breaking news
UNEXPECTED
-
ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి?
అది 1990వ దశకం... అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలోని చిన్న పట్టణం థావోస్. అర్ధరాత్రి దాటింది. పట్టణమంతా ప్రశాంతంగా ఉంది. అంతలో ఒక్కసారిగా మంచంపై నుంచి లేచి కూర్చున్నాడు 52 ఏళ్ల మైకేల్. చెవులను చేతులతో నొక్కుకుంటూ చిరాకుగా కిటికీ బయటకు చూశాడు.‘ఎక్కడో డీజిల్ ఇంజిన్ నడుస్తున్నట్లుంది... ఆపరా బాబోయ్’ అంటూ విసుక్కున్నాడు.పక్కనే నిద్రిస్తున్న అతడి భార్య సారా కళ్లు తెరిచి ఏమైందని అడిగింది... ‘ఏంటా గోల? ఎక్కడి నుంచి వస్తోందది’ అని చిరాకుగా అడిగాడు. ‘నాకేం వినిపించడంలేదే. కల ఏమైనా వచ్చిందా?’ అని సారా అడిగే సరికి మైకేల్ కళ్లు నులుముకున్నాడు. అతడికి చెవుల్లో ఆ శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇంట్లో ఎలాంటి యంత్రం లేదు. బయట రోడ్డు మీద వాహనాలూ లేవు. కానీ అతడి చెవుల్లో మాత్రం ఒకే శబ్దం...‘హ్మ్...’ అది దగ్గరగా ఉన్నట్లూ కాదు, చాలా దూరంలో ఉన్నట్లూ కాదు– వినిపిస్తుంది, అంతలోనే మాయమైపోతుంది. చెవులు మూసుకున్నా వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఆ రాత్రి అతడికి నిద్ర లేదు. మరుసటి రోజు పక్కింటి వాళ్లను అదే విషయం గురించి అడిగాడు. ‘ఏ శబ్దం? మాకేమీ వినిపించలేదు’ అని చెప్పడంతో మైకేల్ అయోమయానికి గురయ్యాడు.క్రమంగా ఆ శబ్దం గురించి చెబుతున్న వారి సంఖ్య పెరిగింది. ‘రాత్రిళ్లు ఓ వింత శబ్దం వినిపిస్తోంది. ఎక్కడి నుంచి వస్తోందో అర్థం కావడం లేదు. రోజంతా ఉండదు కానీ, రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది’ అంటూ వారంతా ఒకే విధంగా వర్ణించారు. అది దూరంలో డీజిల్ ట్రక్కు ఇంజిన్ నడుస్తున్నట్లు; భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మోగుతున్నట్లు; ఒక పెద్ద ఈగ చెవి దగ్గర నిరంతరం రొద పెడుతున్నట్లు గంభీరమైన ‘హ్మ్...’ అనే ధ్వనిలా ఉంటుందని చెప్పారు.అయితే, అదే ప్రాంతంలో నివసిస్తున్న చాలా మందికి ఆ శబ్దం అసలు వినిపించకపోవడం; కొందరికే అది తెలుస్తుండటం వింతగా అనిపించింది. ఒకే ఇంట్లో భార్యాభర్తల్లో ఒకరికి వినిపిస్తే, మరొకరికి అసలు వినిపించకపోవడం సాధారణమైపోయింది. కొంతమంది చెవులు మూసుకున్నా వినిపిస్తోందని చెబితే, ఇంకొందరు అది తమ తలలోనే ప్రతిధ్వనిస్తున్నట్లుగా అనిపిస్తోందన్నారు.మొదట్లో చిన్న అసౌకర్యంగా భావించిన ఈ హమ్... క్రమంగా చాలామందిని మానసికంగా వేధించడం ప్రారంభించింది. రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు; పగలు పనిపై దృష్టి నిలిచేది కాదు. తలనొప్పి, చిరాకు, ఒత్తిడి వెంటాడేవి. ఈ బాధ పడలేక కొందరు వేరే ఊరికి వెళ్లిపోయారు కూడా. మరికొందరు వైద్యులను ఆశ్రయించారు. కానీ పరీక్షల్లో పెద్దగా సమస్యలు కనిపించలేదు.ఈ శబ్దం గురించి ఫిర్యాదులు పెరగడంతో 1993లో అమెరికా అధికారులు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వినికిడి నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం విద్యుత్ లైన్లు, ఫ్యాక్టరీలు, భూకంప ప్రకంపనలు, రేడియో తరంగాలు, సైనిక స్థావరాలు– అన్నింటినీ పరిశీలించింది. కానీ ఆ శబ్దానికి కచ్చితమైన మూలం మాత్రం దొరకలేదు. పట్టణమంతటా అత్యంత సున్నితమైన, అత్యాధునిక అకోస్టిక్ రికార్డర్లను, వైబ్రేషన్ డిటెక్టర్లను అమర్చారు. కానీ ఏ ఒక్క డిజిటల్ మెషిన్ కూడా ఆ శబ్దాన్ని కచ్చితంగా రికార్డు చేయలేకపోయింది.ఈ హమ్పై ఎన్నో సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. దూరంలోని పరిశ్రమల యంత్రాల శబ్దమని కొందరు చెప్పారు. భూమి లోపల జరిగే సూక్ష్మ ప్రకంపనలేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. మనిషి వినలేని అత్యల్ప ఫ్రీక్వెన్సీ శబ్దాలు కారణమై ఉండవచ్చని అనుకున్నారు. చెవులకు సంబంధించిన టిన్నిటస్ అనే వైద్య సమస్యతో ముడిపడి ఉండవచ్చని కొందరు భావించారు. అయితే ఈ వివరణల్లో ఏదీ అందరికీ సరిపోయేలా రుజువు కాలేదు.శాస్త్రవేత్తలకు సమాధానం దొరకకపోవడంతో ఊహాగానాలు మరింత పెరిగిపోయాయి. ఇది అమెరికా సైన్యం రహస్య ప్రయోగాల ప్రభావమని, భూగర్భంలో దాగి ఉన్న రహస్య కేంద్రాల నుంచే ఈ శబ్దం వస్తోందని, గ్రహాంతరవాసుల సంకేతాలేనని– ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వాటిలో దేనికీ విశ్వసనీయమైన ఆధారాలు లభించలేదు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మూడు దశాబ్దాలు గడిచినా కొందరు థావోస్ నివాసితులు ఇప్పటికీ అదే హమ్ వినిపిస్తోందని చెబుతున్నారు. మరికొందరికి మాత్రం అసలు అలాంటి శబ్దం ఎప్పుడూ వినిపించలేదు. అంటే, శబ్దం నిజంగానే ఉందా? లేక కొందరు మాత్రమే గ్రహించే సహజ ధ్వనా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.ప్రపంచం ఎన్నో మిస్టరీలను ఛేదించింది. సముద్రపు అడుగున ఏముందో తెలుసుకుంది. అంతరిక్షంలో కోట్ల కిలోమీటర్ల దూరంలోని గ్రహాల చిత్రాలు తీసింది. కానీ అమెరికాలోని ఒక చిన్న పట్టణంలో కొందరి చెవుల్లో మాత్రమే వినిపించే ఆ ‘హ్మ్...’ అనే శబ్దం వెనుక రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయింది. అందుకే, థావోస్ హమ్ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన, అంతుచిక్కని రహస్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది.- సత్యకిశోర్ కొండ్రెడ్డిఇవి కూడా చదవండి: అంతరిక్షంలో వరిపంట -
ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఉద్యోగం వచ్చేసింది!
జాబ్ ఇంటర్వ్యూలలో అభ్యర్థులను అంచనా వేయడానికి ఇంటర్వ్యూయర్లు ఎన్నో సృజనాత్మక పద్ధతులను ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు వారు అడిగే ప్రశ్నలు అక్కడికక్కడే సమాధానం ఇవ్వడానికి కష్టంగా అనిపిస్తాయి. అలాంటి అనుభవాన్ని ఇటీవల ఒక మహిళ ఎదుర్కొని, దానిని ఉద్యోగ అవకాశంగా మార్చుకుంది.అనుకోని ప్రశ్నకాత్యాయని శుక్లా (Katyayani Shukla) అనే ఉద్యోగ అభ్యర్థిని తన అనుభవాన్ని ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) లో పంచుకున్నారు. ఆమె ఇటీవల హాజరైన ఉద్యోగ ఇంటర్వ్యూలో ఆ సంస్థ సీఈవో ఒక అసాధారణమైన ప్రశ్న అడిగారు.. “మిమ్మల్ని నియమించుకోకుండా ఉండటానికి ఒక మంచి కారణం చెప్పండి” అని. ఆ ప్రశ్నకు తక్షణం సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేకపోయిన శుక్లా, ఆలోచించడానికి కొంత సమయం కావాలని చెప్పి, తరువాత ఈమెయిల్ ద్వారా సమాధానం పంపుతానని తెలియజేశారు.“ఆ ప్రశ్నకు నేను సిద్ధంగా లేను. కాబట్టి ఆలోచించడానికి కొంత సమయం కావాలని చెప్పాను” అని ఆమె వివరించారు. కొన్ని గంటల తరువాత సీఈవో ఫాలో-అప్ మెసేజ్ పంపి ఆమె సమాధానాన్ని కోరారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత, శుక్లా తన సమాధానాన్ని ఈమెయిల్ ద్వారా పంపించారు. అదే ఆమెకు ఉద్యోగ ఆఫర్‌గా మారింది.కాత్యాయని ఇచ్చిన సమాధానం ఇదే.. సీఈవో అడిగిన గమ్మత్తైన ప్రశ్నకు తాను ఏం సమాధానం చెప్పిందో తన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా కాత్యాయని శుక్లా పంచుకున్నారు. తన సమాధానాన్ని క్షమాపణతో ప్రారంభించిన ఆమె.. “నన్ను నియమించుకోకుండా ఉండటానికి ఒక మంచి కారణం ఏమిటంటే.. నా జీవితం సవ్యంగా అంటే నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమతుల్యంగా, వ్యవస్థీకృతంగా ఉంచుకుంటాను” అని రాసుకొచ్చారు.తాను రోజూ (వీక్ డేస్‌లో) 9 గంటల నుండి 5 వరకు మాత్రమే పని చేస్తానని, పని-వ్యక్తిగత జీవితం మధ్య స్పష్టమైన సరిహద్దులు ఉంచుతానని చెప్పారు. ‘ప్రతిదీ అర్జెంట్ అని చెబుతుంటారు కానీ నిజానికి ఏదీ అర్జెంట్ కాదు’ అని తాను నమ్ముతుంటానన్నారు.తన సమయం, ఇతరుల సమయం పట్ల గౌరవం చూపడం తనకు అత్యంత ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. కొంతమంది దీనిని ఒక సానుకూల లక్షణంగా చూస్తారని, మరికొందరు వ్యతిరేకంగా భావించే అవకాశం ఉందని ఆమె అంగీకరించారు.During my last job interview, the CEO asked me to give her one good reason not to hire me.I told her I wasn’t ready for that question and needed some time to think.She said, “That’s fine... just promise you’ll email me your answer.”Honestly, I thought she’d forget. But a… pic.twitter.com/z5CWWF8uxZ— Katyayani Shukla (@aibytekat) February 15, 2026 -
‘నో ఫోన్ ఛాలెంజ్’.. రెండు వారాల్లో అనూహ్య మార్పు!
ఈ రోజుల్లో చిన్నారులకు చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ముద్ద దిగదు.. షార్ట్స్ చూడకపోతే నిద్రపట్టదు. అయితే కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన టీచర్ అమృత.. విద్యార్థులను ఈ డిజిటల్ సంకెళ్ల నుండి విడిపించాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి కఠినమైన శిక్షలు లేకుండా కేవలం ‘రంగురంగుల స్టిక్కర్లు - చిన్నపాటి సవాళ్లతో’ ఆమె చేసిన ప్రయోగం ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం రెండు వారాల్లోనే పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనాన్ని మాయం చేసిన ఆ ‘నో ఫోన్ ఛాలెంజ్’ కథలోనికి వెళితే..కేరళలోని కన్నూర్ జిల్లా, కూతుపరంబ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేపట్టిన ఒక వినూత్న ప్రయోగం అద్భుత ఫలితాలను ఇస్తోంది. విద్యార్థులు పాఠాల కంటే మొబైల్ ఫోన్లలో రీల్స్, షార్ట్స్ , వీడియో గేమ్స్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని టీచర్ అమృత గమనించారు. పిల్లల ఏకాగ్రత లోపించడానికి మితిమీరిన మొబైల్ వాడకమే కారణమని నిర్ధారించుకున్న ఆమె, వారిని ఆ వ్యసనం నుండి దూరం చేసేందుకు ఒక ప్లాన్ వేశారు. కేవలం హెచ్చరించడమే కాకుండా, పిల్లల మనస్తత్వానికి తగినట్లుగా స్టిక్కర్లు, ఆటలు, చిన్నపాటి సవాళ్లతో వారిని ఆకట్టుకున్నారు.పిల్లల్లో మొబైల్ వాడకాన్ని తగ్గించడం అంత సులభం కాదని అమృతకు తెలుసు. అందుకే ఆమె ‘నో ఫోన్ ఛాలెంజ్’ను ప్రారంభించారు. ఫోన్ ముట్టుకోని విద్యార్థులకు మరుసటి రోజు తరగతిలో రంగురంగుల స్టిక్కర్లను బహుమతిగా ఇచ్చేవారు. ఇది విద్యార్థుల్లో ఒక సానుకూల పోటీని పెంచింది. ఫోన్ చూడటం మానేసిన పిల్లలకు ప్రోత్సాహకంగా కథల పుస్తకాలు, మట్టి బొమ్మలు, నోట్‌బుక్‌లను బహుమతులుగా అందించారు. ఫోన్ వదిలేసిన తర్వాత ఖాళీగా ఉండే సమయంలో వారు సృజనాత్మకంగా ఆలోచించేలా మట్టితో బొమ్మలు చేయడం, చిత్రలేఖనం లాంటి యాక్టివిటీస్ వారికి అలవడేలా చేశారు.ఈ వినూత్న ప్రయోగం మొదలైన రెండు వారాల్లోనే పిల్లల్లో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడమే కాకుండా, వారి ప్రవర్తనలో కూడా ప్రశాంతత చోటుచేసుకుంది. గతంలో చిన్న విషయాలకే గొడవ పడే పిల్లలు, ఇప్పుడు సహనంతో వ్యవహరిస్తున్నారని టీచర్ అమృత తెలిపారు. మొబైల్ ఫోన్ లాక్కుంటే ఇంట్లో ఏడ్చి గొడవ చేసే పిల్లలు, ఇప్పుడు పెయింటింగ్ వేస్తూ, ఆ చిత్రాలను టీచర్‌కు చూపించడానికి ఉత్సాహపడుతున్నారని తల్లిదండ్రులు ఆనందంగా చెబుతున్నారు.పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. విద్యార్థుల స్క్రీన్ టైమ్ తగ్గించే దిశగా విద్యాశాఖ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఇటీవల విడుదలైన ఎకనామిక్ సర్వే నివేదికలో డిజిటల్ వ్యసనం వల్ల యువతలో ఆందోళన, కుంగుబాటు, ఆత్మవిశ్వాసం తగ్గడం లాంటి సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడయ్యింది. ఫోన్లకు బానిసలవుతున్న నేటి తరాన్ని ఈ వ్యసనం నుంచి తప్పించేందుకు.. అమృత టీచర్ అనుసరించిన సృజనాత్మక పద్ధతులు అనుసరించాల్సిన అవసరముందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఇది కూడా చదవండి: ఆన్లైన్ గేమ్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు -
టార్గెట్ హిమాచల్‌ప్రదేశ్?
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నష్ట నివారణ కోసం ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలిచి్చంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సీనియర్ నేతలు భూపేష్ బఘేల్, భూపీందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్‌ను పార్టీ పరిశీలకులుగా హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు తగిన బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ పార్టీ అభ్యర్థి అభిõÙక్ మనూ సింఘ్వీ ఓడిపోయారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రఎమ్మెల్యేలు బీజేపీ అభ్యరి్థకి ఓటువేశారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ‘జైశ్రీరామ్, బన్ గయా కామ్’ అని నినదిస్తూ బీజేపీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, హిమాచల్‌ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు సమరి్పంచానని చెప్పారు. ప్రభుత్వంలో తనకు, తన కుటుంబానికి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోందో అధిష్టానం తెలుసుకోవాలని కోరారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటానని వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు హిమాచల్‌ప్రదేశ్ శాసనసభలో బుధవారం అనూహ్య పరిణామం చేసుకుంది. 15 మంది ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కులదీప్ సింగ్ పఠానియా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు. బీజేపీ సభ్యులు సభలో స్పీకర్‌ను అగౌరవపరుస్తున్నారని, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, సభ సజావుగా సాగాలంటే వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి హర్షవర్దన్ చౌహాన్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవడానికే తమను సస్పెండ్ చేశారని జైరామ్ ఠాకూర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారీ్టలో పడిందని, ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సింగ్ సుఖూ రాజీనామా చేయాలని జైరామ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందింది. ప్రజా తీర్పును కాపాడుకుంటాం హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజా తీర్పును కాలరాచే ప్రయత్నాలను సహించబోమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, త్వరలో సమగ్ర నివేదిక సమరి్పంచాలని కాంగ్రెస్ పరిశీలకులను ఖర్గే ఆదేశించారని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అదే సమయంలో ప్రజలు ఇచి్చన తీర్పును కాపాడుకోవడం ముఖ్యమని తేలి్చచెప్పారు. హిమాచల్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీ తప్పుడు మార్గాలు వెతుకుతోందని ఆరోపించారు. -
క్రాష్ లాండింగ్ అంటే ఇలాగుంటుంది.!
-
ఊహించని ప్రదేశాలలో వింత ఆవిష్కరణలు
-
దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు...
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ డేన్ పీట్ అనూహ్య నిర్ణయంతో ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సభ్యదేశమైన దక్షిణాఫ్రికా జట్టును వదిలి అసోసియేట్ టీమ్ అమెరికాతో జతకట్టేందుకు సిద్ధమయ్యాడు. శనివారం ఉదయమే ఈ ఒప్పందానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని అతను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘ఈ రోజు ఉదయం కాంట్రాక్ట్‌పై సంతకం చేశా. చాలా కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ... ఇది నాకో మంచి అవకాశం. ఆర్థికంగానూ, జీవనశైలి పరంగానూ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని వదులుకోలేకపోయాను. పైగా గతేడాది అమెరికాకు వన్డే జట్టు హోదా దక్కింది. ఇంకా ఆలోచించడానికి ఏముంది? దక్షిణాఫ్రికా వన్డే తుది జట్టులో తనకు చోటు దక్కే అవకాశాలు అతి స్వల్పంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను ’ అని పీట్ వ్యాఖ్యానించాడు. ఈ వేసవిలో ప్రారంభం కానున్న ‘ మైనర్ లీగ్ టి20 టోర్నమెంట్’ నుంచి అతను అమెరికా తరఫున తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. 2014లో సఫారీ జట్టు తరఫున అరంగేట్రం చేసిన పీట్ తొమ్మిది టెస్టుల్లో 26 వికెట్లు దక్కించుకున్నాడు. -
ఎండ మండుతోంది.. వాన కురుస్తోంది
నరసాపురం : వాతావరణంలో నాలుగు రోజులుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతుఉన్నాయి. ఏప్రిల్ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించాయి. వారం రోజులుగా కొన్నిచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచీ భానుడు భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. సాయంత్రం వేళ ఈదురుగాలులు, అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. సాధారణంగా మే నెలాఖరు నుంచి (రోహిణి కార్తె వెళ్లాక) ఈదురు గాలులు వీయటం.. వర్షాలు కురవటం పరిపాటి. అందుకు భిన్నంగా ఏప్రిల్ చివరి వారం నుంచే భారీ గాలులు వీస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగడమే కారణం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడమే ఈ మార్పులకు కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటివరకూ 35నుంచి 37 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు వారం రోజుల నుంచి ఒక్కసారిగా పెరిగాయి. భూమి ఒక్కసారిగా వేడెక్కడం, సాయంత్రం చల్లబడుతుండటంతో భూమి నుంచి వేడి వాయువుల పీడనం పైకి వెళుతోంది. ఈ కారణంగా మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తు న్నాయి. వాతావరణంలో నెలకొన్న ఈ సర్దుబాట్లే ప్రస్తుత స్థితికి కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే గాలుల్లో వేగం పెరగడం ఈదురు గాలులకు కారణమని చెబుతున్నారు. తగ్గుతున్న తేమశాతం తీర ప్రాంతం కావడంతో మన జిల్లాలో తేమ శాతం అధికంగా ఉంటుంది. నాలుగు రోజులుగా గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. పగటిపూట తేమశాతం 60 నుంచి 70 శాతానికి తగ్గింది. రాత్రివేళ 80 నుంచి 90 శాతం నమోదవుతోంది. వారం క్రితం వరకు పగటిపూట 70 నుంచి 80 తేమ శాతం నమోదైంది. తగ్గుతున్న తేమ శాతంలోను గంటకో రకంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. దీనివల్ల ఉక్కపోత కాస్త తగ్గిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విజృంభిస్తున్న వ్యాధులు రోజుల వ్యవధిలో తేమ శాతంలో ఒక్కసారిగా మార్పులు సంభవించడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ వాతావరణంలో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని నరసాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బళ్ల మురళి సూచించారు. వారం రోజులు ఇదే పరిస్థితి నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో భూమి బాగా వేడెక్కింది. వాతావరణం చల్లబడ్డ తరువాత వచ్చే వేడి గాలుల వల్ల మేఘాలు ఏర్పడి వర్షిస్తున్నాయి. దీనికి ఈదురు గాలులు తోడయ్యాయి. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. – ఎన్.నరసింహరావు, వాతావరణ శాఖ అధికారి, నరసాపురం -
త్రై మాసిక పరీక్షల ఆకస్మిక తనిఖీ
నడిగూడెం: మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న త్రైమాసిక పరీక్షలను సోమవారం సాంఘీక సంక్షేమ శాఖ జిల్లా కో ఆర్డినేటర్ భూక్యా సక్రూనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగగా విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. పరీక్షల నిర్వహన పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేవారు. ఆయన వెంట ఫ్లైయింగ్ స్క్వాడ్ కె.జనార్దన్, ప్రిన్స్‌పాల్ గులాం ఎస్దాని, వైస్ ప్రిన్స్పాల డి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సుజాత, కవితారాణి, తదితరులున్నారు. -
అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ
నడిగూడెం: మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని పలు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఐసీడిఎస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లోని రిజిస్టర్లు, చిన్నారుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఎప్పటికప్పుడు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం నుంచి మంజూరయ్యే పౌష్టికాహారాన్ని పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో సీడీపీఓ కృష్ణకుమారి, అసిస్టెంట్ సీyీ పీఓ వెంకటలక్ష్మి, సూపర్వైజర్లు కోటేశ్వరి, రాజ్యలక్ష్మి, తదితరులున్నారు.


