breaking news
Tpcc meeting
-
2029లోనే అసెంబ్లీ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని, కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చే బాధ్యత పార్టీ నాయకులదేనని చెప్పారు. ‘1994–2004 వరకు పదేళ్లు టీడీపీ, 2004–2014 వరకు పదేళ్లు కాంగ్రెస్, 2014–23 వరకు తొమ్మిదేళ్లు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. ఇక 2023–33 వరకు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఈ పదేళ్లూ అధికార బాధ్యతలు నేను చూసుకుంటా. పార్టీ కోసం పనిచేసే వారిని కాపాడుకునే బాధ్యత నాది.మీరు భవిష్యత్తు నాయకులను తయారు చేయండి..’అని సీఎం కోరారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాలిచ్చే కార్యక్రమం మంగళవారం గాం«దీభవన్‌లో జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పార్టీ పదవులు పొందిన వారికి అభినందనలు తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. పదవులకు న్యాయం చేయాలి..లేదంటే తప్పిస్తారు ‘పార్టీ నిర్మాణంలో కొత్తగా పదవులు పొందినవారు భాగస్వాములు కావాలి. అప్పుడు ప్రభుత్వంలో మీరూ భాగస్వాములవుతారు. రాజకీయంగా ఎదగడానికి ఈ పదవులు, వేదికలే ఉపయోగపడతాయి. ప్రభుత్వ బాధ్యతల కంటే పార్టీ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వేలాది మంది పోటీ పడినా ఈ పదవులు మీకే దక్కినందుకు వాటికి న్యాయం చేయాలి. పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి.పార్టీలో పనిచేసే వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయి. నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు తీసుకునేందుకు కొందరు అంగీకరించలేదు. అంగీకరించి బాధ్యతలు తీసుకున్నవారు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అయినంత మాత్రాన ఇక రాజకీయ జీవితం నల్లేరు మీద నడక అవుతుందని అనుకోవద్దు. మీరు ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే రాజకీయంగా ముందుకెళతారు. లేదంటే ఎన్నికల ముందు తప్పిస్తారు..’అని రేవంత్ చెప్పారు. భవిష్యత్తులో చాలా అవకాశాలు ‘నాయకుల ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మిగిలింది కార్యకర్తల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కష్టపడిన వారికి, కష్టపడి కార్యకర్తలను గెలిపించిన వారికి అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో చాలా పరిణామాలు జరుగుతాయి. డీలిమిటేషన్ జరుగుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. మహిళలకు రిజర్వేషన్లు వస్తాయి. 2029లో మీలో చాలామందికి అవకాశాలు వస్తాయి. అప్పటికల్లా సిద్ధంగా ఉండండి..’అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అలా చేస్తే పార్టీకి తిరుగుండదు: భట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కా లంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామ ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఒక్క సంక్షేమ పథకాల కోసమే రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ నేతలు ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని అన్నారు. సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సలహాదారు షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.అవును..అంతా అక్క కష్టమే..జగ్గారెడ్డి దంపతులపై సీఎం చలోక్తి ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, భట్టి విక్రమార్క, మహేశ్‌గౌడ్, సంపత్‌కుమార్, షబ్బీర్ అలీ, నాయిని రాజేందర్‌రెడ్డిలు పార్టీలో ఎలా ఎదిగారో సీఎం వివరించారు. జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన భార్య నిర్మలా జగ్గారెడ్డికి కీలకమైన టీజీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చామని చెప్పారు. జగ్గారెడ్డి అందులో తనదేమీ లేదని అనడంతో.. ‘అవును.. నిర్మలక్కకు పదవి రావడంలో జగ్గారెడ్డికి సంబంధం లేదు. ఆమె పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కష్టపడ్డారు.. అందుకే పెద్ద కార్పొరేషన్‌కు చైర్మన్ అయ్యారు. అంతా అక్క కష్టమే..’అంటూ సీఎం చలోక్తి విసిరారు. -
ఇదేం పద్ధతి?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అటు రాష్ట్ర మంత్రులు, ఇటు పార్టీ నేతలపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి కీలకమైన కార్యకర్తలను నిరాశ పరచడం మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వ పదవులను కార్యకర్తలకు ఇప్పించడంలో జాప్యం జరిగితే ప్రయోజనం ఏంటని ప్రశ్నించిన రేవంత్.. దేవాలయాల కమిటీలు, మార్కెట్ కమిటీలు లాంటి పదవులు నేరుగా తాను ఇవ్వలేనని, ఇన్చార్జి మంత్రులు షార్ట్‌లిస్ట్ చేసి పంపితే తాను ఫైనల్ మాత్రమే చేయగలనని అన్నారు. నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ పదవులు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని, ఇలాంటి చర్యల ద్వారా కార్యకర్తలను నిరాశకు గురిచేయవద్దని చెప్పారు.వీలున్నంత త్వరగా నామినేటెడ్, పార్టీ పదవుల కోసం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జాబితాలను పార్టీకి పంపాలని, పార్టీ నుంచి వచ్చిన జాబితాలను పరిశీలించి నామినేటెడ్ పదవులను ఫైనల్ చేద్దామని అన్నారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ పీఏసీ భేటీ జరిగింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌తో పాటు పీఏసీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్ని కలు, బీసీల కులగణన, ఎస్సీల వర్గీకరణ, సంస్థాగత నిర్మాణం గురించి చర్చించిన ఈ సమావేశంలో సీఎం రేవంత్.. తనదైన శైలిలో పలు వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. వాళ్లను చూసి ఇంకొకరొస్తారు ఎవరంటే వాళ్లు వచ్చి గాం«దీభవన్‌లో ధర్నాలు చేస్తే ఆఫీసు నిర్వాహకులు ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. యాదవ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందంటూ కొందరు యాదవ సంఘాల ప్రతినిధులు గొర్రెలను తీసుకొచ్చి ధర్నా చేయడంపై సీరియస్‌గా స్పందించారు. పార్టీలో ప్రాధాన్యం కావాలని, మంత్రి పదవులు ఇవ్వాలని ఏ సామాజికవర్గానికి చెందిన వారయినా అడగొచ్చని, తనతో పాటు పార్టీ అధ్యక్షుడికి వినతిపత్రాలు ఇవ్వొచ్చని, డిమాండ్ చేయవచ్చని, కానీ ఓ సామాజిక వర్గం పేరుతో వచ్చి గాం«దీభవన్‌లో ధర్నా చేయడమేంటని ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతిపక్షాల చేతికి తామే ఆయుధాలిచ్చినట్టు అవుతుందని అన్నారు. ఇప్పుడు వచ్చిన వారిని చూసి రేపు ఇంకొకరు వచ్చి ధర్నా చేస్తారని, ఇలాంటి ధర్నాలకు గాం«దీభవన్‌లో అవకాశం ఇవ్వకూడదని అన్నట్టు తెలిసింది. ఇన్చార్జి మంత్రులు గ్రామాలకు వెళ్లాలి క్షేత్రస్థాయిలో ఇన్చార్జి మంత్రులు చేయాల్సిన పనులు చేయాలని, లేదంటే గ్రామాలకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే తాను వెళ్లడం వల్ల ఉపయోగం లేదని, గ్రామాలకు వెళ్లాల్సింది ఇన్చార్జి మంత్రులేనని స్పష్టం చేశారు. 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సంస్థాగత నిర్మాణంపై పీసీసీ దృష్టి సారించాలని చెప్పారు. ‘జూబ్లీహిల్స్’పై చర్చ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఎన్నిక చాలా కీలకమని, ఈ అంశంపై పార్టీ ఫోకస్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. అయితే కీలకమే కాదని, ఖచ్చితంగా గెలిచి తీరాలని మీనాక్షి స్పష్టం చేశా రు. ఉప ఎన్నికకు పార్టీ సిద్ధం కావాలని, ఆ నియోజకవర్గంలో చేయాల్సిన అన్ని కార్యక్రమాల రోడ్‌మ్యాప్‌ను హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తయారు చేయాలని సీఎం సూచించారు. అభ్యరి్థని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని, తామంటే తాము అభ్యర్థులమని ఎవరూ చెప్పకూడదని పీసీసీ అధ్యక్షుడు ఆదేశించారు.మేనిఫెస్టోలో పెట్టలేదు: భట్టి.. కాదు పెట్టాం: శ్రీధర్‌బాబు రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా తాము అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అయితే మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..మేనిఫెస్టోలో పెట్టామంటూ పుస్తకం చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగానే ఉన్నాయి కానీ, కార్యకర్తలను దృష్టిలో ఉంచుకుని వారికి మేలు చేసే పథకాలు కూడా రూపొందించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు.పదవులు, ప్రాధాన్యతలో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి కంటే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు కోరారు. సమావేశంలో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు తదితరులు మాట్లాడారు. కాగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాసిన వ్యాసాల సంకలనం ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’అనే పుస్తకాన్ని రేవంత్, మీనాక్షి ఆవిష్కరించారు. ‘వైఎస్ రచ్చబండ’లాంటి కార్యక్రమం కావాలి ప్రభుత్వ పరంగా చేసింది చెప్పుకోలేకపోతున్నామని సీనియర్ నేత జెట్టి కుసుమకుమార్ పీఏసీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన రచ్చబండ లాంటి కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల కారణంగా ఎవరికి లబ్ధి కలుగుతుంది, ఎవరికి కలగడం లేదనే అంశాలపై గ్రామాల్లోనే చర్చ పెట్టాలని సూచించినట్టు సమాచారం. కాగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా అవకాశం లభిస్తుందని మీనాక్షి నటరాజన్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోందని అభినందించారు. రాష్ట్రంలో గోల్డెన్ పాలన సాగుతోందని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని మహేశ్‌గౌడ్ అన్నారు.ఏఐసీసీ కూడా తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి గణాంకాలతో సహా భట్టి వివరించారు. సమావేశం అనంతరం పీఏసీ నిర్ణయాలను మంత్రి వాకిటి శ్రీ«హరి, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి భట్టి వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో చేసిన కార్యక్రమాలను పీఏసీ అభినందించిందని, గోల్డెన్ పీరియడ్ అని అభివర్ణించిందని చెప్పారు. బూత్, మండల, జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలని కూడా పీఏసీ నిర్ణయించినట్లు తెలిపారు. -
బోర్లాపడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్కు బుద్ది రాలేదు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి పీసీసీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగిన ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, ప్రదేశ్ ఎన్నికల, రాజకీయ వ్యవహారాల కమిటీల సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు ఎకరం స్థలం కేటాయించనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. 6 గ్యారంటీల అమలుకు త్వరలో గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు ఇదిరమ్మ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ కమిషన్ రద్దు చేసి, త్వరలో కొత్త కమిషన్ నియమించనున్నారు. చదవండి: కేడర్ వివాదం కేసు.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేత రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ఖరారు కార్యవర్గ భేటీలో పార్టీ నేతలు 3 తీర్మానాలు ప్రవేశపెట్టారు. జనవరి 8,9 తేదీల్లొ పార్లమెంట్ ఎన్నికలపై ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. 11,12,13 తేదీల్లొ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మంత్రులు, నేతలతో ఎన్నికలపై సమావేశం కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రి 14వ తేదీ నుంచి 4 రోజుల పాటు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ పర్యటన అనంతరం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు సీఎం రేవంత్. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తమదని అన్నారు. బోర్లపడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్కు బుద్ది రాలేదని విమర్శించారు. నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుందని ధ్వజమెత్తారు రేవంత్. బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు. టార్గెట్ 17 పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పనిచేయాలని..12కు తగ్గకుండా సీట్లను గెలిపించుకోవాలని తెలిపారు. ఈ నెల 8న 5 జిల్లాలు.. 9న 5 జిల్లాల నేతలతో సమీక్షించనున్నట్లు చెప్పారు . 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని తెలిపారు. ‘బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుంది. అందుకే కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారు. ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నాడు. కాళేశ్వరం అవినీతిపై మేం జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతాం. బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు. ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు. పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారు’ అని రేవంత్ మండిపడ్డారు. కార్యవర్గ భేటీ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దశాబ్ద కాలం తర్వాత మనకు వచ్చిన గొప్ప అవకాశమని తెలిపారు. అనేక కష్టనష్టాలను భరించి అధికారంలోకి వచ్చామన్నారు. యువత ఎన్నో కలలు కని తెలంగాణ కోసం పోరాటం చేశారని చెప్పారు. ప్రజలకు మనం ఇచ్చిన హామీలపై విశ్వాసంతో కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పిచేశారని భట్టి మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాలని, మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినట్టు ప్రజలు ఫీల్ అవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు. ఇతర మంత్రులు మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. తలతాకట్టు పెట్టైనా 6 గ్యారంటీలు అమలు చేస్తాం తెలిపారు. -
కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకం: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 7న కులీ కుతుబ్‌షా మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచన మేరకు ఈనెల 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదానీ అక్రమాలపై కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటంపై అణచివేత తదితర అంశాలపై చర్చించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఏప్రిల్ నెలలో జై భారత్ సత్యాగ్రహ కార్యక్రమాలపై సమీక్షించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ నేతల ప్రచారంపై చర్చించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకమని, అక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ వచ్చినట్లేనని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి 25 వరకు తిరిగి తన పాదయాత్ర మొదలవుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. గజ్వేల్‌లో లక్షమందితో నిరుద్యోగ నిరసన సభ ఉంటుందని చెప్పారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మిగిలిన 4 అసెంబ్లీ స్థానాలతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లే నేతల వివరాలు ఇవ్వాలని, ఏప్రిల్ 25 నుంచి మే 6 వరకు కర్ణాటకలో ప్రచారానికి హాజరు కావాలని నాయకులను కోరారు. ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం గాంధీభవన్‌కు వచ్చి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిశారు. కర్ణాటక ప్రచారానికి తాను కూడా వస్తానని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ని చేస్తేనే పేపర్ లీకేజీ కేసు విచారణ సాఫీగా సాగుతుందని, లేకపోతే లేదని చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ కమిటీని కూడా రద్దు చేయాలని, పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టీఎస్పీఎస్సీ తీగ లాగితే.. ప్రగతి భవన్ లింక్ బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ ఫిర్యాదుతోనే ఈ పేపర్ లీక్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. -
ఏం చేద్దాం... ఎలా వెళ్దాం?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ రద్దు అవుతుందని, డిసెంబర్లో ఎన్నికలు వస్తాయనే సంకేతాలతో టీపీసీసీ ముఖ్యులు మరోమారు భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం జాంబాగ్‌లోని మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ నివాసంలో సమావేశమై రాజకీయ పరిణామాలను బట్టి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశంలో భాగంగా గురువారం కేసీఆర్ తీసుకునే నిర్ణయం వెలువడిన అనంతరం తాము ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా తాము ఎన్నికలకు సిద్ధమైపోవాలని, కార్యక్రమాలను ముమ్మరం చేయాలని నిర్ణయించినట్టు సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం, శ్రీనివాస కృష్ణన్, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ, డీకే.అరుణ, శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, పటోళ్ల శశిధర్‌రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, భిక్షపతియాదవ్, విష్ణు, విక్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్‌ను ఆహ్వానిస్తాం: రాజనర్సింహ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ డీఎస్ రాకను తాము స్వాగతిస్తామని, అయితే పదవులు, సీట్ల విషయం పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. తమ పార్టీని ఎవరూ విడచివెళ్లరని, అన్నీ ఊహాగానాలేనన్నారు. తెలుగుదేశం ఓ రాజకీయ పార్టీ అని, మరో రాజకీయ పార్టీగా దానితో కలసి వెళ్లడంలో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఏదైనా పొత్తుల విషయం హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. -
పాల్వాయి సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్: గాంధీ భవన్‌లోని టీపీసీసీ కార్యాలయంలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్వాయి మాట్లాడారు. పార్టీ సీనియర్లు కొందరు క్రమశిక్షణ పాటించడం లేదని, హద్దులు దాటుతున్నారని పాల్వాయి ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ నేత ఏకే ఆంటోనికి కూడా చెప్పానన్నారు. ఒక్క నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలే ఇలా గీత దాటి వ్యవహరిస్తున్నారని చెప్పారు. వీరిని పార్టీకి చెందిన వారే ఎవరో కొందరు ప్రోత్సహిస్తున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీ గీత దాటుతున్న నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత దిగ్విజయ్సింగ్దే నని పేర్కొన్నారు. కాగా, ఈ భేటీకి ఏడుగురు సభ్యులు డుమ్మాకొట్టడం చర్చనీయాంశమైంది. రాపోలు ఆనంద్‌భాస్కర్, ఎంఏ ఖాన్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రులు దామోదర్ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య సమన్వయ కమిటీ భేటీకి గైర్హాజరయ్యారు. -
'అనాలోచిత నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం'
హైదరాబాద్: నోట్ల రద్దు చర్య మోదీ అనాలోచిత నిర్ణయమని, దీని వలన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని టీసీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ సమావేశంలో.. నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణను ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. జనవరి రెండో తేదీన జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు, 5,6,7వ తేదీల్లో కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే జనవరి 9న మహిళలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 11వ తేదీన ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ
-
రసాభాసాగా టీపీసీసీ విస్తృస్ధాయి సమావేశం