుండా గ్రామానికి వచ్చి నీటి తవ్వకాలను అడ్డుకున్నారు. అవసరం తీరాకే.. ఆపేశారు.. ఘటనాస్థలిలో రాత్రంతా పోలీసులు ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యమని గ్రామస్తులు తెలిపారు. ఓ పక్క పోలీసులు అక్కడ ఉండగానే నీరంతా సొంత చెరువుల్లోకి తరలించేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఎస్సై వచ్చి తవ్వకాలను ఆపేయాలని అనడంతో అప్పటికే పనులు పూర్తయిన నేపథ్యంలో ఇంజ న్లను తొలగించారని గ్రామస్తులు చెప్పారు.