హారిక గేమ్‌ ‘డ్రా’ | Contrasting draws for Padmini, Harika | Sakshi
Sakshi News home page

హారిక గేమ్‌ ‘డ్రా’

Feb 15 2017 1:18 AM | Updated on Sep 5 2017 3:43 AM

హారిక గేమ్‌ ‘డ్రా’

హారిక గేమ్‌ ‘డ్రా’

ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ను ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో ప్రారంభించింది.

ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ను ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో ప్రారంభించింది. ఇరాన్‌లోని టెహరాన్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. దినారా సదుకసొవా (కజకిస్తాన్‌)తో జరుగుతున్న రెండో రౌండ్‌ తొలి గేమ్‌ 15 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. తెల్ల పావులతో ఈ గేమ్‌ ఆడిన హారిక పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందలేకపోయింది. బుధవారం ఇద్దరి మధ్య రెండో గేమ్‌ జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement