దశాబ్దాల కల సాకారం.. గర్వంగా ఉంది: సీఎం జగన్‌ | Veligonda: Cm Jagan Speech In Prakasam District Public Meeting | Sakshi
Sakshi News home page

దశాబ్దాల కల సాకారం.. గర్వంగా ఉంది: సీఎం జగన్‌

Mar 6 2024 1:09 PM | Updated on Mar 6 2024 6:03 PM

Veligonda: Cm Jagan Speech In Prakasam District Public Meeting - Sakshi

వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

సాక్షి, ప్రకాశం జిల్లా: వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ, అద్భుతమైనప్రాజెక్ట్‌ పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు.

మహానేత వైఎస్సార్‌ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్ట్‌ నేను పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్‌. 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది’’ అని సీఎం జగన్‌ అన్నారు.  వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది’’ అని సీఎం తెలిపారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..

►ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ల ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితుల మధ్య.. ఆ టన్నెల్‌లో కాస్తంత ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటాను.

►ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను, వారి దాహార్తిని తీరుస్తూ సాగు నీరు కూడా అందించే గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు.

►ఈ పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారు శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్లను కూడా ఒక్కో టన్నెల్ దాదాపు 18 కి.మీ. పైచిలుకు ఉన్న ఈ 2 టన్నెళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం.. ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అన్నది ఇంతకన్నా నిదర్శనం ఏముంది.

►ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, రెండో సొరంగం పనులు కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు కలిపి మొత్తంగా 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ రెండు సొరంగాలు పూర్తయ్యాయి

►వచ్చే ఖరీఫ్‌లో, జూలై-ఆగస్టులో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకొచ్చి, నల్లమల సాగర్‌లో మళ్లీ నీళ్లు నిండుతున్న సన్నివేశం, ఈ జూలై-ఆగస్టులోనే జరగబోతోంది.

►దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్ పూర్తి చేశాం. 8,500 క్యూసెక్కుల కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయింది. శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీరు తీసుకురాగలిగే గొప్ప పరిస్థితి ఈరోజుతో పూర్తయిపోయింది. 

►ఈ జూలై-ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో 1200 కోట్లు ఖర్చు చేసి ఎల్ఏ ఆర్అండ్‌ఆర్ పూర్తి చేస్తాం
►ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం.. ఈ రెండు టన్నెళ్లు పూర్తి కావడం. 
►మిగిలినవన్నీ పెద్ద ఏమీ లేవు. రిజర్వాయర్ పూర్తయిపోయింది. నీళ్లు నింపడం కోసం 1200 కోట్లు ఇస్తే పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది
►నీళ్లు నింపే కార్యక్రమం మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి నీళ్లు నింపుతాం
►ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా, ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు.. ఇన్ని నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని తెలిసి కూడా.. ఈ టన్నెళ్లు పూర్తి చేయడంలో చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు జరిగాయి. రెండు టన్నెళ్లు ఉన్నాయి. ఒక్కోటీ 18.8 కి.మీ. పొడవు ఉంటే, దాదాపు 37.6 కిలోమీటర్ల టన్నెళ్ల లెంత్ అయితే, ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపు 20 కి.మీ. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు చేస్తూ టన్నెళ్లు పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడ్డాయి.

►2014 నుంచి 2019 వరకు చూస్తే కేవలం 6.6 కి.మీ. మాత్రమే టన్నెళ్ల వర్కులు జరిగాయి. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్లీ ఈరోజు దాదాపు మిగిలిపోయిన 11 కి.మీ. టన్నెళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాం

►ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడి దయతో ఇంత మంచి చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి ఈ సందర్భంగా మనసు నిండా ప్రేమతో దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా.

ఇదీ చదవండి: YSR Cheyutha: రేపు సీఎం జగన్‌ అనకాపల్లి పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement