breaking news
wife cheated
-
యూపీలో మరో దారుణం
మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లైన రెండు వారాలకే ప్రేమికుడితో కలిసి కుట్ర పన్ని భర్తను చంపించిందో భార్య. ఒకే గ్రామానికి చెందిన ప్రగతి యాదవ్, అనురాగ్ యాదవ్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. ప్రగతి కుటుంబ సభ్యులు ఆమెకు బలవంతంగా మార్చి ఐదో తేదీన దిలీప్ యాదవ్‌తో వివాహం జరిపించారు. అయిష్టంగానే పెళ్లి చేసుకున్న ప్రగతి ఎలాగైనా దిలీప్‌ను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అనురాగ్‌తో కలిసి దిలీప్‌ను హతమార్చాలని పథకం వేసింది. ఈ హత్యకు ఏర్పాట్లు చేయడానికి అనురాగ్‌కు ప్రగతి రూ .1 లక్ష ఇచ్చింది.రాంజీ అనే కిరాయి హంతకుడిని ఈ పని కోసం రూ.2 లక్షలకు నియమించుకున్నారు. దిలీప్ మార్చి 19వ తేదీన పని మీద కన్నౌజ్ జిల్లాకు వెళ్లి తిరిగొస్తూ పట్నా కెనాల్ సమీపంలో ఓ హోటల్ వద్ద ఆగాడు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దిలీప్ వద్దకొచ్చి తమ బైక్ పాడైందని, సాయపడాలంటూ దిలీప్‌ను తమ ఇంకో బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లారు. మార్గమధ్యంలో దిలీప్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పొలంలో పడేసి పరారయ్యారు.దిలీప్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా అప్పటికే పరిస్థితి విషమించడంతో మూడు రోజుల తర్వాత అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనాస్థలి సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తుల దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి సాయంతో కిరాయి హంతకుడు రాంజీని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచా రంతో అనురాగ్, ప్రగతిని అదుపులోకి తీసుకున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. ప్రియుడితో కలిసి..
సాక్షి, మేళ్లచెరువు(నల్లగొండ): వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య తన భర్తను హత్య చేసింది. ఈ సంఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం సీఐ శివరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కందిబండ గ్రామానికి చెందిన ముళ్లగిరి నాగరాణి అదే గ్రామానికి చెందిన మేరిగ నవీన్ అనే వ్యక్తితో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తన భర్త ముత్యాలు (28) కి తెలిసి పలుమార్లు మందలించాడు. కాగా.. తమకు అడ్డు తగులుతున్నాడని భావించి ప్రియుడు నవీన్‌తో కలిసి భర్త ముత్యాలును హత్య చేసేందుకు పథకం రచించారు. అదేవిధంగా ఈ నెల 7న ముత్యాలు కూలీ పనులకు వెళ్లి వచ్చి మద్యం సేవించి తన ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 11:30 గంటల సమయంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి ముత్యాలు మెడకు చున్నీ బింగించి గట్టిగా లాగి హత్యచేశారు. ఏమీ తెలియనట్లుగా ఉదయం తన భర్త గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించి అంతక్రియలు జరిపించింది. కాగా ముత్యాలు మృతిపై కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా హత్య చేసినట్లు ఒప్పుకొని పారిపోయింది. అనుమానంతో మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహానికి ఆదివారం తహసీల్దార్ దామోదర్‌రావు, సీఐ శివరామిరెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు. కాగా మృతుడి భార్య ఆమె ప్రియుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని ఎస్ఐ నరేష్ తెలిపారు. చదవండి: నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు -
మరో వ్యక్తితో వెళ్లిపోయిన భార్య.. భర్త పోరాటం!
జగిత్యాలజోన్ : కుటుంబపోషణకు సౌదీ వెళ్లి డబ్బు పంపిస్తే.. ఇంటివద్ద ఉన్న తన భార్య విచ్చలవిడిగా ఖర్చు చేసి.. తీరా తనను కాదని వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోందని.. పలుమార్లు నిలదీసినా.. దబాయిస్తోందని ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగాడు. తనకు న్యాయం చేయాలని ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని ఆమరణ దీక్షకు పూనుకున్నాడు. బాధితుడి వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయిత్పల్లి గ్రామానికి చెందిన సంటి హనుమయ్యకు పదేళ్లక్రితం ఓ మహిళతో వివాహం అయ్యింది. అనంతరం ఉపాధి నిమిత్తం సౌదీ దేశానికి వెళ్లాడు. అక్కడ ఐదు సంవత్సరాలు కష్టపడి ఇంటి దగ్గర ఉన్న భార్యకు రూ. 14 లక్షల వరకు పంపించాడు. ఆ డబ్బులను సదరు మహిళ ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేసింది. విదేశాల నుంచి వచ్చిన హనుమయ్య డబ్బుల విషయమై నిలదీయగా ‘నా ఇష్టం.. నీకు లెక్క చెప్పను.. ఏం చేసుకుంటావో.. చేసుకో..పో’ అని దబాయించిందని బాధితుడు వాపోయాడు. దీంతో దంపతుల మధ్య గొడవ ముదిరింది. ఈ క్రమంలో తన భార్య వేరొక వ్యక్తి వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు హనుమయ్య గ్రహించాడు. ఈ విషయమై ఇద్దరినీ నిలదీశాడు. మార్పు రాకపోవడంతో పెగడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు వ్యక్తిపై పోలీసులు ఈ ఏడాది మే 23న కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఇటీవలే బెయిల్‌పై అతను బయటకు వచ్చాడు. దీందో హనుమయ్య భార్య ఆ వ్యక్తితో వెళ్లిపోయింది. కొందరు వ్యక్తుల కారణంగానే తన కాపురం కూలిపోయిందని, డబ్బు ఖర్చు అయ్యిందని సదరు వ్యక్తులపై చర్య తీసుకోవాలని గ్రామ పెద్దలను, పలువురు అధికారులను వేడుకున్నాడు. ఫలితం లేకపోవడంతో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఓ ఫ్లెక్సీని ఏర్పాటుచేసి, అమరణ దీక్షకు దిగాడు. పోలీసులు అక్కడకు చేరుకుని హనుమయ్యను స్టేషన్‌కు తరలించారు. -
దారుణం: భర్తకు విషపు ఇంజక్షన్ ఇచ్చి..
బెంగుళూరు: తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి వివాహం చేసుకున్న ఓ యువతి తన భర్తకు విషపు ఇంజక్షన్ ఇచ్చి అతడి చావుకు కారణమైంది. హాసన్ నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి... హాసన్ సమీపంలోని కిత్తనగర గ్రామానికి చెందిన విశ్వనాథ్(28), ఆశ(25)కు ఈ ఏడాది ఫిబ్రవరి 16న వివాహమైంది. మెట్టినింటికి వెళ్లి సేద్యం పనులు చేయలేనని భర్తకు తెగేసి చెప్పిన ఆమె కొన్నిరోజులకే పుట్టింటికి వచ్చేసింది. పెద్దలు పంచాయతీ పెట్టి సర్దిచెప్పి ఆమెను భర్త వద్దకు పంపారు. ఈ క్రమంలో తన భర్తను స్నేహితుడి బర్త్‌డే పార్టీకి తీసుకెళ్లింది. హాసన్మహారాజ పార్కులో భర్తకు విషం మాత్రలు మింగించి విషం ఇంజెక్షన్ వేసి ఇంటికి వెళ్లిపోయింది. తన భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని నాటకం ఆడింది. ఇదిలా ఉండగా స్పృహలోకి వచ్చిన విశ్వనాథ్ అతికష్టం మీద ఇంటికి చేరుకుని జరిగిన విషయం తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో వెంటనే అతడిని హాసన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ తర్వాత మైసూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై హాసన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లో ఇల్లాలు.. అటకపై ప్రియురాలు
తనతో పాటు కన్న పిల్లలను కూడా పట్టించుకోకుండా ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. అతగాడికి బడిత పూజ చేసింది. చెప్పుదెబ్బలతో బుద్ధిచెప్పింది. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంటలో జరిగింది. దండిగుంటకు చెందిన వెంకటేష్ - స్వప్న 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వెంకటేష్ నాలుగేళ్లుగా భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. భార్యకు సమీప బంధువైన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటికి కూడా వెళ్లకుండా మొఖం చాటేశాడు. విషయం తెలుసుకున్న భార్య... తన బంధువులతో కలిసి భర్త ప్రియురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వాళ్లను చూసిన వెంకటేష్.. తన ప్రియురాలిని అటకెక్కించాడు. ఆగ్రహించిన భార్య... భర్తకు, అతని ప్రియురాలికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించింది.