ఆ ఐదుగురు పర్యాటకులే: విశాఖ ఎస్పీ
విశాఖ : తాము అదుపులోకి తీసుకున్న ఐదుగురు అనుమానితులను విశాఖ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ పర్యాటకులుగా నిర్థారించారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని కాగిత (వేంపాడు) టోల్‌గేటు వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు విదేశీయులను నిన్న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర నిఘా బృందం కూడా ఇరాన్ దేశీయుల వద్ద ఆధారాలను పరిశీలించిందని, ఒడిశా పోలీసులు ఎందుకు వారిని అనుమానించారో తెలియాల్సి ఉందని ఆయన గురువారమిక్కడ తెలిపారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న ఐదుగురి పాస్‌పోర్టులు, వీసాలను పోలీసులు పరిశీలించారు.