అంగన్‌వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ | Unexpected inspection in Anganawadis | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

Sep 22 2016 9:43 PM | Updated on Jun 2 2018 8:39 PM

అంగన్‌వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ - Sakshi

అంగన్‌వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని పలు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం ఐసీడిఎస్‌ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నడిగూడెం: మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని పలు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం ఐసీడిఎస్‌ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని రిజిస్టర్‌లు, చిన్నారుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఎప్పటికప్పుడు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం నుంచి మంజూరయ్యే పౌష్టికాహారాన్ని పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో సీడీపీఓ కృష్ణకుమారి,  అసిస్టెంట్‌ సీyీ పీఓ వెంకటలక్ష్మి, సూపర్‌వైజర్లు కోటేశ్వరి, రాజ్యలక్ష్మి, తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement