breaking news
Vivaan
-
రజతం గెలిచిన వివాన్
దోహా: ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో గురువారం భారత్‌కు మూడు పతకాలతోపాటు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ బెర్త్ కూడా లభించింది. పురుషుల ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో వివాన్ కపూర్ రజత పతకం గెలిచాడు. దాంతోపాటు భారత్‌కు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో నిర్ణీత 30 షాట్ల తర్వాత వివాన్ (భారత్), అబ్దుల్ రహ్మాన్ అల్ఫైన్ (కువైట్) 29 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్ణయించారు.మూడో షాట్లో వివాన్ గురి తప్పగా... అల్ఫైన్ సఫలమయ్యాడు. దాంతో అల్ఫైన్కు స్వర్ణం, వివాన్‌కు రజతం లభించాయి. 22 పాయింట్లతో కియింగ్ (చైనా) కాంస్యం సాధించాడు. ఫైనల్లో పోటీపడ్డ భారత మరో షూటర్ ఉదయ్‌వీర్ సింగ్ 11 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. అంతకుముందు నాన్ ఒలింపిక్ కేటగిరీ అయిన పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో అంకుర్ గోయల్ (భారత్) 583 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. అంకుర్ గోయల్, అమన్‌ప్రీత్ సింగ్, రాజ్కన్వర్ సింగ్‌లతో కూడిన భారత బృందం 1727 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. నేటితో ముగియనున్న ఈ మెగా ఈవెంట్లో భారత్ 2 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 13 పతకాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్, పురుషుల ట్రాప్ ఈవెంట్లో భారత్‌కు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు లభించాయి. -
వివాన్–నీరూ జోడీకి కాంస్యం
అల్మాటీ (కజకిస్తాన్): ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్‌ను భారత జట్టు ఏకైక కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వివాన్ కపూర్–నీరూ ద్వయం కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. నాలుగు జోడీల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో వివాన్–నీరూ జంట 24 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. యాంగ్ కున్ పి–లియు వాన్ యు (చైనీస్ తైపీ) జోడీ 36 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని గెలిచింది. 33 పాయింట్లతో మౌరో డె ఫిలిపిస్–మరియా స్టాంకో సిల్వానా (ఇటలీ) జంట రజత పతకాన్ని కైవసం చేసుకుంది. -
టోగో జైలు నుంచి విడుదలైన సునీల్
పశ్చిమ ఆఫ్రికాలోని టోగో జైలు నుంచి భారతీయ నౌక కెప్టెన్ సునీల్ జేమ్స్‌తో పాటు మరో భారతీయుడు నావికుడు విజయన్ విడుదలయ్యారు. ఈ మేరకు టోగోలో భారత రాయబారి కె.జీవ సాగర్ సమాచారం అందించారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం ఇక్కడ వెల్లడించారు. వారిద్దరు ఈ రోజు భారత్‌కు బయలుదేరతారని తెలిపారు. ఈ ఏడాది జులైలో వారిద్దరిని టోగో దేశాధికారులు అరెస్ట్ చేశారు. అయితే డిసెంబర్ 2వ తేదీని సునీల్ జేమ్స్ 11 మాసాల వయస్సు గల కుమారుడు వివన్ తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. దీంతో టోగో జైల్లో ఉన్న తన భర్తను విడుదల చేయాని సునీల్ భార్య అదితితోపాటు విజయన్ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో అంశంపై ఆ దేశ ఉన్నతాధికారులతో చర్చించాలని టోగోలోని భారత రాయబారి జీవ సాగర్ని భారత ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జీవ సాగర్ టోగో ఉన్నతాధికారగణంతో సంప్రదింపులు జరిపి భారతీయ నావికలు ఇద్దరు విడుదలకు మార్గం సుగమం చేశారు. సునీల్ విడుదల కావడంతో ఆయన కుటుంబ సభ్యులు గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.


