valuable land
-
99 పైసలకు 20 ఎకరాల కేటాయింపు
సాక్షి, అమరావతి: విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన ఎండాడలో ఇన్ఫోసిస్ క్యాంపస్ కోసం సుమారు రూ.1,000 కోట్లకుపైగా విలువ కలిగిన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లిఫ్ట్ పాలసీ 2024–29 ప్రకారం ఇన్ఫోసిస్ లిమిటెడ్‌కు మొత్తం 20 ఎకరాల భూమిని 99 పైసలకే కేటాయిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ భూమిలో ఇన్ఫోసిస్ రెండు దశల్లో రూ.750 కోట్ల పెట్టుబడితో క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు.దీంతోపాటు ఎండాడ వద్ద సర్వే నెంబర్ 175/పీలో మరో 5 ఎకరాల భూమిని భవిష్యత్తు అవసరాలకు ఇన్ఫోసిస్‌కు కేటాయించడానికి ఏపీఐఐసీకి బదలాయించాలని రెవెన్యూశాఖను కోరింది. ఈ క్యాంపస్‌కు అవసరమైన మౌలికవసతులను రూ.79 కోట్లతో ఏపీఐఐసీ, వీఎంఆర్డీఏ కల్పించనున్నాయి.2029 జనవరి నాటికి తొలి దశ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆరేళ్లలో రెండు దశలను పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టుకు 100 శాతం గ్రీన్ఎనర్జీని అందించాలని ఇంధన శాఖను ఆదేశించింది. భూమి అమ్మకం ఒప్పందం కుదిరిన 120 రోజుల్లోగా అనుమతుల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వైజాగ్ ఇన్ఫోసిస్ @ వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఖజానా ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖకు ఇన్ఫోసిస్‌ను తీసుకువస్తే.. ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదే ఐటీ సంస్థకు రూ.1,000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే చంద్రబాబు సర్కారు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు పప్పు బెల్లాలుగా అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిలదీసినా చంద్రబాబు సర్కారులో ఎటువంటి మార్పులేదు.రూ.వేల కోట్ల లాభాలను గడిస్తూ... ఒకపక్క తన దగ్గర ఉన్న భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తున్న ఇన్ఫోసిస్‌కు తాజాగా విశాఖలోని ఎండాడలో అత్యంత ఖరీదైన భూములను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు హైదరాబాద్‌లో వేలం ద్వారా భూములను విక్రయిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని పొందుతుంటే, రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కారు రూ.వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. తొలిసారిగా టైర్–2 నగరానికి తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే తొలిసారిగా ఇన్ఫోసిస్‌ను టైర్–2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలోని ఐటీ హిల్–2లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక ప్రైవేటు బిల్డింగ్‌లో 1,000 సీట్లతో ఏర్పాటు చేసుకున్న డెవలప్మెంట్ సెంటర్‌ను 2023 అక్టోబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. భవిష్యత్తులో విస్తరణకు సహాయ సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు.అయితే అప్పుడు రాష్ట్ర ఖజానాకు ఎటువంటి నష్టం లేకుండా ఐటీ కంపెనీని తీసుకువస్తే.. చంద్రబాబు సర్కారు మాత్రం మూడు నెలలకు ఒకసారి రూ.8,500 కోట్లకుపైగా లాభాలు గడించే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజానికి 99 పైసలకే విలువైన భూమిని కేటాయించడాన్ని మేధావులు విమర్శిస్తున్నారు. గతేడాది బెంగళూరులో తన వద్ద అదనంగా ఉన్న 53 ఎకరాలను ఇన్ఫోసిస్ రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించిందని, ఇలా రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను విక్రయించుకుంటున్న సంస్థకు విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూమిని 99 పైసలకే ఏ విధంగా కట్టబెడతారంటూ ప్రశి్నస్తున్నారు. భూములివ్వడంతోపాటు భవన నిర్మాణానికీ డబ్బులు..! చంద్రబాబు సర్కారు ఇప్పటికే విశాఖలో ఐటీ ముసుగులో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు 99 పైసలకు భూములు కేటాయించినట్లు చూపిస్తూ అదే సమయంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కట్టబెడుతోంది. ఐటీ క్యాంపస్‌లు, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్స్ పేరిట కే.రహేజా, సత్వా, కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.అంతేకాకుండా ఇలా కేటాయించిన భూముల్లో 50 శాతం స్థలం వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించడాన్ని వీరు తప్పుబడుతున్నారు. అది చాలదన్నట్లు.. ఆ సంస్థలు పెడుతున్న పెట్టుబడిలో 60 నుంచి 70 శాతం ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి ఇవ్వడంతోపాటు భవన నిర్మాణాల కోసం ఒక్కో చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెల్లిస్తోందంటూ తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
చెన్నకేశవునికి శఠగోపం!
జిల్లాలో అధికార పార్టీ నేతల అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. దేవుళ్లకు సైతం శఠగోపం పెట్టేందుకు వెనుకాడటం లేదు. రూ.4కోట్లు విలువజేసే చెన్నకేశవస్వామి ఆలయ భూములను స్వాహా చేసి రియల్ ఎస్టేట్ దందా మొదలుపెట్టారు. నియంత్రించాల్సిన అధికారులు పచ్చచొక్కా నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: పోరుమామిళ్ల సమీపంలో చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. అక్కడి చెన్నకేశవుడికి సుమారు 50 ఎకరాలకు పైగా భూములున్నాయి. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఈ దేవస్థానానికి గత కొంతకాలంగా పాలకవర్గ నియామకాలు చేపట్టలేదు. కౌలు చెల్లిస్తూ పలువురు గ్రామస్తులు దేవస్థాన భూములు సాగు చేసుకునేవారు. దేవాదాయశాఖ పట్టించుకోకపోవడంతో కౌలుదారులే భూముల హక్కుదారులుగా మారారు. దాంతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. రంగసముద్రం గ్రామ పొలం సర్వే నంబర్ 171లో 2.76 ఎకరాలు చెన్నకేశవస్వామికి మాన్యం ఉంది. పోరుమామిళ్ల విస్తరించడంతో ప్రస్తుతం ఆ భూమికి బాగా డిమాండ్ ఏర్పడింది. విడిగా విక్రయిస్తే ప్రధాన రోడ్డుకు అందుబాటులో సెంటు రూ. 4లక్షలు పలుకుతోంది. ఆ మొత్తం భూమిని తెలుగుదేశం పార్టీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కౌలుదారులే హక్కుదారులుగా.... పోరుమామిళ్ల చెన్నకేశవస్వామి భూమికి కౌలుదారులే హక్కుదారులుగా వ్యవహరిస్తున్నారు. కమ్మవారిపల్లెకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పక్కాగా దేవుని సొమ్మును సొంతం చేసుకుంటున్నారు. దేవాదాయశాఖ పరిధిలోని భూములపై వ్యాజ్యం వేస్తూ వారిని ప్రతివాదులుగా చేర్చకుండా రెవెన్యూ వారిని ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు హైకోర్టు దేవాదాయశాఖ భూమి కాకుంటే రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు సృష్టించవద్దని డబ్ల్యుపీ 30526/12 తేదీ 2012 డిసెంబర్ 31న తీర్పు చెప్పింది. ఆర్ఎస్ఆర్ రికార్డులు సర్వే నంబర్ 171లోని భూమి దేవాదాయశాఖ భూమిగా రూఢీ చేస్తున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సైతం ఎండోమెంటు భూమిగా నమోదైంది. అయినప్పటికీ చెన్నకేశవస్వామి భూమిని తెలుగుదేశం పార్టీ నేతలు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రూ.4కోట్ల విలువైన భూమిని పరులపాలు చేస్తున్నారు. చేతులు మారిన పచ్చనోట్లు .. పచ్చచొక్కానేతలకు అడ్డులేకుండా ఉండేందుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు దేవాదాయశాఖ, రిజిస్ట్రేషన్ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తోంది. కోట్లాది రూపాయల విలువైన భూములు పరులపాలవుతున్నా దేవాదాయశాఖ కళ్లులేని కబోదిలా వ్యవహరిస్తోంది. అందుకు కారణం ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరికి అర ఎకరా భూమి అప్పగించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఆ మేరకే ఈ వ్యవహారం బహిర్గతం కాకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఓ సబ్ రిజిస్ట్రార్‌కు పెద్ద ఎత్తున ముడుపులు అందించినట్లు కూడా వినికిడి. దాంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎలాంటి ఆటంకం లేకుండా ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. కాగా ఈ విషయమై దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జునప్రసాద్‌ను వివరణ కోరగా తనకు ఆ విషయం ఏమాత్రం తెలియదని చెప్పారు.


