breaking news
vermi compost
-
27 ఏళ్లకే భర్త దూరం : రూ. 500తో మొదలై రూ.75 లక్షల టర్నోవర్
దృఢ సంకల్పానికి, స్ఫూర్తికి ప్రతీక ఆమె కథ. జీవితంలో అడుగడుగునా కష్టాలే అయినా పట్టుదలతో అద్భుతమైన విజయం సాధించింది. అచంచల కృషితో తన జీవితాన్ని మార్చుకోవడం మాత్రమే కాదు, తన తోటివారికి స్వీయ సాధికారత స్ఫూర్తి నందించిన మహిళ. కేవలం రూ. 500 పెట్టుబడితో ప్రారంభమైన ఆమె వ్యాపారం నేడు ఏటా రూ.75 లక్షల టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది.ఎవరా మహిళ? ఆమె విజయ రహస్యం ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలోఅస్సాంలోని నల్బారి జిల్లాకు చెందిన కనికా తాలూక్దార్ కథ ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక ప్రయాణం. 27 ఏళ్ల వయసులోనే 2008లో ఒక రోడ్డు ప్రమాదంలో తన భర్తను కోల్పోయినప్పుడు ఆమె ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు.ఉన్నత చదువులు లేవు, స్థిరమైన ఆదాయం లేదు. ఉన్నదల్లా నాలుగు నెలల కూతురు, అత్తామామలను పోషించేబాధ్యత. కానీ, ఆమె అధైర్యపడకుండా ఎదురొడ్డి నిలబడాలని నిర్ణయించుకుంది.ఆమె చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. 2014లో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. స్థానిక స్వయం సహాయక సంఘం (SHG)లో చేరారు. అక్కడ 'జీవిక సఖి'గా బాధ్యతలు చేపట్టడం వల్ల పొదుపు, బృందకృషి, చిన్న తరహా వ్యాపారాలపై ఆమెకు అవగాహన వచ్చింది.రూ.500 పెట్టుబడితో ప్రయోగంనల్బారిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ మనోషి చక్రవర్తి ఇచ్చిన వర్మీకంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారీ శిక్షణ కనికను ఎంతగానో ఆకర్షించింది. దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదని గ్రహించిన ఆమె, కేవలం రూ. 500లతో తన తల్లిదండ్రుల ఇంటి పెరట్లో ఒక కిలో వానపాములతో వర్మీ కంపోస్ట్ వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పట్టుదల, నేర్చుకోవాలనే తపనతో, ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆవు పేడ ,ఆకుల వంటి స్థానికంగా లభించే వనరులను ఉపయోగించుకుంటూ, వర్మీకంపోస్టింగ్ తయారీ పనిని స్వీకరించింది.మొదట్లో అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, కనిక పట్టుదల ఫలించింది. కొనేందుకు డబ్బుల్లేక చుట్టుపక్కల లభించే కూరగాయల వ్యర్థాలు, ఎండిన ఆకులను సేకరించి మొదటి బ్యాచ్ ఎరువును సిద్ధం చేసేది. ఇదే 'జయతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్' సంస్థకు పునాది. రసాయన ఎరువులకు అలవాటు పడిన స్థానిక రైతులు మొదట్లో ఆమె సేంద్రియ ఎరువును కొనేందుకు అస్సలు ఆసక్తి చూపలేదు. కానీ కనిక వెనకడుగు వేయలేదు.2018 నుండి ఆమె స్వయంగా రైతులను కలిసి, చిన్న చిన్న సంఘాలను ఏర్పాటు చేసి వర్మీకంపోస్ట్ వల్ల నేల తల్లికి జరిగే మేలును వివరించడంతో పాటు, స్థానిక రేడియో ఛానళ్ల ద్వారా కూడా దీనిపై అవగాహన కల్పించేది. ఆమె పట్టుదలకు ఫలితంగా మెల్లమెల్లగా రైతులు ఆమె ఉత్పత్తులను నమ్మడం, కొనడం ప్రారంభించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది, తన కార్యకలాపాలను విస్తరించింది. తన ఉత్పత్తులను వైవిధ్యపరిచింది. వర్మీకంపోస్ట్ వ్యాపారం నెలకు రూ. 3.5 లక్షల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి ఎదిగింది. అలా 2017లో 'జయతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్' బ్రాండ్‌ను అధికారికంగా రిజిస్టర్ చేశారు. 2019లో జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) మద్దతుతో ఆమె తన ఉత్పత్తులను Amazon, Flipkart , ప్రభుత్వ రంగ పోర్టల్ GeM (Government e-Marketplace) లలో విక్రయించడం ప్రారంభించింది. GeM పోర్టల్ ద్వారా ప్రభుత్వ శాఖల నుండి పెద్ద మొత్తంలో వార్షిక కాంట్రాక్టులు రావడంతో వ్యాపారం స్థిరపడింది.ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ (NeedHub), IIM కలకత్తా, NRETP ల నుండి ఆమెకు రూ. 27.50 లక్షల బిజినెస్ గ్రాంట్లు లభించాయి. ఈ నిధులతో ఆమె మౌలిక సదుపాయాలను పెంచుకున్నారు. కేవలం ఒకటిన్నర బిఘాల సొంత స్థలం నుంచే ఈ వ్యాపారాన్ని నడుపుతుండటం విశేషం.ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!నెలకు ఏకంగా 70 టన్నుల వర్మీకంపోస్ట్‌ను ఉత్పతి చేస్తూ, ఈ విక్రయాల ద్వారా ఆమె ఏడాదికి రూ. 70 లక్షల నుండి రూ.75 లక్షల ఆదాయాన్ని గడిస్తోంది. వర్మీకంపోస్ట్‌తో పాటు ఆర్గానిక్ పురుగుమందులు, ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్ (గోమయ అగర్బత్తి) కూడా తయారు చేస్తున్నారు. దీనికిగానూ 2019లో ICAR నుంచి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.భవిష్యత్తులో దేశవ్యాప్తంగా తన ఆన్లైన్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని, అలాగే తనలాంటి ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించి, రసాయన రహిత స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కనిక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక సాధారణ మహిళ అనుకుంటే జీరో నుంచే తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలదు అనేందుకు కనికా తాలూక్దార్ జీవితమే ఒక సజీవ సాక్ష్యం.ఇదీ చదవండి: రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం! -
సెల్ఫ్ వాటరింగ్ బెడ్!
మేడల మీద కుండీలు, బ్యాగ్‌లలో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయడంపై కేరళవాసులు అధిక శ్రద్ధ చూపుతుంటారు. సృజనాత్మకతను జోడించి తక్కువ శ్రమతో చేసే మెలకువలను అనుసరిస్తూ ఉంటారు. తిరువనంతపురానికి చెందిన షాను మనోహర్ అనే యువకుడు సెల్ఫ్ వాటరింగ్ బ్యాగ్స్‌తో బెడ్‌ను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ పద్ధతిలో ప్రతి బ్యాగ్/కుండీలోనూ నీరు పోయాల్సిన పనిలేదు. పీవీసీ పైపులో నీరు పోస్తే చాలు.. పైపుల్లో నుంచి వత్తి ద్వారా అనుసంధానమై ఉండే బాగ్స్‌లోని మొక్కల వేర్లకు తగినంత నీటి తేమ నిరంతరం అందుతూ ఉంటుంది. తక్కువ శ్రమతో చక్కగా ఇంటిపంటలు పండించుకోవచ్చు. షాను మనోహర్ ఇంటిపంటలను ఏర్పాటు చేసే సర్వీస్ ప్రొవైడర్‌గా స్వయం ఉపాధి పొందుతూ ఇంటిపంటల సాగుదారుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఆయన చేస్తున్నదేమిటో ఫొటోలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.. 1. పీవీసీ పైపులతో ఇలా మూడు వరుసల బెడ్‌ను ఏర్పాటు చేస్తున్నాడు. పైపుల చివరలను కూడా మూసేస్తారు. కేవలం పైనుంచి నీరు పోయడానికి ఒక చోట అవకాశం ఉంటుంది. ఇందులో పోసిన నీరు బయటకు పోదు. నీరు రోజూ పోయాల్సిన అవసరం లేదు. అయిపోయినప్పుడు మళ్లీ నీరు పోస్తే సరిపోతుంది. వాతావరణాన్ని బట్టి కొద్ది రోజులకోసారి నీరు పోస్తే సరిపోతుంది. 2. ఇది ఒక వత్తి. కిరసనాయిలు దీపంలోని వత్తి మాదిరిగా ఇది పనిచేస్తుంది. కింది పైపుల్లో నుంచి ఈ వత్తి ద్వారా గ్రోబ్యాగ్స్‌లోని మొక్కల వేళ్లు నీటి తేమను తీసుకుంటూ ఉంటాయి. పంటు మొక్కలు ఏపుగా పెరిగి ఫలసాయాన్నిస్తాయి. 3. గ్రోబ్యాగ్‌కు అడుగున బెజ్జం పెట్టి.. వత్తిని ఇలా అమర్చాలి.. 4. వత్తి గ్రోబ్యాగ్ లోపలకు సగం, కిందికి సగం ఉండేలా చూసుకోవాలి. 5. గ్రోబ్యాగ్‌లో ఎర్రమట్టి, కొబ్బరిపొట్టు, పశువుల ఎరువు/వర్మీకంపోస్టు/కంపోస్టు, కొంచెం వేపపిండి మిశ్రమంతో నింపాలి (నల్లమట్టిని వాడితే కొంచెం ఇసుకను కూడా కలుపుకోవాలి). వత్తి ఇలా మట్టి మిశ్రమం పై వరకూ ఉంటే పైపైనే ఉండే మొక్కల వేర్లకు కూడా నీటి తేమ అందుతూ ఉంటుంది. 6. ఇలా సిద్ధం చేసిన గ్రోబ్యాగ్‌లను పీవీసీ పైపులపై ఇలా ఉంచాలి. గ్రోబ్యాగ్ అడుగున ఉన్న వత్తిని పైపులోని బెజ్జంలోకి జొప్పించాలి. గ్రోబ్యాగ్స్ పడిపోకుండా అడుగున సరిపడా ఎత్తున్న ఇటుకలను కుదురుగా పెట్టాలి. పీవీసీ పైపులో నిండు నీరుపోసి, మూత బిగించాలి. రెండు, మూడు రోజులకోసారి మూత తీసి.. నీరు ఎంత ఉందో చూసుకుంటూ ఉండాలి. 7. ఇక అంతే.. గ్రోబ్యాగ్స్‌లో కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు విత్తుకోవచ్చు లేదా మొక్కలు నాటుకోవాలి. చక్కని రుచికరమైన రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఇంటిపంటలను తక్కువ శ్రమతో ఇలా పండించుకోవచ్చు. ఈ పద్ధతిలో నీరు ఎక్కువ, తక్కువ కావడానికి అవకాశం ఉండదు. ఉష్ణోగ్రతలను బట్టి తగుమాత్రంగా నీటి తేమను వత్తి ద్వారా గ్రోబ్యాగ్స్‌లోని మట్టి పీల్చుకుంటూ మొక్కల వేర్లకు అందిస్తూ ఉంటుంది. బాగుంది కదూ.. మరి మనమూ ట్రై చేద్దామా? మీ అనుభవాలను మెయిల్ చేయండి.. sagubadi@sakshi.com. -
వర్మి కంపోస్టుతో ప్రయోజనాలెన్నో!
– అన్ని రకాల పంటలకు ఉపయోగకరం – వ్యవవసాయశాఖ ఏడీ రామేశ్వరరెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : వానపాములతో తయారైన వర్మీ ఎరువులో 16 రకాల పోషకాలు ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన పంటల్లో విస్తృతంగా వాడుకోవచ్చని వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ సహాయ సంచాలకులు పి.రామేశ్వరరెడ్డి తెలిపారు. వర్మీ అంటే: కుళ్లిన కూరగాయలు, పండ్లు, చెత్తాచెదారం, కొబ్బరి పీచు, పశువుల పేడ మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుని విసర్జించే పదార్థాన్ని వర్మీ ఎరువు లేదా వర్మి కంపోస్టుగా పిలుస్తారు. నేల పైపొరల్లో సంచరించే వానపాములు కంపోస్టును తయారీ చేస్తాయి. దీన్నే వర్మీ కల్చర్‌గా పిలుస్తారు. విరివిగా పోషకాలు: నత్రజని, భాస్వరం, పొటాష్ లాంటి స్థూల (మ్యాక్రో), జింక్, బోరాన్, మెగ్నీషియం లాంటి సూక్ష్మపోషకాల (మైక్రోన్యూట్రియంట్స్)తో సేంద్రియ కర్బనం లాంటివి ఉన్నందున వర్మీ వాడకం వల్ల పంటల్లోమంచి దిగుబడులు వస్తాయి. అధిక దిగుబడుల ఆశతో ఇటీవల కాలంలో విచక్షణా రహితంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూసారం తగ్గడం, చీడపీడలు, తెగుళ్ల ఉధృతి పెరిగింది. ఫలితంగా పంట దిగుబడులు తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పశువుల ఎరువు, వర్మీ లాంటి సేంద్రియ పోషకాలపై రైతులు దృష్టి పెట్టాలి. లేదంటే భవిష్యత్తులో వ్యవసాయం మరింత నష్టాలు తెచ్చిపెడుతుంది. భూసార పరీక్షల ఆధారం చేసుకుని రసాయనాలు, సేంద్రియ పదార్థాలు కలిపిన సమగ్ర సమతుల్య ఎరువుల యాజమాన్యంతోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. వర్మీ తయారీలో వానపాముల రకాలు: బొరోయింగ్ రకానికి చెందిన వానపాములు భూమి లోపలిపొరల్లో వుండి 80% మట్టిని, 20% ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి మొక్కలకు పోషకాల తయారీ, రవాణాలోనే కాక పైర్లకు అనుకూలమైన వాతావరణాన్ని కలుగజేస్తాయి.. నాన్–బొరోయింగ్ రకానికి చెందిన వానపాములు భూమి పైపొరల్లో వుంటూ∙20% మట్టిని, 80% ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి వ్యర్థపదార్థాలను త్వరగా కంపోస్టుగా మారుస్తాయి. ఇవి నేల యొక్క రసాయనిక, జీవ స్వభావాన్ని మార్చి భూసారాన్ని పెంచుతాయి. తయారు చేసే విధానం: ఎండ, వాన నుంచి వానపాముల రక్షణ కోసం షెడ్డు ఏర్పాటు చేయాలి. భూమిపై ఒక అడుగు ఎత్తు, ఒక గజం వెడుల్పులో బెడ్లు తయారు చేసుకోవాలి. అడుగుభాగాన ఒక అంగుళం మందాన ఇటుక పెళ్లలు వేయాలి. ఆపైన మరో అంగుళం మట్టి వేయాలి. చీమలు, పురుగులు, చెదలు నివారణకు వేపాకులు గాని కానుగాకులు గానీ చల్లాలి. ఆపైన మూడు అంగుళాల మందాన కుళ్లిన వ్యవసాయ వ్యర్థ పదార్థాలు లేదా పశువుల పేడ, పచ్చి ఆకులు, ఎండిన ఆకులు, గడ్డి, కూరగాయలు, పండ్ల తొక్కలు, కొబ్బరి పీచు వంటివి వేయాలి. తర్వాత చదరపు మీటరకు 1000 వానపాములను వేయాలి. వానపాములు ఈ పదార్థాలను సేంద్రియ ఎరువుగా మారుస్తాయి. వర్మీ ఎరువు వాడటం వల్ల భూమి గుళ్లబారి, నీటి నిల్వ శక్తి, మొక్కలో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అన్ని రకాల పంటలకు వేయడం వల్ల మంచి దిగుబడులు వస్తాయి.


