breaking news
veligonda praject
-
బాబు సాష్టాంగం నమస్కారం.. చెప్పని అసలు లెక్క ఇదే!
దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కొంత మేర అయినా సాకారం అవడం సంతోషమే. మార్కాపురం, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు నీరందించాలని ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే పరిస్థితి ఇంకా రావల్సి ఉంది. ప్రస్తుతానికి తామేదో చేసేశామని చెప్పుకోవడం కోసం కూటమి ప్రభుత్వం తంటాలు పడింది. దీనికి ఎల్లో మీడియా విపరీతమైన హైప్ ఇచ్చింది.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరంభించిన వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నీరు వదలే అవకాశం రావడం అదృష్టమే. చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తన పేరు గుర్తుంచుకునేలా చేసిన కార్యక్రమం పెద్దగా ఏదీ లేదని చాలామంది అంటారు. అయితే గత ప్రభుత్వాలు చేసిన వివిధ పనులను తనవిగా ప్రొజెక్టు చేసుకోవడంలో ఆయనను మించిన వారు మరొకరు ఉండకపోవచ్చు. దానిని క్రెడిట్ చోరీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పెట్టారు. ఉన్నవి, లేనివి ఏవేవో అంకెలు చెబుతూ చంద్రబాబు ఉపన్యాసాలు చేస్తుంటారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అదే జరుగుతోంది.తానే శంకుస్థాపన చేశానని, తానే ప్రారంభిస్తున్నానని ఆయన చెబుతారు. అంతవరకు నిజమే. కాని అసలు పనిచేసింది ఎవరు అన్నది మాత్రం చెప్పరు. అందువల్లే కృష్ణా నది నుంచి నీటిని తరలించే బృహత్తర పథకంలో వెలిగొండ ప్రాజెక్టు వివిధ దశలకు సంబందించి తన పాత్రను వివరించలేకపోయారు. నిజానికి చంద్రబాబుకు వచ్చిన రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉంటే ఉమ్మడి ఏపీలో ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తి అయి ఉండేవి.1996 ఎన్నికలకు ముందు జనాన్ని మాయ చేయడం కోసం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వాటిలో అత్యధికం అంతకుముందు ఎన్టీఆర్ ప్రభుత్వంలో వచ్చిన ప్రతిపాదనలే. చంద్రబాబు శిలాఫలకాలైతే వేశారు కాని, వాటిని ముందుకు తీసుకువెళ్లలేదు. భారీ ప్రాజెక్టులపై ఆయనకు గతంలో పెద్దగా నమ్మకం లేకపోవడమే కారణం. అవి సకాలంలో పూర్తి కావని, రాజకీయంగా లబ్ది చేకూరదన్నది ఆయన ఉద్దేశం.చంద్రబాబు 1998 ప్రాంతంలో ఏపీ ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. అందులో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. వైఎస్ అప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనకు పలు ఆందోళనలు చేశారు. ఆ నేపథ్యంలో చంద్రబాబుకు ఒక హెచ్చరిక చేస్తూ, నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే చరిత్ర హీనుడవుతావు.. అని వ్యాఖ్యానించడం సంచలనం అయింది. అయినా చంద్రబాబు పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. బీజేపీతో కలిసి పోటీచేయడం ద్వారా 1999 ఎన్నికలలో గెలవలిగారు. వాజ్ పేయిపై జనంలో ఉన్న సానుభూతి కలిసి వచ్చింది.ఆ తర్వాత కూడా ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండేవి. దాంతో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో ఉమ్మడి ఏపీలో ప్రతి ప్రాజెక్టు స్థలాల వద్దకు వెళ్లి శంకుస్థాపన ఫలకం పక్కన మొక్కలు నాటి నిరసన తెలిపారు. వాటిలో వెలిగొండ కూడా ఒకటి. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి క్యాబినెట్ లోనే నీటిపారుదల ప్రాజెక్టుల రిపోర్టును అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సీవీఎస్ కె శర్మ ప్రవేశపెట్టారు. వాటి వివరాలు చూసిన ఆనాటి మంత్రి జేసీ దివాకరరెడ్డి ఇన్ని ప్రాజెక్టులకు అవకాశం ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. దానికి శర్మ సమాధానం ఇస్తూ, ఆయన ప్రాధాన్యతలు వేరు, ప్రాజెక్టులను మీరు చేస్తామంటున్నారు.. అందుకే నివేదిక సమర్పించాను అని బదులు ఇచ్చారట.తదుపరి వైఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం, పులిచింతలతో సహా వివిధ ప్రాజెక్టులు చేపట్టి, పూర్తి చేస్తామని ప్రకటించారు. తదనుగుణంగానే ఆయన భారీ ఎత్తున ప్రారంభించారు. అప్పట్లో పోలవరం ప్రాజెక్టును ఓ రకంగా చంద్రబాబు వ్యతిరేకించారు. ఆ ప్రాజెక్టులో కొన్ని సమస్యలు ఉన్నాయని అప్పట్లో ఒక టీవీ చానల్‌తో అన్న వీడియో ప్రస్తుతం సర్కులేషన్‌లోకి వచ్చింది. అలాగే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం సాంకేతికంగా సాధ్యం కాదన్న అభిప్రాయంతో దానిని చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి విదేశాల నుంచి కొండలు తొలిచే యంత్రాలను తెప్పించి సొరంగాల నిర్మాణం ఆరంబించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. దీనిని చంద్రబాబు కాదనగలరా అన్నది ఒక ప్రశ్న. వైఎస్ మరణంతో ఈ ప్రాజెక్టులలో జాప్యం జరిగిన మాట వాస్తవం. తదుపరి రాష్ట్ర విభజన, ఏపీకి 2014లో చంద్రబాబు సీఎం కావడం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా ఆయన వాడుకోలేకపోయారు. వెలిగొండపై పెట్టవలసినంత శ్రద్ద పెట్టలేకపోయారనిపిస్తుంది. కాకపోతే వ్యయ అంచనాలు పెంచేయడం ద్వారా కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చారన్న విమర్శ వచ్చింది.ఇవి కూడా చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?వైఎస్ రాజశేఖర్‌రెడ్డి టైమ్‌లో సుమారు 20 కిలోమీటర్ల సొరంగం తీయడమే కాకుండా, రిజర్వాయిర్‌ను చాలావరకు ముందుకు తీసుకువెళ్లారు. చంద్రబాబు టైమ్‌లో కేవలం సుమారు ఆరు కిలోమీటర్లకే టన్నెల్ తవ్వారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ పది కిలోమీటర్ల టన్నెళ్లను పూర్తి చేసి, అవసరమైన ముఖ్యమైన కాల్వలను తవ్వించారు. తదుపరి వాటిని జాతికి అంకితం చేశారు. అయితే మానవత్వ కారణాలతో రిజర్వాయిర్ నిర్మాణం వల్ల నిర్వాసితులు అయ్యేవారికి పూర్తి స్థాయిలో పరిహారం, సహాయం అందించి వారు సెటిల్ అవడం కోసం నీళ్లను వదలే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జగన్ తిరిగి గెలిచి ఉంటే బహుశా 2024 జూన్, జూలైలలో ఆ పని కూడా అయిపోయేదేమో! కాని ఎన్నికలలో ఓటమి ఎదురవడంతో ఆగిపోయింది.కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లపాటు ముందుకు సాగలేదు. ఒక మిషన్ టన్నెల్లో విరిగిపోయిందని, ఆ కాంట్రాక్టర్ స్టే తెచ్చుకున్నారని చంద్రబాబు చెబుతున్నారు. కాని అది సాకేనేమో అనిపిస్తుంది. నిర్వాసితులకు 2024లోనే ఎందుకు పరిహారం ఇవ్వలేకపోయారు? గ్రామాలను ఖళీ చేయించలేదు? ఒక టన్నెల్ ద్వారా అయినా నీటిని ఇచ్చి ఉండవచ్చు కదా! అలా చేస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డికు, జగన్‌కు జనం క్రెడిట్ ఇస్తారన్న ఉద్దేశంతోనే ఆ పని చేయలేదన్నది వైఎస్సార్సీపీ విమర్శ. ఇప్పటికీ నిర్వాసితులు సెటిల్ కాకముందే నీటిని వదలడంతో ఎన్ని వందల కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయన్నది తెలిసిన విషయమే.బాధితులు మంత్రిని, కలెక్టర్ తదితర అధికారులను నిలదీసిన, ఆగ్రహం వ్యక్తం చేసిన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ సందర్భంలో ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌ల కృషిని కూడా అభినందించి ఉంటే, చంద్రబాబుకు వయసుకు తగ్గట్లుగా హుందాగా ఉండేది. అలా చేయకపోగా వైఎస్సార్సీపీపైన ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు చేయడం బాగోలేదు. 1996-2004 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసింది కేవలం పది లక్షలేనని, అది కూడా శంకుస్థాపన సభ ఏర్పాట్ల కోసమేనని జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఒక్కదానికి చంద్రబాబు సమాధానం చెప్పగలిగితే, ఆయన ప్రభుత్వం ఏ మేరకు పనిచేసింది అర్థం అవుతుంది. శ్రీశైలంలో కనీస నీటి మట్టంగా 834 అడుగులుగా నిర్ణయిస్తూ చంద్రబాబు జీఓ ఇచ్చారు. ఇదే కొనసాగి ఉంటే అసలు వెలిగొండకు నీరు వచ్చే అవకాశమే ఉండదట. వైఎస్ ప్రభుత్వం దానిని 854 అడుగులకు పునరుద్దరించడంతో వెలిగొండతో పలు రాయలసీమ ప్రాజెక్ట్‌లకు నీరు అందించగలిగే పరిస్థితి వచ్చిందన్నది నిజమా? కాదా? టన్నెల్ తవ్వడానికి భారీ యంత్రాన్ని తెప్పించింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాదని అనగలరా!ఇప్పుడు చంద్రబాబు చేయవలసింది వెలిగొండ రెండో దశ కూడా పూర్తి చేసి నిర్దిష్ట లక్ష్యం ప్రకారం సమారు ఐదులక్షల ఎకరాలకు నీరవ్వడం. అది చేసి, ఆ క్రెడిట్ తనదేనని చెప్పుకుంటే అభ్యంతరం లేదు. ఇది ఎంతవరకు జరుగుతుందన్నది చెప్పలేం. వెలిగొండ సభలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రత్యేకించి రప్పించి జగన్‌ను దూషింపచేయడం మరీ దారుణంగా ఉంది. ఇదే మాగుంట గతంలో జగన్ టన్నెళ్ల ప్రారంభోత్సవం చేసినప్పుడు ఎంపీగానే ఉన్న సంగతి మర్చిపోయారా! లేక చంద్రబాబు మెప్పుకోసం తన మాగుంట కుటుంబ పరువును రోడ్డున పడేశారా అని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు.మరో అంకం చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేయడం. వైఎస్ చేపట్టిన భారీ ప్రాజెక్టులను ఊహజనితం అని ఆ రోజుల్లో చంద్రబాబు విమర్శించేవారు. కాని సాష్టాంగ నమస్కారం చేయడం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు ఊహాజనితం కాదని, వాస్తవమని చంద్రబాబుకు అర్థం అయి ఉండాలి. చంద్రబాబు వెలిగొండ చరిత్రలో చివరిలో అయినా ఒక భాగం అయ్యారు. అంతవరకు ఓకే. కాని చరిత్రను సృష్టించింది మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లే అన్నది పచ్చి నిజం. వెలిగొండ నీటిలో కనిపించేది వైఎస్ రాజశేఖరరెడ్డి నీడే అన్నది అర్థం అవుతూనే ఉంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వెలిగొండ జలాల బీభత్సం!
పెద్దారవీడు/మార్కాపురం రూరల్: వెలిగొండ టన్నెల్స్ నుంచి నల్లమల సాగర్‌కు నీరు విడుదల చేసిన తొలిరోజే తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా నీరు విడుదల చేయడం ఐదుగురి ప్రాణాల మీదకు తెచ్చింది. వీరిలో ఇద్దరు గల్లంతవ్వగా, మిగతా ముగ్గురు చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దయనీయ పరిస్థితిలో ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేయగా.. అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టించింది. కలనూతలకు చెందిన నల్లబోతుల శ్రీనివాసులు మార్కాపురం పవర్ ఆఫీస్ వెనుక భాగంలో 3 నెలలుగా నివాసం ఉంటున్నాడు. సోమవారం మార్కాపురం పట్టణం 10వ వార్డుకు చెందిన మరో నలుగురు మిత్రులతో కలిసి వ్యాపారం నిమిత్తం కారులో అర్ధవీడు మండలం గన్నేపల్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెలిగొండ ప్రాజెక్టు జలాలను చూడాలన్న ఆసక్తితో కలనూతల–సుంకేసుల మార్గంలో వచ్చారు. కలనూతల దాటాక జెడ్పీ హైసూ్కల్ సమీపంలో వెలిగొండ నుంచి వదిలిన నీరు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తోంది. వీరి ముందు వెళ్తున్న టిప్పర్ సురక్షితంగా దాటడంతో, వీరు కూడా ధైర్యం చేసి కారును ముందుకు పోనిచ్చారు. అయితే నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు ఒక్కసారిగా కొట్టుకుపోయింది.చెట్టెక్కి సెల్‌ఫోన్ లైట్లతో కేకలుప్రవాహంలో కొట్టుకుపోతున్న కారు సమీపంలోని చెట్టుకు బలంగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు వెంటనే తేరుకుని ప్రాణభయంతో ఆ చెట్టుపైకి ఎక్కగా, మిగతా ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. నీటి ప్రవాహం దాదాపు 100 అడుగుల వెడల్పున ఉధృతంగా ప్రవహిస్తుండటం, ఎప్పుడు ఏ క్షణాన చెట్టు కూలిపోతుందోనన్న భయంతో ముగ్గురు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. సెల్‌ఫోన్ టార్చ్లైట్లు వేస్తూ, కాపాడాలంటూ గట్టిగా కేకలు వేశారు. ప్రమాద సమయంలో కలనూతల వైపు 10 మంది.. సుంకేసుల మార్గం వైపు 10 మంది స్థానికులు ఉన్నప్పటికీ, నీటి ఉధృతి తీవ్రంగా ఉండటంతో వారెవరూ దగ్గరకు వెళ్లి రక్షించే సాహసం చేయలేకపోయారు. ప్రవాహం అంతకంతకూ పెరగడంతో స్థానికులు సైతం ప్రాణ భయంతో వెనక్కు పరుగులు తీశారు.అధికారుల పర్యవేక్షణ లోపంపై ఆగ్రహంట్రయల్ రన్లో భాగంగా ఆదివారం వదిలిన నీరే కలనూతల, సుంకేసుల గ్రామాలను చుట్టుముట్టగా, సోమవారం ప్రాజెక్టు నుంచి సీఎం అధికారికంగా నీటిని విడుదల చేయడంతో ఉధృతి మరింత పెరిగింది. ఇంత పెద్దఎత్తున నల్లమల సాగర్‌కు నీరు వదులుతున్నప్పుడు పుచ్చకాయలపల్లి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి, రాకపోకలను నియంత్రించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు మండిపడుతున్నారు. కాగా ప్రమాద సమాచారం అందుకున్న జేసీ శ్రీనివాసులు, ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రా, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, పెద్దారవీడు ఎస్సై సైదుబాబు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలపై సమీక్షిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించారు. అర్ధరాత్రి కావడం.. నీటి ఉధృతి తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విద్యుత్ స్తంభాలకు తాళ్లు కట్టేందుకు యత్నించి విరమించుకున్నారు. చివరకు భారీ క్రేన్‌తో పాటు, గజ ఈతగాళ్లను తీసుకొచ్చి ముగ్గురు వ్యక్తులను రక్షించే యత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
వెలిగొండ లెక్కలు బయటపెట్టే దమ్ముందా.. శ్రీకాంత్ రెడ్డి సంచలన కామెంట్స్
-
దశాబ్దాల కల సాకారం.. గర్వంగా ఉంది: సీఎం జగన్
సాక్షి, ప్రకాశం జిల్లా: వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ, అద్భుతమైనప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్ట్ నేను పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది’’ అని సీఎం జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది’’ అని సీఎం తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ►ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ల ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితుల మధ్య.. ఆ టన్నెల్లో కాస్తంత ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటాను. ►ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను, వారి దాహార్తిని తీరుస్తూ సాగు నీరు కూడా అందించే గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ►ఈ పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారు శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్లను కూడా ఒక్కో టన్నెల్ దాదాపు 18 కి.మీ. పైచిలుకు ఉన్న ఈ 2 టన్నెళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం.. ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అన్నది ఇంతకన్నా నిదర్శనం ఏముంది. ►ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, రెండో సొరంగం పనులు కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు కలిపి మొత్తంగా 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ రెండు సొరంగాలు పూర్తయ్యాయి ►వచ్చే ఖరీఫ్‌లో, జూలై-ఆగస్టులో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకొచ్చి, నల్లమల సాగర్‌లో మళ్లీ నీళ్లు నిండుతున్న సన్నివేశం, ఈ జూలై-ఆగస్టులోనే జరగబోతోంది. ►దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్ పూర్తి చేశాం. 8,500 క్యూసెక్కుల కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయింది. శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీరు తీసుకురాగలిగే గొప్ప పరిస్థితి ఈరోజుతో పూర్తయిపోయింది. ►ఈ జూలై-ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో 1200 కోట్లు ఖర్చు చేసి ఎల్ఏ ఆర్అండ్ఆర్ పూర్తి చేస్తాం ►ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం.. ఈ రెండు టన్నెళ్లు పూర్తి కావడం. ►మిగిలినవన్నీ పెద్ద ఏమీ లేవు. రిజర్వాయర్ పూర్తయిపోయింది. నీళ్లు నింపడం కోసం 1200 కోట్లు ఇస్తే పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది ►నీళ్లు నింపే కార్యక్రమం మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి నీళ్లు నింపుతాం ►ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా, ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు.. ఇన్ని నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని తెలిసి కూడా.. ఈ టన్నెళ్లు పూర్తి చేయడంలో చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు జరిగాయి. రెండు టన్నెళ్లు ఉన్నాయి. ఒక్కోటీ 18.8 కి.మీ. పొడవు ఉంటే, దాదాపు 37.6 కిలోమీటర్ల టన్నెళ్ల లెంత్ అయితే, ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపు 20 కి.మీ. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు చేస్తూ టన్నెళ్లు పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడ్డాయి. ►2014 నుంచి 2019 వరకు చూస్తే కేవలం 6.6 కి.మీ. మాత్రమే టన్నెళ్ల వర్కులు జరిగాయి. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్లీ ఈరోజు దాదాపు మిగిలిపోయిన 11 కి.మీ. టన్నెళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాం ►ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడి దయతో ఇంత మంచి చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి ఈ సందర్భంగా మనసు నిండా ప్రేమతో దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. ఇదీ చదవండి: YSR Cheyutha: రేపు సీఎం జగన్ అనకాపల్లి పర్యటన -
వెలిగొండ పూర్తిచేసేది సీఎం జగనే..
సాక్షి, మార్కాపురం టౌన్(ప్రకాశం జిల్లా): వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలు పెట్టిన వెలిగొండ ప్రాజెక్టును ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి పూర్తిచేసి ప్రారంభిస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్చి 3, 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శిలాఫలకం వేసిన చంద్రబాబుతో మాట్లాడినప్పుడు నిధులు అడిగితే నీళ్లులేవు, నిధులు లేవు అని చెప్పిన ఆయన.. మళ్లీ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తానని చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శిలాఫలకం వేసి మూడు జిల్లాల ప్రజల సమక్షంలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకోలేకపోయిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. 13 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగి ఉన్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే నేనే ప్రాజెక్టును ప్రారంభిస్తానని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2004లో ఎలక్షన్ జరిగి 2005లో సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు యాత్రలో భాగంగా నేను మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెలిగొండను సందర్శించి వెంటనే రూ.3500 కోట్ల నిధులను మంజూరు చేసిన ఘనత దివంగత నేత వైఎస్ఆర్కు దక్కిందన్నారు. ఆ సమయంలో నేను వైఎస్ఆర్తో అన్నాను ‘‘ఆ నాడు మేము మొక్కలు వేశాము, ఇపుడు మీరు జీవం పోస్తారా’’ అని అంటే ‘‘మీరే చూస్తారుగా జీవం పోసేది’’ అని చెప్పి నిధులు మంజూరు చేసిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు మంజూరుతో మొదటి టన్నెల్ పూర్తి చేసింది మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు. రెండో టన్నెల్ కూడా త్వరలో పూర్తి చేసి వరదలు వచ్చే సమయానికి నీళ్లు వదులుతారని తెలిపారు. సమావేశంలో ఈయన వెంట వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య, నాయకులు ఉన్నారు. (చదవండి: ఈ నెల 11వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు) -
