breaking news
Woman set on fire
-
రెస్టారెంట్లో ప్రియురాలికి నిప్పుపెట్టాడు..
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలోని ఓ రెస్టారెంట్లో ఓ వ్యక్తి ప్రియురాలితో గొడవపడి ఆమెకు నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరాన్ సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి, ఫిలిపిన్స్‌కు చెందిన మహిళ (36)తో కలసి ఉత్తర టోక్యోలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరు వాదులాడుకుని గొడవపడ్డారు. ఆయన గాళ్ ఫ్రెండ్‌పై లిక్విడ్ పోసి నిప్పుపెట్టాడు. ఈ క్రమంలో ఆయనకు కూడా మంటలకు తగిలాయి. రెస్టారెంట్లో పనిచేస్తున్నవారు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. మంటలను ఆర్పి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ జంటకు పలుచోట్ల గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి ఉన్న వీరికి చికిత్స అందిస్తున్నారు. కాగా రెస్టారెంట్లో ఇతరులకు ప్రమాదం జరగలేదని పోలీసులు చెప్పారు. హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
లంచం ఇవ్వలేదని మహిళకు నిప్పు
బారాబంకి: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. బారాబంకి పోలీస్ స్టేషన్ వద్ద జర్నలిస్టు తల్లికి నిప్పంటించారు. ఈ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. లంచం ఇవ్వనందుకు ఇద్దరు పోలీసులు తనను అవమానించి, వేధించి, నిప్పుపెట్టారని చనిపోయేముందు బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. కాగా బాధితురాలే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పోలీసులు ఓ కేసుకు సంబంధించి రామ్ నారాయణ్ అనే వ్యక్తిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆయనను విడిపించుకునేందు కోసం భార్య నీతూ ద్వివేది పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. రామ్ నారాయణ్‌ను విడిచిపెట్టేందుకు లక్ష రూపాయలు ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారని నీతూ చెప్పింది. లంచం ఇవ్వనందుకు తనను తీవ్రంగా వేధించి నిప్పు పెట్టారని తెలిపింది. తీవ్రంగా గాయపడిన నీతూను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. కాగా పోలీసులు మాత్రం భాదితురాలే స్టేషన్ గేట్ వద్ద నిప్పుపెట్టుకుందని తెలిపారు.