breaking news
telugu states chief ministers
-
జలశక్తి శాఖ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై కేంద్రం నేతృత్వంలో జరిగిన కీలక భేటీ ముగిసింది. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోదావరి,కృష్ణా జలాలపై వివాదాలపై పరిష్కరించేలా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆధ్వర్యంలో జలవివాదాల పరిష్కార కమిటీని కేంద్రం నియమిస్తుంది. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌లోని గోదావరి నది బోర్డు,అమరావతిలోనే కృష్ణానది బోర్డు ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు రిజర్వయార్ల ప్లో నీటి లెక్కలను గుర్తించేలా టెలిమెట్రీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుంది. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ భేటీ కోసం బనకచర్లను సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రతిపాదనలను జలశాఖ చర్చకు చేపట్టింది. కానీ ఈ చర్చలో బనకచర్ల అంశం ప్రస్తావనకు రాలేదని, కేంద్రం ప్రభుత్వ పరిధిలోని సంస్థలే అభ్యంతరం వ్యక్తం చేశాయని సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ భేటీకి ఇరు సీఎంలతో పాటు ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు. సమావేశానికి ముందు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు కృతజ్ఞతలు తెలియజేసిన ఇరువురు సీఎంలు.. ఆపై ఒకరికొకరు శాలువాలతో సత్కరించుకున్నారు. అంతకు ముందు.. ఆయా రాష్ట్రాల అధికారులతో ఇరువురు సీఎంలు సమావేశమయ్యారు. భేటీలో లేవనెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. ఇక.. సముద్రంలో వృధాగా కలిసే జలాలను మాత్రమే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వినియోగించ దలిచామని ప్రధానంగా వివరించనుంది ఏపీ ప్రభుత్వం. ❇️గోదావరి నదిలో గత వందేళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాల మేరకు ఏడాదికి 2500 -3000 టీఎంసీల మేర వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని సమావేశంలో వివరించనున్న ఏపీ ప్రభుత్వం❇️ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా 200 టీఎంసీల మాత్రమే తరలిస్తామని దీని వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేయనున్న రాష్ట్రప్రభుత్వం❇️గడచిన 11 ఏళ్లలో తెలంగాణాలో నిర్మించిన ఏ ప్రాజెక్టుకూ ఏపీ అభ్యంతరం చెప్పలేదన్న విషయాన్ని సమావేశంలో తెలియచేయనున్న ప్రభుత్వం❇️వృధాగా సముద్రంలో కలిసే నీటిని వాడుకునే అంశంలో అపోహలకు తావులేదని స్పష్టం చేయనున్న ఏపీ❇️గోదావరి పై ఉన్న చిట్టచివరి ప్రాజెక్టు ద్వారా వృధాగా పోయే నీటిని మాత్రమే రైపీరియన్ రాష్ట్రంగా తాము వాడుకోదలిచామని వివరించనున్న ఏపీ ❇️ఈ అంశాన్ని తెలంగాణాతో పాటు కేంద్రం కూడా అర్ధం చేసుకోవాలని స్పష్టం చేయనున్న ఏపీ ప్రభుత్వం❇️అలాగే గత 11 ఏళ్లుగా తెలంగాణాలో కట్టిన ప్రాజెక్టులు, ఎగువ రాష్ట్రంగా వినియోగించుకున్న నీళ్ల వివరాలను సిద్ధం చేసుకున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు🚩కృష్ణాపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏఐబీపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు ఇవ్వాలి🚩బనకచర్లపై #GRMB, #CWC, ఈఏసీ తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవు. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే #Banakacharla ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనే వాదనను ఈ లేఖలో ప్రస్తావించింది.🚩గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలో ప్రస్తావించింది.🚩ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ ను కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ తిరస్కరించిన విషయాన్ని ఈ లేఖలో ఉటంకించింది. కేంద్ర జల సంఘం కూడా ప్రీ- ఫీజిబులిటీ రిపోర్టును తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు.🚩రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలని, తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను అజెండాలో చేర్చాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. -
పోలవరం–బనకచర్లే ఎజెండా
సాక్షి, అమరావతి: పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు (పీబీఎల్పీ) అనుమతిచ్చే అంశాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నిర్వహించే సమావేశం ఎజెండాగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి అనుమతుల్లేని.. గోదావరి ట్రిబ్యునల్, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ తలపెట్టిన పీబీఎల్‌పీపై సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టును తప్పించాలని కోరింది.పీబీఎల్‌పీపై ఏపీ ప్రభుత్వం సమర్పించిన పీఎఫ్ఆర్ (ప్రాథమిక నివేదిక)ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తిరస్కరించాలని డిమాండ్ చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన మేరకు ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని కోరింది. ⇒ పోలవరం కుడి కాలువ నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించేలా పీబీఎల్‌పీని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగు నీటితో పాటు 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ.. 80 లక్షల మందికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 20 టీఎంసీలు అందిస్తామని చెబుతోంది. పీబీఎల్పీ డీపీఆర్ రూపకల్పనకు అనుమతి కోసం.. పీఎఫ్ఆర్ను మే 22న సీడబ్ల్యూసీకి సమర్పించింది. అయితే, సీడబ్ల్యూసీ దీనిపై గోదావరి బేసిన్‌లోని రాష్ట్రాలు, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ల అభిప్రాయాన్ని కోరింది. గోదావరిలో వరద జలాలు లేవని, పీబీఎల్పీతో తమ ప్రాజెక్టుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. ⇒ ఇక పీబీఎల్‌పీకి పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక తయారీ కోసం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ (ఈఏసీ)కి జూన్ 5న రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. గోదావరిలో వరద జలాలు లేవని.. నీటి కేటాయింపులు లేని ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వొద్దంటూ ఈఏసీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో పీబీఎల్పీతో పాటు కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ మధ్య తరచూ తలెత్తుతున్న వివాదాలపై చర్చించేందుకు బుధవారం రెండు రాష్ట్రాల సీఎంలను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఢిల్లీకి ఆహ్వానించారు. ఎవరి వాదన వారిదే... గోదావరి నుంచి ఏటా సగటున 3 వేల టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని.. అందులో 200 టీఎంసీలు పీబీఎల్పీ ద్వారా మళ్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. నికర జలాలు కాకుండా వరద జలాలు మళ్లిస్తున్నందున ఏ రాష్ట్రానికి, ఏ ప్రాజెక్టు హక్కులకూ విఘాతం కలగదని అంటోంది. కానీ, దీనిని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను పూర్తిగా వాడుకోవడం లేదని.. ఆ జలాలే సముద్రంలో కలుస్తున్నాయని.. వరద జలాలు కాదని చెబుతోంది. వాటి ఆధారంగా పీబీఎల్పీ చేపడితే తమ రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఏపీ సింగిల్ పాయింట్... బహుళ అంశాలతో తెలంగాణకేంద్ర మంత్రితో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై రెండు రాష్ట్రాలు ఎజెండాలు పంపాయి. పీబీఎల్‌పీకి అనుమతి ఒక్కదానినే ఏపీ పేర్కొనగా.. దీనిపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిని ఎజెండా నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పాలమూరు, డిండిలకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు, తుమ్మడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్లకు 80 టీఎంసీల నీటి కేటాయింపు, సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం (ఏబీఐపీ) కింద సాయం, గోదావరిపై ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల వరద జలాల వినియోగం కోసం కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, నిధుల కేటాయింపును తెలంగాణ సర్కార్ ప్రతిపాదించింది. -
తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది. జులై4,5,6 తేదీల్లో టంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలను జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడుకి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.అమెరికా తెలుగు సంబరాలకు రండి తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానంఅమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఎల్లో మీడియా కథనాన్ని ఖండించిన ఏపీ సీఎంవో
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు ముఖ్యమంత్రులు అసంతృప్తిగా ఉన్నారంటూ ఎల్లో మీడియాలో ప్రచురితమైన కథనం కల్పితమని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశమేదీ ప్రస్తావనకు రాలేదని తెలిపింది. ఉహాజనిత అంశాలను ప్రచురించి, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఏపీ సీఎంవో హితవు పలికింది. ఈ విషయమై ఈనాడు దినపత్రిక రాసిన కథనాన్ని ఖండిస్తున్నామని, అది ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నామని ప్రకటించింది. ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని ఏపీ సీఎంవో స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా సుదీర్ఘంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరురాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమావేశం సాగిందని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గత నాలుగు నెలలుగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల లక్ష్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనని, రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొంది. గోదావరి జలాలను తరలింపు ద్వారా సాగర్ కుడికాల్వ కింద ఉన్న కృష్ణా డెల్టా, ప్రకాశం సహా రాయలసీమకూ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయని, ఈ ప్రాజెక్టును సఫలం చేసేదిశగా నిశితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారని సీఎంవో పేర్కొంది. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారని, పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలపై కూడా చర్చించారని తెలిపింది. తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీసు కానిస్టేబుళ్లకు ఏపీలోనూ శిక్షణ ఇచ్చే అంశంపైనా చర్చ జరిగిందని, విద్యుత్ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టిపెట్టారని సీఎంవో తెలిపింది. సోమవారం నాటి సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలూ చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. ఇలాంటి సమావేశం మీద ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవపట్టించడం దురదృష్టకరమని, ఇలాంటి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. చదవండి: కృష్ణకు గో‘దారి’పై.. -
తెలుగు రాష్ట్రాలకు ఎన్డీయే ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వంతో కలసి రావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర సామాజికన్యాయ, సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్ అఠవాలే సూచించారు. ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ప్లాజా హోటల్లో విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు మరింత ముందుకు సాగాలంటే కేంద్ర మద్దతు అవసరమని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు. ప్రధాని మోదీ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు అండగా నిలిచిందని, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఏన్డీయేదేనన్నారు. మోదీ ప్రభుత్వం ముస్లింలు, ఇతర మైనార్టీలకు వ్యతిరేకమనే ప్రచారంలో నిజం లేదని అన్నారు. అంచనాలకు మించిన ప్రజాతీర్పుతో అద్భుత విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుభాభినందనలు తెలుపుతున్నట్లు అఠవాలే అన్నారు. బేగంపేట పర్యాటకభవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం అనేక సంక్లిష్టతలతో కూడిన వ్యవహారమని అన్నారు. -
'సమయం వచ్చినప్పుడు కేంద్రం స్పందిస్తుంది'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు సమయమనం పాటించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇరు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న తాజా పరిస్థితులపై కేంద్రం గమనిస్తుందన్నారు. సమయం వచ్చినప్పుడు కేంద్రం స్పందిస్తుందని బండారు దత్తాత్రేయ తెలిపారు.