అధైర్య పడొద్దు అండగా ఉంటాం
‘‘పశ్చిమ ప్రకాశంలోని ప్రతి గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. నా వంతు బాధ్యతగా అధికారులతో మాట్లాడి ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయిస్తున్నా.ఎంపీ ల్యాండ్ నుంచి అధిక నిధులు తాగునీటి సమస్య పరిష్కారానికే కేటాయించా. టీడీపీ సర్కారు ప్రకాశం జిల్లాపై కక్ష కట్టింది. అయినా అధైర్య పడకండి.కొంతకాలం ఓపిక పట్టండి. మంచి రోజులొస్తాయ్. కష్టాలన్నీ తీరి, ప్రజలంతా సంతోషంగా ఉండే రోజులు ముందున్నాయి. త్వరలోనే మనందరి ప్రభుత్వం వస్తుంది. అధికారంలోకి రాగానే మీ నమ్మకాన్నినిలబెట్టుకుంటాం.’’ అని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్‌తో వైవీ నిర్వహిస్తున్న ప్రజా పాదయాత్ర తొమ్మిదో రోజు గురువారం మార్కాపురం నియోజకర్గంలో సాగింది. ప్రకాశం, మార్కాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రకాశంపై నిర్లక్ష్యం వహించడం వల్లే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన పాదయాత్రకు లభిస్తున్న మద్దతును, అభిమానాన్ని తాను ఎన్నటికి మరచిపోనన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, అప్పుడే మీ కష్టాలన్ని పోయి వర్షాలు పడి ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు. పశ్చిమ ప్రకాశంలో కరువును శాశ్వతంగా నివారించేందుకు అధికారంలోకి రాగానే వెలిగొండప్రాజెక్టుపై దృష్టి పెడతామని, నీళ్లిచ్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా పాదయాత్రలో భాగంగా తొమ్మిదోరోజు గురువారం వైవీ మార్కాపురం, తర్లుపాడు మండలాల్లో పర్యటించారు. పాదయాత్రకు సంఘీభావం.. ప్రజా పాదయాత్రకు సంఘీభావంగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటరీ అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు సుబ్బారెడ్డి వెంట నడిచారు. మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, కుందురు నాగార్జునరెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, జెడ్పీటీసీ రంగారెడ్డి, ఎంపీపీ మాలకొండయ్య, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మీర్జా షంషీర్ అలీబేగ్, పట్టణ అధ్యక్షుడు చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి గాయం లక్ష్మిరెడ్డి, సహాయ కార్యదర్శి బట్టగిరి తిరుపతిరెడ్డి, తుమ్మా వెంకటరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి(దేవుడు), కొనకనమిట్ల మాజీ సర్పంచ్ అంజిరెడ్డి తదితరులు వైవీ వెంట నడిచారు. అంతకు ముందు కేపీ కొండారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ ఇస్మాయిల్ గజమాలతో సన్మానించారు. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి రెంటచింతల మధు, డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, ముర్తుజావలి, పలువురు పార్టీ నాయకులతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాదయాత్ర సాగింది ఇలా... ప్రజాపాదయాత్ర గురువారం ఉదయం 9గంటలకు మార్కాపురం శివారులోని డ్రైవర్స్ కాలనీ నుంచి ప్రారంభమైంది. ఎస్టేట్, సుందరయ్య కాలనీ, రాయవరం మీదుగా తర్లుపాడు మండలంలోని గానుగపెంటకు చేరింది. భోజన విరామం అనంతరం పోతలపాడు మీదుగా సాయంత్రం 6 గంలకు గజ్జలకొండలో ముగిసింది. తొమ్మిదో రోజు మొత్తం 14.8 కి.మీ మేర యాత్ర సాగింది. -
'స్మగ్లర్ల పేరుతో కూలీలను చంపడం దారుణం'
హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల పేరుతో కూలీలను చంపడం దారుణమని వైఎస్ఆర్ సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ స్మగ్లర్లకు శిక్ష వేస్తే తప్పు లేదు, కానీ పేద కూలీలను చంపడం మానవహక్కుల ఉల్లంఘనే అన్నారు. శేషాచలం ఎన్కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 16 వ తేదీన వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తున్నట్టు ఆయన తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు వద్ద రైతులతో మాట్లాడి, ప్రాజెక్టు పూర్తైయితే వచ్చే ప్రయోజనాలపై రైతులకు వివరణ ఇస్తామన్నారు. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమై పెండింగ్ ఉన్న ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బాబు సొంత మనుషుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు అని ఎద్దేవా చేశారు. పట్టిసీమకయ్యే ఖర్చుతో వెలిగొండ, గాలేరు, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చన్నారు.


