breaking news
Women Chess Championship
-
చరిత్ర సృష్టించిన వైశాలీ.. తమ్ముడి బాటలోనే అక్క!!
భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద బాటలోనే సోదరి ఆర్ వైశాలీ నడిచింది. జపాన్ వేదికగా జరిగిన డబ్ల్యూఆర్ వుమెన్స్ చెస్ టూర్ టైటిల్‌ను వైశాలీ సొంతం చేసుకుంది. తద్వారా వుమెన్స్ క్యాండిడేట్ చెస్ టోర్నీ నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఎనిమిది మంది క్రీడాకారిణుల మధ్య జరిగిన ర్యాపిడ్ చెస్ ఈవెంట్లో వైశాలీ తొలి స్థానంలో నిలవగా, అలెంగ్జాడ్రా కొస్తేనుక్ (రష్యా), ఆంటోనెటా స్టిఫనోవా (బల్గేరియా) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 24 ఏళ్ల వైశాలీ శనివారం తన ఫైనల్ రౌండ్లో కజకిస్తాన్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ అలువా నూర్మన్‌తో తలపడింది. రెండు గేముల పోరులో 1.5-0.5 తేడాతో చిత్తు చేసింది. అంతకముందు మాజీ చాంపియన్ కోస్టేనియుక్ను కూడా ఇదే తేడాతో ఓడించిన వైశాలీ ఫైనల్‌కు చేరుకుంది. ఇక క్వార్టర్ ఫైనల్లో వైశాలీ ఒక గేమ్ గెలిచి మరొక గేమ్‌ను డ్రా చేసుకుంది. ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను గెలిచిన వైశాలీ నేటి నుంచి ప్రారంభం కానున్న బ్లిట్జ్ చెస్ ఈవెంట్‌ను కూడా గెలిచి డబుల్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ పోటీలో పాల్గొన్న ఇతర క్రీడాకారిణులు అన్నా సర్గ్స్యాన్, ఐరిన్ సుకందర్, అలువా నూర్మాన్,అజుమి సకాయ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.అయితే వైశాలీ ర్యాపిడ్ చెస్ టైటిల్ గెలవడానికి కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు ఆర్ ప్రజ్ఞానంద నార్వే క్లాసికల్ చెస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడిగా నిలిచాడు.చదవండి: కెప్టెన్సీ తెచ్చిన జోష్.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం! -
ప్రపంచకప్ చాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ (FIDE World Cup) ఫైనల్లో యువ తరంగం దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) సత్తా చాటింది. తెలుగు తేజం కోనేరు హంపి (Koneru Humpy)ని 2.5-1.5తో ఓడించి.. మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.జార్జియాలోని బతూమీ వేదికగా సోమవారం జరిగిన టై బ్రేకర్‌లో హంపీ తొలుత నల్ల పావులతో ఆడగా.. దివ్యతో కలిసి డ్రా చేసుకుంది. పదిహేను నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 81 ఎత్తుల తర్వాత ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. అనంతరం పదిహేను నిమిషాల రెండో ర్యాపిడ్ మ్యాచ్‌లో 38 ఏళ్ల హంపి తెల్ల పావులతో ఆడగా.. దివ్య నల్ల పావులతో ఎత్తులు వేసింది. అయితే, ఈ టై బ్రేక్‌లో 38 ఏళ్ల హంపి చేసిన తప్పిదాల ఫలితంగా 19 ఏళ్ల దివ్య చాంపియన్‌గా అవతరించింది.ఈ గెలుపుతో దివ్య గ్రాండ్ మాస్టర్‌గా ప్రమోషన్ పొందడంతో పాటు.. క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఇక హంపిపై గెలిచిన అనంతరం దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది.దివ్య భావోద్వేగం‘‘ఇలా నేను గ్రాండ్ మాస్టర్ అవుతానని ఊహించలేదు. నా విధిరాతలో ఇది ఉంది. ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందు నాకు ఈ హోదా లేదు. ఈ విజయం నాకెంతో విలువైనది. ఇంకా నేను సాధించాల్సినవి చాలానే ఉన్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అంటూ దివ్య దేశ్‌ముఖ్ ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా దివ్య తల్లి ఆమెను అక్కున చేర్చుకుని.. విజయ గర్వంతో ఉప్పొంగిపోయారు. దివ్య కంటే ముందు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్.వైశాలి గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు.ట్రై బ్రేకర్ ఇలా..టైబ్రేక్‌లలో 10 నిమిషాల చొప్పున రెండు రాపిడ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి కదలిక తర్వాత 10 సెకన్ల ఇంక్రిమెంట్ ఉంటుంది. స్కోరు సమంగా ఉంటే, ప్రతి కదలిక తర్వాత మూడు సెకన్ల ఇంక్రిమెంట్లతో రెండు, ఐదు నిమిషాల మ్యాచ్‌లు ఆడతారు. టై కొనసాగితే, ప్రతి కదలిక తర్వాత రెండు సెకన్ల ఇంక్రిమెంట్లతో మూడు నిమిషాల చొప్పున రెండు బ్లిట్జ్ మ్యాచ్‌లు ఆడాలి. Divya Deshmukh 🇮🇳 winner of the World Chess Cup and also now a Grandmaster!pic.twitter.com/UNmgiq33qq— Chessdom (@chessdom) July 28, 2025 -
అగ్రస్థానంలో కోనేరు హంపి
పెంగ్షుయ్ (చైనా): ప్రపంచ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్‌షిప్ బ్లిట్జ్ ఈవెంట్లో తొలి రోజు గేమ్‌లు ముగిశాక ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మొత్తం 22 రౌండ్లకుగాను తొలి రోజు శుక్రవారం 12 రౌండ్లు ముగిశాయి. 16 మంది మేటి క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ టోర్నీలో 12 రౌండ్లు పూర్తయ్యాక హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. మిగతా మూడు గేముల్లో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉంది. హారిక మూడు గేముల్లో గెలిచి, ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడిపోయింది. శనివారం మిగతా పది రౌండ్ గేమ్‌లు జరుగుతాయి. ఇదే టోర్నీ ర్యాపిడ్ విభాగంలో హారిక 14వ ర్యాంక్‌లో, హంపి 15వ ర్యాంక్‌లో నిలిచారు. . -
హారిక గేమ్ ‘డ్రా’
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ రెండో రౌండ్ మ్యాచ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో ప్రారంభించింది. ఇరాన్‌లోని టెహరాన్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. దినారా సదుకసొవా (కజకిస్తాన్)తో జరుగుతున్న రెండో రౌండ్ తొలి గేమ్ 15 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. తెల్ల పావులతో ఈ గేమ్ ఆడిన హారిక పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందలేకపోయింది. బుధవారం ఇద్దరి మధ్య రెండో గేమ్ జరుగుతుంది.


