breaking news
thousand rupee
-
Thousand Note: రూ.వెయ్యి నోటు రద్దుకు 48 ఏళ్లు!
రూ.వెయ్యి నోటు ఎప్పుడు రద్దయ్యిందంటే టక్కున 2016లో మోదీ ప్రభుత్వం రద్దుచేసిందని చెప్పేస్తారు. కానీ అంతకు ముందే కొన్నేళ్ల క్రితం చలామణిలో ఉన్న ఈ రూ.వెయ్యి నోటు రద్దయ్యి నేటి సరిగ్గా 48 ఏళ్లయ్యింది. 1978 జనవరి 15వ తేదీన అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిల హయాంలో కొన్ని ఆర్థిక కారణాల రీత్యా పెద్ద నోట్లను రద్దు చేశారు. 72 ఏళ్ల కిందట 1954లో భారత రిజర్వు బ్యాంక్ ఈ వెయ్యి నోట్లను విడుదల చేసింది. రిజర్వు బ్యాంక్ గవర్నర్ బి.రామారావు సంతకంతో మొదటిసారిగా ఈ నోటును ముద్రించారు. ఈ నోటును కాకినాడకు చెందిన ప్రముఖ నాణేల సేకరణకర్త మార్ని జానకిరామ చౌదరి సేకరించి భద్రపరిచారు. ఈ నోటు 20.3 సెంటీ మీటర్ల వెడల్పు, 12.7 సెంటీమీటర్ల ఎత్తుతో సుమారు పావుఠావు పరిమాణంతో చలామణీలో ఉండేది. జానకిరామ చౌదరి మాట్లాడుతూ నోటుకు ముందువైపు మూడు సింహాల చిత్రం, వెనుకవైపు తంజావూరు (తమిళనాడు) లో వెయ్యేళ్ల కిందట నిర్మించిన బృహదీశ్వరాలయం చిత్రాన్ని ముద్రించారని, దీనితో పాటు చలామణిలో ఉండే ఐదు వేలు, పది వేల రూపాయల నోట్లను కూడా నాటి ప్రభుత్వం 1978 జనవరి 15 తేదీన రద్దు చేసిందని తెలిపారు. -
ఒకరికి 4 ఏళ్ల జైలు
వేమనపల్లి : ముల్కలపేట గ్రామానికి చెందిన అంబాలపున్నంకు నాలుగేళ్ల ఏళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించినట్లు అసిస్టెంట్ సెషన్ జడ్జి నిజామొద్దీన్ మంగళవారం తీర్పునిచ్చారు. నీల్వాయి ఎసై ్స శ్రీకాంత్ వివరాలు ఇలా ఉన్నాయి.. అంబాల పున్నం అదే గ్రామానికి చెందిన సమీప బందువు అంబాల సులోచన ఇంట్లోకి వెళ్లి లైంగికదాడికి యత్నించాడు. సదరు మహిళ 2011లో నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పున్నంపై కేసు నమోదు చేశారు. మంచిర్యాల కోర్టులో పీపీ శ్రీలత సాక్షులను ప్రవేశపెట్టింది. అసిస్టెంట్ సెషన్ జడ్జి నిజామొద్దీన్ పూర్వాపరాలు విచారించి శిక్ష ఖరారు చేశారు.


