breaking news
Time 100 Readers Poll
-
మేయర్‌గా ఉంటూనే మెటర్నిటీ లీవ్.. ఏకంగా టైమ్-100లో చోటు!
మేయర్‌గా బాధ్యతలు.. మరోవైపు తల్లిగా కొత్త ప్రయాణం. బిడ్డకు జన్మనిచ్చేందుకు 16 వారాల విరామం తీసుకున్న జపాన్ మేయర్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కుటుంబం కోసం తీసుకున్న నిర్ణయమే ఆమెకు అరుదైన గుర్తింపును తీసుకొచ్చింది.జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చర్‌లోని యావటా సిటీ మేయర్ షోకో కవాటా ‘TIME100 Next’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 36 ఏళ్ల కవాటా సెప్టెంబర్ 15న తొలి బిడ్డకు జన్మనిచ్చారు. మేయర్‌గా కొనసాగుతూనే మెటర్నిటీ లీవ్ తీసుకున్న జపాన్ తొలి మేయర్‌గా ఆమె నిలిచారు. అయితే, ఆమె నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మహిళలు రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉంటూనే కుటుంబ బాధ్యతలను నిర్వహించడానికి అవసరమైన పరిస్థితులు కల్పించాలనే చర్చ మొదలైంది.అలాగే, కవాటా నిర్ణయానికి చాలామంది మద్దతు తెలపగా.. మరికొందరు విమర్శలు చేశారు. ప్రజాప్రతినిధిగా విధులకు దూరంగా ఉండటం బాధ్యతారాహిత్యమని కొందరు వ్యాఖ్యానించారు. అయితే, కవాటా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. మహిళలు కుటుంబ బాధ్యతలు, మాతృత్వం కారణంగా రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఉండకూడదని ఆమె అన్నారు. ఈ క్రమంలో కుటుంబం, ఉద్యోగం రెండింటినీ సమన్వయం చేసుకోవడానికి మహిళలకు అనుకూలమైన వ్యవస్థలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.అయితే, జపాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్ నిబంధనలు ఉన్నప్పటికీ.. స్థానికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక చట్టపరమైన విధానం లేదు. దీంతో, కవాటా తన కార్యాలయంతో కలిసి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. 16 వారాల పాటు తన అధికారాలను డిప్యూటీ మేయర్ షిగెటో నోసేకు అప్పగించారు. వీలైనప్పుడు రిమోట్‌గా విధులకు సంబంధించిన పనులను కొనసాగించారు. సెప్టెంబర్ 15న పాపకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రకటించి, తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ నేపథ్యంలో తల్లిగా తన అనుభవాలను భవిష్యత్తులో ప్రజా విధానాల్లో ప్రతిబింబించాలని ఆమె ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా అర్థం చేసుకుని పరిష్కారాల కోసం పనిచేస్తానని తెలిపారు.ఇదీ చదవండి: రెండు విషపు సూదులు.. అయినా చావలేదు! -
మోదీకి ఓట్లు పడలేదు
‘టైమ్–100’ రీడర్స్ పోల్‌లో డ్యుటెర్టోకు అగ్రస్థానం న్యూయార్క్: ‘టైమ్–100’ ప్రభావశీల వ్యక్తుల కోసం నిర్వహించిన రీడర్ పోల్‌లో ప్రధాని మోదీకి ఒక్క ఓటూ పడలేదు. ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల ఎంపిక కోసం ‘టైమ్’ మేగజైన్ నిర్వహించిన ఆన్లైన్ రీడర్ పోల్‌లో ఫిలిప్పీన్స్ వివాదాస్పద అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2016లో అత్యంత ప్రభావశీల వ్యక్తులను ఎంపిక చేసేందుకు టైమ్ మేగజైన్ రూపొందించిన ప్రముఖుల జాబితా (ప్రాబబుల్స్)లో మోదీతో సహా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంకా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్ తదితరులు చోటు దక్కించుకున్నారు. దీనిపై ఆన్లైన్లో రీడర్ పోల్ నిర్వహించారు. ఇందులో అమెరికాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టోకు పాఠకులు అత్యధికంగా 5% ఓట్లు వేశారు. ఆ తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, పోప్ ఫ్రాన్సిస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌లకు 3% చొప్పున వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు 2% ఓట్లు పడ్డాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త కుష్నర్‌లకు ఒక్క ఓటూ పడలేదు.


