ఇంట్లో ఇల్లాలు.. అటకపై ప్రియురాలు | wife catches husband red handed with lover | Sakshi
Sakshi News home page

ఇంట్లో ఇల్లాలు.. అటకపై ప్రియురాలు

Feb 15 2016 4:12 PM | Updated on Sep 3 2017 5:42 PM

ఇంట్లో ఇల్లాలు.. అటకపై ప్రియురాలు

ఇంట్లో ఇల్లాలు.. అటకపై ప్రియురాలు

తనతో పాటు కన్న పిల్లలను కూడా పట్టించుకోకుండా ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. అతగాడికి బడిత పూజ చేసింది. చెప్పుదెబ్బలతో బుద్ధిచెప్పింది.

తనతో పాటు కన్న పిల్లలను కూడా పట్టించుకోకుండా ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..  అతగాడికి బడిత పూజ చేసింది. చెప్పుదెబ్బలతో బుద్ధిచెప్పింది. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంటలో జరిగింది. దండిగుంటకు చెందిన వెంకటేష్‌ - స్వప్న 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే వెంకటేష్‌ నాలుగేళ్లుగా భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. భార్యకు సమీప బంధువైన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటికి కూడా వెళ్లకుండా మొఖం చాటేశాడు. విషయం తెలుసుకున్న భార్య... తన బంధువులతో కలిసి భర్త ప్రియురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వాళ్లను చూసిన వెంకటేష్‌.. తన ప్రియురాలిని అటకెక్కించాడు. ఆగ్రహించిన భార్య... భర్తకు, అతని ప్రియురాలికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement