breaking news
vist
-
7,8లలో ప్రధాని మోదీ మలేషియా పర్యటన
న్యూఢిల్లీ: మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల(ఫిబ్రవరి) 7, 8 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కీలక చర్చలు జరగనున్నాయి. మోదీ మలేషియాలో పర్యటించడం ఇది మూడోసారి. 2024, ఆగస్టులో ఇరు దేశాల మధ్య కుదిరిన ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ తర్వాత ప్రధాని మోదీ చేస్తున్న పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, అన్వర్ ఇబ్రహీంలు భారత్-మలేషియా సంబంధాలలోని పలు అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సముద్ర తీర సహకారం తదితర రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వీటితో పాటు డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని ఇరు దేశాల నేతలు సమీక్షించనున్నారు. భవిష్యత్తులో రెండు దేశాల ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మలేషియాలోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. పారిశ్రామిక, వ్యాపార రంగ ప్రముఖులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ‘10వ భారత్-మలేషియా సీఈఓ ఫోరమ్’ కూడా జరగనుంది. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడం ద్వారా ఇరు దేశాల మైత్రిని మరింత పటిష్టం చేయడమే ఈ భేటీల ప్రధాన ఉద్దేశం. భారత్- మలేషియాల మధ్య సుదీర్ఘమైన చారిత్రక, నాగరికత, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. -
అయోధ్యలో ఫ్యామిలీతో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ సందడి (ఫొటోలు)
-
14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన
సాక్షి, అమరావతి: ఈ నెల 14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు వాయుమార్గంలో చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం జిల్లా మకరంపురం గ్రామానికి సీఎం చేరుకుంటారు. ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభిస్తారు. పలాస చేరుకుని వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్‌ను ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి పలాస రైల్వే గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు హాజరవుతారు. తిరుగు ప్రయాణమై తాడేపల్లి చేరుకుంటారు. -
నేడు విజయవాడకు సీఎం జగన్
సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు ఆయన ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంకు చేరుకుని పోలీస్ అమరవీరుల సంస్మరణదినం కార్యక్రమంలో పాల్గొంటారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఉదయం 10.20 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి అక్కడ గవర్నర్‌ను కలిసిన అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళతారు. అక్కడ ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు
ఏలూరు(సెంట్రల్) : ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వారి వివరాలను అత్యంత గోప్యంగా అవినీతి నిరోధక శాఖ సేకరిస్తోందని, శాఖ కార్యాలయాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో ఉన్నామని ఏసీబీ డైరెక్టర్ జనరల్(డీజీ) ఆర్పీ ఠాకూర్ తెలిపారు. బుధవారం జిల్లా ఏసీబీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. తొలుత నిర్మాణంలో ఉన్న ఏసీబీ కొత్త భవనాన్ని ఆయన పరిశీలించి, కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. నిర్మాణంలో జాప్యంపై ప్రశ్నించారు. వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతి నిరోధక శాఖ 2015–16 సంవత్సరాలలో జిల్లాలో నమోదు చేసిన కేసులను సమీక్షించేందుకు వచ్చానని తెలిపారు. అవినీతికి పాల్పడేవారెవరైనా ఉపేక్షించేది లేదని, డిజిటలైజేషన్లో భాగంగా ఇప్పటికే అవినీతి నిరోధక శాఖకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రత్యేక వాట్సప్ నంబరును అందుబాటులో ఉంచామన్నారు. అవినీతికి పాల్పడే వారి వివరాలను తమకు వాట్సప్ ద్వారా తెలియజేస్తే చాలని, తదుపరి తాము ఆయా అంశాలపై విచారణ జరిపి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. తాను కొత్తగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ నంబరును (8333995858) ప్రజలకు అందుబాటులో తెచ్చానని, ఇప్పటికే రాష్ట్రంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఠాకూర్ తెలిపారు. ఏసీబీ అదనపు డీజీ అబ్రహాం లింకన్, జాయింట్ డైరెక్టర్ మోహనరావు, డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐ యుజె.విల్సన్, ట్రాఫిక్ డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్ ఆయనతోపాటు ఉన్నారు. -
నేడు నెల్లూరు జిల్లాకు క్రికెట్ లెజెండ్ సచిన్


