breaking news
Union Ministry of Food Processing Industries
-
వ్యవసాయ రంగంలో 10.4 శాతం వృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: 2024–25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపు(జీవీఏ) 10.4 శాతం వృద్ధి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ధరల ప్రకారం గత ఐదేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాలు (పంటలు, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవనం) వృద్ధిరేటు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. 2020–21లో 10.0 శాతం, 2021–22లో 10.6శాతం, 2022–23లో 8.5 శాతం, 2023–24లో 9.6 శాతం కాగా 2024–25లో 10.4శాతం నమోదుతో రికార్డు నెలకొలి్పనట్లు ఠాకూర్ చెప్పారు. 2024–25లో దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 3577.32 లక్ష మెట్రిక్ టన్నులు అని మంత్రి ప్రకటించారు. ఇది 2023–24లో నమోదైన 3322 లక్ష మెట్రిక్ టన్నులతో పోలిస్తే 254 లక్ష మెట్రిక్ టన్నుల (7.65 శాతం) కంటే ఎక్కువ అని ఇటీవల లోక్‌సభలో మంత్రి పేర్కొన్నారు. ఫీల్డ్‌స్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నాం ‘‘వ్యవసాయ వృద్ధిని ప్రభావితం చేసే కీలక అంశాలైన రైతుల ఆదాయం, ఇన్పుట్ ఖర్చులు, వాతావరణ మార్పులు, సాగునీటి విస్తరణ, రుణ సౌకర్యం, మార్కెట్ అనుసంధానంపై ప్రభుత్వం నిరంతర సమీక్షలు, అధ్యయనాలు, ఫీల్డ్ స్థాయి పర్యటనలు నిర్వహిస్తోంది. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోంది. పంటల ఉత్పత్తి పెంపు, ఉత్పత్తి ఖర్చుల తగ్గింపు, మెరుగైన ధరల సాధన, పంటల వైవిధ్యీకరణ, కోత అనంతర విలువ ఆధారం, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం వంటి అంశాలపై దృష్టి సారించాం’’అని మంత్రి తెలిపారు. ఇందుకోసం 2013–14లో రూ.21,933 కోట్లు కేటాయించగా, 2025–26 తాజా బడ్జెట్లో రూ.1,27,290 కోట్లు కేటాయించాం. 2018–19 నుంచి ఖరీఫ్, రబీ, వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధరలు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం లాభం వచ్చేలా నిర్ణయించాం. రైతుల సంక్షేమం, ఆదాయం పెంపు, ఉత్పత్తి విస్తరణ కోసం పలు కేంద్ర రంగ, కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలులో ఉన్నాయి’’అని మంత్రి పేర్కొన్నారు. -
కోల్డ్ స్టోరేజీలకు తోడ్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆహారోత్పత్తుల వృథాను తగ్గించే దిశగా దేశవ్యాప్తంగా 112 కోల్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు కేంద్రం తోడ్పాటు అందిస్తోందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ అండర్ సెక్రటరీ సంజయ్ బాజ్‌పేయి తెలిపారు. వీటిలో 49 ప్రాజెక్టులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్న ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చెరి మూడు ఉన్నాయన్నారు. వీటిలోనూ ఒక్కొక్కటి చొప్పున పూర్తయ్యాయని శనివారం ఇక్కడ జరిగిన కోల్డ్ చెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా సంజయ్ చెప్పారు. మొత్తం 112 ప్రాజెక్టులకు దాదాపు రూ. 2,607 కోట్లు పెట్టుబడి అవసరమని, ఇందులో సుమారు రూ. 874 కోట్లను గ్రాంటుగా అందిస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం ఏటా వృథా అవుతున్న పండ్లు, కూరగాయల విలువ సుమారు రూ. 13,309 కోట్ల మేర ఉంటుందన్నారు. మరోవైపు, ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని ప్రకటించనున్నట్లు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తెలిపారు. ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కూడా ప్రత్యేక విధానంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ మెగా ఫుడ్ పార్క్‌ల ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నట్లు వివరించారు. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు విషయంలో ప్రధానంగా విద్యుత్ చార్జీలు, రుణాలపై అధిక వడ్డీ రేట్లు సమస్యలుగా ఉంటున్నాయని వీటి పరిష్కారంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్పారు.


