breaking news
trackers
-
డాక్టర్ ఏఐ.. మీ హెల్త్ కోచ్..!
మీరు స్మార్ట్ వాచ్ లేదా స్మార్ట్ రింగ్ వంటి వేరబుల్స్ పెట్టుకుంటే.. ప్రతిరోజూ మీ వాచ్‌లో లేదా స్మార్ట్ ఫోన్లో ఓ లిస్ట్ కనిపిస్తుంది. ఎన్ని స్టెప్స్ నడిచారు? ఎంత సమయం నిద్రపోయారు? హార్ట్ రేట్ ఎలా ఉంది? స్లీప్ స్కోర్ ఎంత?.. ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఇవన్నీ చూడడానికి కేవలం నంబర్లు. మనం నిత్యం అవి చెక్ చేసుకుంటూ లైఫ్ స్టైల్లో చేయాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తాం. అప్పుడప్పుడు అనేక సందేహాలు కూడా వస్తుంటాయి. ఆ ట్రాకింగ్ డేటాలో నిజానిజాలేంటి? ఆ గణాంకాల గుట్టు ఎంత వరకూ శాస్త్రీయం అని మనమే గూగుల్ తల్లిని అడుగుతుంటాం. ఇకపై, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. అన్నీ ‘ఏఐ’ చూసుకుంటుంది. స్మార్ట్ వాచ్‌లు, రింగ్‌లు, ఇతర వేరబుల్ ట్రాకర్లు సేకరించిన డేటాని విశ్లేషిస్తుంది. లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చెబుతుంది. అంటే జిమ్‌లో ఫిట్నెస్ కోచ్‌లా, ఇంట్లో ఫ్యామిలీ డాక్టర్లా అన్నమాట! –సాక్షి, స్పెషల్ డెస్క్దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఇప్పుడు ‘ఏఐ’ అప్డేట్స్పైనే వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ గూటి నుంచి వచ్చిన జెమినై కూడా నిత్య నూతనంగా అప్డేట్ అవుతోంది. ఇప్పుడు కొత్తగా ఓ ఏఐ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకుంది. అదే ’పర్సనల్ హెల్త్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’ (పీహెచ్ఎల్ఎల్ఎమ్). ఇదో హెల్త్ కోచ్ మాదిరిగా పని చేస్తుంది. అంటే.. మనం వాడే యాపిల్ వాచ్, ఫిట్ బిట్ వంటి ఫిట్నెస్ ట్రాకర్ల నుంచి వచ్చే డేటాని తీసుకుంటుంది. విశ్లేషిస్తుంది. తగిన సలహాలు ఇస్తుంది. ఉదాహరణకి.. మీ నిద్ర క్వాలిటీ తగ్గిందా? వెంటనే అలర్ట్ అవుతుంది. తన నిఘా వ్యవస్థని అడుగుతుంది. మీరెంత సమయం సిస్టమ్‌పై వర్క్ చేస్తున్నారు, టైమ్‌కి తింటున్నారా లేదా.. ఇలా అన్నింటినీ ట్రాకర్స్ నుంచి తీసుకుని ‘స్క్రీన్ టైమ్ తగ్గించాలి.. డైట్లో ఇలాంటి మార్పులు చేయాలి.. రాత్రి పడుకునే ముందు లైట్ ఫుడ్ తీసుకోవాలి‘ వంటి పలు సూచనలు చేస్తుంది. సో.. మన హెల్త్ ట్రాకర్లు.. కేవలం డేటా మెషీన్లు కాదు, పర్సనల్ హెల్త్ కోచ్‌లుగా కూడా సరికొత్త అవతారం ఎత్తనున్నాయన్నమాట.850 కేసులను పరిశీలించి..దేన్నయినా వెంటనే నిజం అని ఎలా నమ్ముతాం? శాస్త్రీయంగా ఓ నిర్ధారణకి రావాలి. అందుకే గూగుల్ కూడా ఈ ఏఐ లాంగ్వేజ్ మోడల్‌పై ప్రయోగాత్మకంగా పరిశీలన చేసింది. ‘నేచర్’ మెడిసిన్ జర్నల్‌లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. పలు ఫిట్నెస్ ట్రాకర్ల నుంచి సేకరించిన 850 కేసులను గూగుల్ సేకరించింది.రియల్ టైమ్‌లో తీసుకున్న మొత్తం డేటాని ఏఐతో కంపైల్ చేస్తే.. 79% నిద్రకి సంబంధించిన ప్రశ్నలకు.. 88% ఫిట్నెస్ డేటాపై సరైన సమాధానాలు ఇచ్చిందట.హార్ట్ బీట్ డేటాపై సగటున 76% సరైన విశ్లేషణ చేసిందని గూగుల్ పరిశోధకులు ప్రకటించారు.ఎంత వరకు సురక్షితం?‘ఆహా!! ఏఐ ఓ అద్భుతమే’ అని మనం ప్రశంసించినా.. కచ్చితంగా దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే దీనికి కూడా పరిధిని నిర్దేశించుకోవాలని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ఏఐ హెల్త్ కోచ్‌లు చెప్పేవి కేవలం సూచనలుగానే పరిగణించాలి. దాన్నే వైద్యుడిగా భావించకూడదు’ అంటున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ఏఐ తప్పు అంచనాలు వేయొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పిల్లల కోసం వాడుతున్నట్లయితే కచ్చితంగా పేరెంటల్ కంట్రోల్స్ తప్పనిసరి. ఎప్పటికప్పుడు ప్రైవసీ సెట్టింగ్స్‌ను తప్పనిసరిగా చెక్ చేయాలి.» ఎంత స్మార్ట్ అవుతున్నాయో అంతే సున్నితమైన డేటాను కూడా వేరబుల్స్ రికార్డ్ చేస్తున్నాయి.» హార్ట్ రేట్, స్లీప్ ప్యాటర్న్స్, మానసిక స్థితికి సంబంధించిన సమాచారం లీక్ అయితే.. చాలా పెద్ద సమస్యే. » సైబర్ సెక్యూరిటీ కట్టుదిట్టంగా లేకపోతే.. హెల్త్ డేటా వ్యాపార వస్తువైపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. » ‘పటిష్టమైన డేటా ప్రైవసీ రక్షణ, వాడేవారిలో డిజిటల్ అక్షరాస్యత.. రెండూ తోడైతే హెల్త్ ట్రాకర్స్, ఏఐ మనిషి లైఫ్‌కి చక్కని రక్షణ కవచాలుగా మారతాయి. కచ్చితంగా ఆరోగ్య రంగంలో విప్లవమే అవుతుంద’ని టెక్ నిపుణులు చెబుతున్నారు. » యాపిల్ సంస్థ కూడా ఈ తరహా ఏఐ ఫీచర్స్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఐఓఎస్ 18లో ఆరోగ్య సంబంధిత టూల్స్, ఏఐ ఆధారిత న్యూట్రిషన్ ట్రాకింగ్‌ను అందించేందుకు ప్రయోగాలు చేస్తోంది.మన గత చరిత్రనూ తవ్వి..ఏఐ అందించిన ఈ ఫలితాల ఆధారంగా చూస్తే.. ఇది హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు ఇచ్చిన సమాధానాలతో దాదాపు సమానమే. అంతేకాదు.. గూగుల్ పరిశోధకులు చెబుతున్న ప్రకారం.. పీహెచ్ఎల్ఎల్ఎమ్ వినియోగదారుల హెల్త్ రికార్డ్స్‌పై మరింత లోతైన విశ్లేషణ చేస్తుందట. రియల్ టైమ్ డేటానే కాకుండా ట్రాకర్ల నుంచి యూజర్ల హిస్టరీని కూడా ఏఐతో కంపైల్ చేస్తున్నారు గూగుల్ పరిశోధకులు. దీంతో మరింత నమ్మకమైన సూచనలు చేసేందుకు వీలవుతుందట. వినియోగదారులకు ఓ ఫ్యామిలీ డాక్టర్ లా సేవలు అందించేలా సిద్ధం చేస్తున్నామని ఏఐ రూపకర్తలు చెబుతున్నారు. -
చైనాకు దీటుగా.. ‘వోల్టీ’ జీపీఎస్ ట్రాకర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీపీఎస్ ట్రాకర్స్ తయారీలో ఉన్న వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్... సొంత ప్లాంటు ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలో రానున్న ఈ ప్లాంటు కోసం కంపెనీ రూ.15 కోట్ల వరకు వెచ్చించనుంది. ఈ తయారీ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. ఇతర విభాగాల్లో మరో 200 మంది అవసరమవుతారని వోల్టీ సీఈవో కోణార్క్ చుక్కపల్లి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ధర విషయంలో చైనాకు దీటుగా పోటీ పడుతున్నామని, నాణ్యతలో రాజీపడటం లేదని చెప్పారాయన. కొత్త ప్లాంటు రోజుకు 2,000 యూనిట్ల తయారీ సామర్థ్యంతో రానుంది. 10 రకాల మోడళ్లు... ప్రస్తుతం కంపెనీ హైదరాబాద్‌లోని ఓ థర్డ్ పార్టీకి చెందిన యూనిట్లో జీపీఎస్ ట్రాకర్లను తయారు చేస్తోంది. ఇవి వోల్టీ సొంత ఆర్అండ్డీ కేంద్రంలో రూపుదిద్దుకున్నాయి. కంపెనీలో 60 మంది ఉద్యోగులుండగా 10 రకాల ఉత్పాదనలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వాహనాల ట్రాకర్లతో పాటు పర్సనల్ ట్రాకర్ కూడా ఉంది. 30 రోజుల వరకు బ్యాకప్ ఇచ్చే వేరియంట్‌ను కంపెనీ రూపొందించింది. మోడల్‌ను బట్టి దీని ధర రూ.6,000 వరకు ఉంది. నెలకు 7,000 యూనిట్లను కంపెనీ విక్రయిస్తోంది. ఒక ఏడాది రిప్లేస్మెంట్ వారంటీ ఇస్తోంది. ఆర్ఎఫ్ఐడీ రీడర్లను సైతం వోల్టీ తయారు చేస్తోంది. మహీంద్రా అతి పెద్ద కస్టమర్. డిమాండ్ ఒక కోటి యూనిట్లు.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ (ఏఐఎస్–140) ప్రమాణాలు భారత్‌లో అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం బస్సులు, ట్యాక్సీల వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో ట్రాకింగ్ ఉపకరణాలు ఉండాలి. ఈ ట్రాకింగ్ డివైస్‌కు ఏఐఎస్–140 ధ్రువీకరణ తప్పనిసరి. భారత్‌లో ఏఐఎస్–140 ధ్రువీకరణ ఉన్న 12 కంపెనీల్లో వోల్టీ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో తమకే ఈ ధ్రువీకరణ ఉన్నట్లు కోణార్క్ చెప్పారు. ఏఐఎస్–140 ప్రమాణాలు అమలులోకి వస్తాయి కనక వచ్చే ఏడాది కోటి జీపీఎస్ ట్రాకర్లు అవసరమవుతాయని చెప్పారు. దీనికి అనుగుణంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటామన్నారు. -
బాలగజేంద్రుని విలాపం!
రాత్రంతా నీటి దొనలోనే.. గున్న ఏనుగును వదిలి వెళ్లలేక గజరాజుల ఘీంకారం ఎట్టకేలకు సుఖాంతం పలమనేరు, న్యూస్‌లైన్: ప్రమాదవశాత్తు నీటిదొనలో పడ్డ గున్న ఏనుగు ఒక రాత్రంతా అక్కడే విలపించింది. దాన్ని పైకి లాగలేక.. వదిలి వెళ్లలేక గజరాజులు అక్కడే ఘీంకారాలు చేశాయి. పిల్లను పైకి లాగేందుకు ఏనుగుల గుంపు చుట్టుపక్కల ఉన్న మట్టిని, ఎండిన చెట్టుమొదళ్లు, రాళ్లను దొనలోకి నెట్టాయి. దొన లోతు పది అడుగులకు పైగా ఉంది. అందులో నీళ్లు ఎనిమిది అడుగుల దాకా ఉన్నాయి. అయినా వాటి ప్రయత్నం ఫలించలేదు. రాత్రంతా దొనలోనే... కౌండిన్య అభయారణ్యంలో దాహం తీర్చుకోవడానికి వచ్చిన గున్నఏనుగు నీటి దొనలో పడి ఇరుక్కుపోయింది. ఒక రాత్రంతా అక్కడే ఉండిపోయింది. సోమవారం ఉదయం పశువుల కాపరులు అటవీశాఖకు సమాచారమందించారు. ఎఫ్ఆర్వో బాలవీరయ్య, సిబ్బంది, ఫారెస్ట్ ట్రాకర్స్, గ్రామస్తులను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లారు. గున్నఏనుగు ఉన్న ప్రాంతంలోనే ఏనుగుల గుంపు ఉండడంతో ట్రాకర్స్ టపాసులు పేలుస్తూ వాటిని దూరంగావెళ్లగొట్టారు. మూడు గంటలపాటు శ్రమించి తాళ్ల సాయంతో ఏడాది వయసున్న గున్నఏనుగును బయటకు తీశారు. చెరుకులు ఆహారంగా ఇచ్చి అడవిలోకి వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. నీరసించిన అది ముందుకు వెళ్లలేదు. సోమవారం బాగా పొద్దుపోయేవరకు కూడా ఏనుగుల గుంపు మాత్రం ఘీంకారాలు చేస్తూ అక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. ట్రాకర్స్ కాపలా ఉన్నారు.