యువకుడి శరీరంలో గర్భాశయం
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: వైద్య చరిత్రలో అరుదైన శస్త్రచికిత్స గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. పట్టణానికి చెందిన ఓ యువకుడు(20) హెర్నియా ఆపరేషన్ కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్ గ్రంథి రామారావు యువకుడి కడుపులో గర్భసంచి ఉన్నట్లు గుర్తించారు. దీంతో సుమారు 3 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి గర్భాశయాన్ని తొలగించారు.
దీనితోపాటు ఆ యువకుడికి వృషణాలు కడుపులోనే ఉండిపోవటంతో శస్త్రచికిత్స ద్వారా వెలుపలికి తెచ్చారు. శస్త్రచికిత్సలో డాక్టర్ రామారావుతో పాటు డాక్టర్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.