breaking news
Tsunami Warn
-
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
రష్యాలోని కమ్చట్కా ప్రాంతాన్ని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. గురువారం రాత్రి రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. గత ఏడాది ఇదే ప్రాంతంలో సంభవించిన 8.8 తీవ్రత భూకంపం.. ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఈ ప్రాంతంలో తరచూ శక్తివంతమైన భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? భూమి లోపల ఏం జరుగుతోంది? అనే చర్చకు దారి తీసింది.కమ్చట్కా ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం అంచున ఉంది. 2025 జూలై 30న ఈ తీరానికి సమీపంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ మహాసముద్రం పరిధిలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కూడా అనేక ప్రకంపనలు నమోదయ్యాయి. తాజా భూకంపంతో మరోసారి తీర దేశాలు ఉలిక్కిపడ్డాయి. అయితే ఈసారి సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక భూఫలకం మరో భూఫలకం కిందకు నెమ్మదిగా చొచ్చుకుపోతోంది. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు ‘సబ్డక్షన్’గా పిలుస్తారు. పసిఫిక్ భూఫలకం ఏడాదికి సుమారు 8 సెంటీమీటర్ల మేర కదులుతుంది. ఈ కదలిక మనకు కనిపించకపోయినా, దశాబ్దాల పాటు కొనసాగినప్పుడు భూఫలకాల మధ్య విపరీతమైన ఒత్తిడి పేరుకుపోతుంది.భూఫలకాల మధ్య ఉండే ఘర్షణ కారణంగా అవి కొన్ని చోట్ల ఇరుక్కుపోతాయి. ఒత్తిడి పెరిగి శిలలు తట్టుకోలేని స్థాయికి చేరినప్పుడు ఒక్కసారిగా భూమి పొరలు జారిపోతాయి. అప్పుడు విడుదలయ్యే శక్తి భూకంప తరంగాలుగా వ్యాపించి ప్రకంపనలకు కారణమవుతుంది. కమ్చట్కా ప్రాంతంలో తరచూ బలమైన భూకంపాలు రావడానికి ఇదే ప్రధాన కారణం.రింగ్ ఆఫ్ ఫైర్‌లో కీలక ప్రాంతంపసిఫిక్ మహాసముద్రం చుట్టూ విస్తరించిన సుమారు 40 వేల కిలోమీటర్ల భూకంప, అగ్నిపర్వత మండలాన్ని ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ అంటారు. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు, చురుకైన అగ్నిపర్వతాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. భూఫలకాలు ఒకదాని కిందకు మరొకటి చొచ్చుకుపోవడంతో భూమి లోపల శిలాద్రవం ఏర్పడటానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఫలితంగా కమ్చట్కాలో భూకంపాలతో పాటు అగ్నిపర్వత కార్యకలాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి.తాజా భూకంపంతో..తాజాగా సంభవించిన 7 తీవ్రత భూకంపం సుమారు 140 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు సమాచారం. గత ఏడాది సంభవించిన భారీ భూకంపం సముద్ర తీరానికి సమీపంలోని భూఫలకాల సరిహద్దులో ఏర్పడగా, తాజా భూకంపం అంత లోతులో సంభవించడం గమనార్హం. ఇది భూమి లోపలికి చొచ్చుకుపోతున్న పసిఫిక్ భూఫలకం లోపల ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక భారీ భూకంపం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒత్తిడిని మార్చి మరిన్ని ప్రకంపనలకు కారణం కావొచ్చు. మరో భారీ భూకంపం?వరుస భూకంపాల నేపథ్యంలో.. కమ్చట్కాను మరోసారి భారీ భూకంపం కుదిపేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భూకంపం సంభవిస్తుందా? వస్తే ఎంత తీవ్రతతో ఉంటుంది అనే విషయాలను కచ్చితంగా.. ముందుగానే చెప్పడం సాధ్యం కాదని భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే కమ్చట్కాలో తరచూ వస్తున్న భారీ ప్రకంపనల వెనుక కారణం భూమి లోపల నిరంతరం కదులుతున్న భూఫలకాలే. ఈ కదలికలు ఆగనంతకాలం ఈ ప్రాంతం భూకంప ముప్పు ఉన్న ప్రాంతంగానే కొనసాగుతుందని మాత్రం చెబుతున్నారు.ఇదీ చదవండి: పశ్చిమాసియా రాజకీయాల్లో ముగిసిన ఓ శకం -
పనామాను వణికించిన భూకంపం.. తొలగిన సునామీ భయం!
మధ్య అమెరికా దేశం పనామాను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి, ఎత్తైన భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా.. రహదారులు దెబ్బతిన్నాయి. తొలుత పనామాతో పాటు పలు దేశాల తీర ప్రాంతాలకు జారీ చేసిన సునామీ హెచ్చరికలను అధికారులు ఆ తర్వాత ఉపసంహరించారు. దీంతో తీర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు కొనసాగిస్తున్నారు.భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి పనామాను భారీ భూకంపం వణికించింది. హెర్రెరా ప్రావిన్స్‌లోని పిటలోజా అర్రిబా ప్రాంతానికి సమీపంలో ఉన్నట్లు అమెరికా భూగర్భ సర్వే సంస్థ (యూఎస్జీఎస్) వెల్లడించింది. పనామా రాజధాని పనామా సిటీకి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దాదాపు నిమిషం పాటు ప్రకంపనలు కొనసాగడంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.కోక్లే ప్రావిన్స్‌లోని పెనోనోమే ప్రాంతంలో చారిత్రక చర్చి, గవర్నర్ కార్యాలయ భవనం సహా పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హెర్రెరా, లాస్ శాంటోస్ ప్రాంతాల్లోనూ ఇళ్లు, ఇతర నిర్మాణాలకు నష్టం వాటిల్లినట్లు వార్తలు వెలువడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, ఫోన్‌కాల్స్-ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది.A massive magnitude 7.7 earthquake struck Panama, shaking buildings more than 100 miles away and prompting evacuations, according to the U.S. Geological Survey. Tremors were felt in Panama City, where buildings shook and people evacuated into the streets. https://t.co/46kFq5wpSV https://t.co/jsr5g6uLDv— CBS News (@CBSNews) October 9, 202680కి పైగా ప్రకంపనలుప్రధాన భూకంపం తర్వాత వరుసగా ప్రకంపనలు(ఆఫ్టర్ షాక్స్) రావడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. వాటిల్లో ఒకటి 6.6 తీవ్రతతో సంభవించింది. పనామా సిటీలో ఎత్తైన భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. టోకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను కొద్దిసేపు నిలిపివేసి, తనిఖీల అనంతరం తిరిగి ప్రారంభించారు. పనామా కాలువలో మాత్రం కార్యకలాపాలకు అంతరాయం కలగలేదని సమాచారం. భూకంపం కారణంగా ప్రాణనష్టం జరిగినట్లు తొలుత అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే పలువురికి స్వల్ప గాయాలైనట్లు, దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. భవనాల నష్టం, రహదారుల పరిస్థితి, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులు అంచనా వేస్తున్నారు.భయంతో.. భూకంప కేంద్రానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని పనామా సిటీలోనూ ప్రకంపనల తీవ్రత కనిపించింది. ఎత్తైన భవనాల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. 15 అంతస్తుల భవనం నుంచి రెండోసారి బయటకు వచ్చిన సాలమన్ ఆండియన్ అనే వ్యక్తి.. ఫర్నిచర్, మంచం, వంటగదిలోని వస్తువులు బలంగా కదిలాయని వెల్లడించారు.TERREMOTO EN PANAMÁ ▪️Panamá afectado por este terrible terremoto de 7.6. Se sintió en Ciudad de Panamá, hay Alerta de tsunami; se produjeron varias réplicas. #Terremoto #Panamá #Sismo https://t.co/udnuMfvWiQ— @ALTOS_NOTICIASpy (@Altosnoticiasp1) October 9, 202620 అంతస్తులకు పైగా ఉన్న ఓ భవనం పైకప్పుపై ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ నుంచి నీరు కిందకు జారిపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పనామా కాలువపై ఉన్న ఓ వంతెన సైతం తీవ్రంగా కంపించినా కూలిపోలేదు. ఆ సమయంలో వాహనాలు వంతెనపై ప్రయాణిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగించాయి.సునామీ వార్నింగ్ ఎత్తివేతభూకంపం తర్వాత పనామాతో పాటు కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్, పెరూ, నికరాగువా, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్, మెక్సికో తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అనంతరం సునామీ ముప్పు తొలగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ తీర ప్రాంత ప్రజలు స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, భూకంపానంతర ప్రకంపనల(After Shocks) పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అధ్యక్షుడి ప్రకటన.. విద్యాసంస్థలు బంద్భూకంప తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భూకంపం తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన పెనోనోమే ప్రాంతాన్ని సందర్శించారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో తరగతులను నిలిపివేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్ పనామా సహా విద్యాసంస్థల్లోనూ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, అగ్నిమాపక కేంద్రాల్లోనూ నష్టం నమోదైంది. 17 ఆరోగ్య సంస్థల్లో భవనాలకు సంబంధించిన సమస్యలు గుర్తించగా, కొన్ని ఆసుపత్రుల్లో రోగులను ముందుజాగ్రత్తగా బయటకు తరలించారు. పలు పాఠశాలలు, అగ్నిమాపక కేంద్రాల్లోనూ గోడలకు పగుళ్లు, పైకప్పుల పెచ్చులు ఊడిపోవడం వంటి నష్టం కనిపించింది. అధ్యక్షుడు, అధికారులు నష్టంపై సమీక్ష కొనసాగిస్తుండగా.. పొరుగుదేశాలు, అమెరికా సైతం సహాయానికి ముందుకొచ్చాయి.గతంలోనూ లాటిన్ అమెరికాలో భారీ విధ్వంసంలాటిన్ అమెరికా ప్రాంతం భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. భూమి లోపల ఉన్న టెక్టానిక్ పలకల కదలికల కారణంగా ఇక్కడ తరచూ తీవ్ర ప్రకంపనలు సంభవిస్తుంటాయి. 2010లో హైతీలో సంభవించిన 7.0 తీవ్రత భూకంపం భయానక విధ్వంసాన్ని సృష్టించింది. అధికారిక అంచనాల ప్రకారం సుమారు 3.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, మరో 3 లక్షల మంది గాయపడ్డారు. అదే ఏడాది చిలీలో 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం, దాని తర్వాత సంభవించిన సునామీ కారణంగా 521 మంది మరణించగా, మరో 56 మంది ఆచూకీ లభించలేదు. సుమారు 3.7 లక్షల ఇళ్లు దెబ్బతినడమో లేదంటే పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతకుముందు 1960లో చిలీలో సంభవించిన 9.5 తీవ్రత భూకంపం ఆధునిక చరిత్రలో నమోదైన అత్యంత శక్తిమంతమైన భూకంపంగా గుర్తింపు పొందింది. ఆ భూకంపం, దాని తర్వాత వచ్చిన సునామీ కారణంగా చిలీలోనే సుమారు 1,600 మంది ప్రాణాలు కోల్పోగా, హవాయి, జపాన్, ఫిలిప్పీన్స్ తదితర ప్రాంతాల్లో మరో 200 మంది మరణించారు. ఇదీ చదవండి: ఏకంగా ఐసీసీపైనే అమెరికా ఆంక్షలు -
మళ్లీ అదే తేదీ.. ఊగిపోయి కుప్పకూలిన బిల్డింగులు
మెక్సికో సిటీ: దక్షిణ అమెరికా దేశం మెక్సికో అతిభారీ ప్రకంపనలతో చిగురుటాకులా వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో అక్కడ భారీ భూకంపం సంభవించింది. మరోవైపు మూడు నుంచి తొమ్మిది అడుగుల ఎత్తు సముద్ర అలలు ఎగిసిపడడంతో.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది యూఎస్-ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో పశ్చిమ మెక్సికో ప్రాంతంలో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయి. శక్తివంతమైన ప్రకంపనల ధాటిగా చెట్లు, భవనాలు కూలి విధ్వంసం చోటు చేసుకుంది. అయితే.. అదృష్టవశాత్తూ తక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. కాకపోతే భారీగా భవనాలు కూలిపోగా.. దారిపొడవునా చెట్లు వేళ్లతో సహా రోడ్ల మీద కుప్పకూలాయి. En varias partes de nuestro pais estuvo bastante fuerte el #temblor #sismo #mexico #19septiembre pic.twitter.com/ga7LeMRWRn — Tapatio Tradi (@tapatiotrad) September 19, 2022 విశేషం ఏంటంటే.. సెప్టెంబర్ 19వ తేదీ మెక్సికో చరిత్రలో పెనువిషాదాలను నింపిన రోజు కావడం. 1985 సెప్టెంబర్ 19వ తేదీన రిక్టర్‌స్కేల్‌పై 8.0 తీవ్రతతో భూకంపం, పది అడుగుల ఎత్తు అలలతో సునామీ సంభవించగా.. ఐదువేల మందికిపైగా మరణించారు. ఇక.. 2017 సెప్టెంబర్ 19వ తేదీన మెక్సికో మున్సిపాలిటీ పరిధిలోని ప్యూబ్లాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ దాటికి సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆరు వేల మందికిపైగా గాయపడ్డారు. అయితే తాజా భూకంపంలో.. మాత్రం కేవలం ఒకే ఒక్క ప్రాణం పోయింది. మాంజానిలో లోని ఓ డిపార్ట్మెంట్స్టోర్ పైకప్పు కూలి ఒక వ్యక్తి మరణించాడు. గ్లాస్ పడి మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. కాకపోతే భారీ ప్రకంపనల ధాటికి భవనాలు, చెట్లు ఊగిపోయాయి. జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రులు, ప్రయాణాల్లో ఉన్నవాళ్లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. మొత్తానికి సెప్టెంబర్ 19 భూకంపం సెంటిమెంట్ మెక్సికోను వణికిపోయేలా చేసింది. సునామీ హెచ్చరికలను ఇంకా ఉపసంహరించాల్సి ఉంది అక్కడ. ఇదీ చదవండి: కంటికి కనిపించని అద్భుతాలను ‘ఆ’ కంటితో చూడొచ్చు.. -
మెక్సికోను కుదిపేసిన భూకంపం
32 మంది మృతి; రిక్టర్ స్కేల్‌పై 8.1గా తీవ్రత ► పసిఫిక్ మహా సముద్రంలో భూకంప కేంద్రం ► సునామీ హెచ్చరికలు జారీ మెక్సికో సిటీ: మెక్సికో దేశాన్ని శుక్రవారం ఉదయం అత్యంత శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేల్‌పై 8.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి మెక్సికో తీర ప్రాంత రాష్ట్రాల్లో 32 మంది మరణించారు. వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు దెబ్బతినగా.. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. పసిఫిక్ మహాసముద్రంలో 69.7 కి.మీ లోతున భూకంపం సంభవించగా.. ముందు జాగ్రత్తగా ఉత్తర అమెరికా ఖండంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మెక్సికో చియాపాస్ రాష్ట్రంలోని తపాచులాకు 165 కి.మీ. దూరంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో(భారత కాలమానం ప్రకారం) పసిఫిక్ సముద్రంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం నుంచి 1,000 కి.మీ. దూరంలో ఉన్న మెక్సికో నగరంలో కూడా భవనాలు కంపించాయి. భూకంప తీవ్రతను 8.2 గా మెక్సికో ప్రభుత్వం పేర్కొనగా.. అమెరికా భూభౌతిక విభాగం మాత్రం తీవ్రత 8.1గా నమోదైందని వెల్లడించింది. ఒయక్సకా రాష్ట్రంలో మొత్తం 23 మంది మరణించారని ఆ రాష్ట్ర గవర్నర్ అలెజాండ్రో మురాత్ చెప్పారు. ఒక్క జుచితాన్ పట్టణంలోనే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంప తీవ్రతకు జుచితాన్ పట్టణం ఎక్కువగా నష్టపోయింది. చియాపాస్ రాష్ట్రంలో ముగ్గురు, టబాస్కో రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు పూర్తయితే కానీ పూర్తి వివరాలు అందుబాటులోకి రావని అధికారులు వెల్లడించారు. మెక్సికో నగరం సహా 11 రాష్ట్రాల్లోని స్కూళ్లను మూసివేయాలని, నిర్మాణాల్ని తనిఖీ చేశాకే తెరవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మీటరు ఎత్తుతో అలలు మెక్సికో తీరంలో ఒక మీటరు ఎత్తుతో అలలు ఎగసిపడ్డాయని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈక్వెడార్, ఎల్‌సాల్వడార్, గ్వాటెమాలా తీర ప్రాంతాల్లోను మీటరు, అంతకంటే తక్కువ ఎత్తులో అలలు ఎగసిపడ్డాయని వెల్లడించింది. హవాయి దీవులకు, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతాలకు ఎలాంటి ముప్పులేదని పేర్కొంది. 5 కోట్ల మందిపై ప్రభావం ‘గత వందేళ్లలో ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపం ఇదే’ అని మెక్సికో అధ్యక్షుడు నియోటో అన్నారు. భూకంపం అనంతరం జాతీయ విపత్తు నివారణ కేంద్రంలో స్వయంగా ఆయన సహాయ కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. మెక్సికోలో 5 కోట్ల మంది పై ప్రభావం ఉంది. భూకంపం అనంతరం 4 అంతకుమించిన తీవ్రతతో 20 సార్లు ప్రకంపనలు వచ్చాయని అమెరికా భూభౌతిక విభాగం తెలిపింది. మెక్సికో సరిహద్దు దేశం గ్వాటెమాలా దేశంలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 1985లో వచ్చిన భూకంపం ధాటికి మెక్సికోలో 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. -
మెక్సికో తీరంలో భారీ భూకంపం... సునామీ వార్నింగ్
-
మెక్సికో తీరంలో భారీ భూకంపం.. సునామీ వార్నింగ్


