Tealanga
-
బంగారం కాదు బిల్డప్
సాక్షి, హైదరాబాద్: ఒంటి నిండా బంగారంతో సూర్య భాయ్‌గా సోషల్‌మీడియాలో పలు ఇంటర్వ్యూలు ఇచ్చి, కొన్ని సినిమాల్లోనూ నటించిన హైదరాబాదీ పల్లపు సురేష్ కుమార్ చెప్పినవన్నీ కేవలం బిల్డప్లేనని తేలిపోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులు పట్టుకున్న ‘బంగారు బాబు’ కొండా విజయ్‌కుమార్ వ్యవహారంతో సూర్య భాయ్ కథ బయటికి వచ్చింది. శుక్రవారం విచారణ చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతడు ధరించే బంగారు ఆభరణాల్లో అనేకం కోటింగ్‌తో కూడినవి స్పష్టం చేశారు. వీటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని తేల్చారు. గుట్టు వీడిన కట్టుకథలు.. నగరంలోని అత్తాపూర్నకు చెందిన పల్లపు సురే‹Ùకుమార్ అలియాస్ సూర్య భాయ్ తాను ధరించే బంగారు ఆభరణాలు, యూట్యూబ్ చానళ్లతో పాటు ఇతర సోషల్‌మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలతో అనేక మందిని సుపరిచితుడిగా మారాడు. తాను ధరించే నగల విలువ రూ.కోటి వరకు ఉంటుందనీ ప్రగల్భాలు పలికేవాడు. ఇప్పటి వరకు ఇతడి ప్రచారాన్ని అంతా నమ్మారు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో మొదలైన ఓ కేసు విచారణ శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇతడు చెప్పేవన్నీ కట్టుకథలని, ధరించే వాటిలో అత్యధికం నకిలీ నగలని తేలిపోయింది. సెటిల్మెంట్లతో వాహనాల కొనుగోలు సూర్య భాయ్ గడిచిన ఆరేళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని గుర్తించారు. 2022–23లో రూ.4.9 లక్షల ఆదాయం ఉన్నట్లు చూపించారని తేల్చారు. అతడితో పాటు భార్య పేరు మీదా సొంద ఇంటితో సహా ఎలాంటి స్థిరాస్తులు లేవని, నెలకు రూ.20 వేల అద్దె చెల్లిస్తూ ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. అతడికి ఉన్న థార్, సఫారి, ఎండీవర్ వాహనాలతో పాటు బుల్లెట్ బైక్‌ను భూవివాదాలు సెటిల్మెంట్ చేయడం ద్వారా వచ్చిన కమీషన్‌తో కొనుగోలు చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. సూర్యభాయ్ ధరించే నగల విలువ రూ.3 లక్షలే అని తేల్చారు. అతను ధరించేవి ఎక్కువ భాగం రాగి, వెండితో తయారయ్యాయని, వాటి పైన బంగారం, రేడియం పూత పూసినట్లుతేల్చింది. ఐటీ అధికారుల విచారణలో సూర్య భాయ్ తాను సమాజంలో పాపులారిటీతో పాటు సినిమాల్లో అవకాశాలు పొందడానికి ఇలా చేశానని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారాలపై ఐటీ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రెండ్‌ను ఫాలో కాదు… సెట్ చేసిన సిరిసిల్ల శ్రీకాంత్ విజయం
చదివింది సాఫ్ట్వేర్.. చేస్తోంది హార్డ్‌వేర్ బిజినెస్. ట్రెండ్‌ను ఫాలో కావడం కాదు.. సెట్ చేస్తామంటున్నారు సిరిసిల్లకు చెందిన పుల్లూరి శ్రీకాంత్(పీఎస్కే). తన పేరుతోనే కంపెనీని ఏర్పాటు చేసి భవన నిర్మాణాలకు అవసరమైన సామగ్రిని సరఫరా చేస్తున్నారు. వంద మందికి పైగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యోగం రాలేదని ఉసూరమనే యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నప్రాయంలోనే పారిశ్రామిక వేత్తగా ఎదిగిన శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ.సిరిసిల్ల: సామాన్యుడు పారిశ్రామికవేత్త కావాలంటే ఎంతో శ్రమించాలి. మరెంతో సాహసించాలి. ఎన్నో ఎదురుదెబ్బలను ఓర్చుకోవాలి. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘పుల్లూరోళ్ల’ హార్డ్‌వేర్ షాప్ అంటే.. తెలియనివారుండరు. ‘పుల్లూరి’ పరివారంలో ఓ వ్యాపారి పుల్లూరి శ్రీకాంత్(39). అందరిలాగే తెలుగు మీడియంలో సిరిసిల్లలోనే చదువుకున్న ఆ యువకుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి ఉద్యోగ వేటలో పడ్డారు. ఏడాదికి రూ.లక్ష జీతం వస్తే చాలు.. జీవితంలో సెటిల్ అయిపోవచ్చనే నమ్మకంతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వూ్యకు వెళ్లాడు. కానీ ఆ ఉద్యోగం రాలేదు. సిరిసిల్లకు చేరి అమ్మనాన్నలు రాధా, కృష్ణమూర్తిలకు తోడుగా వ్యాపారంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఎంతకాలం చిరువ్యాపారం అని ఆలోచించిన ఆ యువకుడు.. కొనే స్థాయి నుంచి అమ్మే స్థాయికి ఎదగాలని భావించాడు. సిరిసిల్లను వీడి భార్య ప్రణిత, కూతురు దేవహాసిని, కొడుకు రిషికేశ్‌తో హైదరాబాద్‌కు చేరారు. పుల్లూరి శ్రీకాంత్(పీఎస్కే) పేరుతో ఓ సంస్థను స్థాపించి అనతికాలంలోనే రూ.వందల కోట్ల వ్యాపారానికి చేరుకున్నారు.వ్యాపార కుటుంబం నుంచి..సిరిసిల్లలో మంచి పేరున్న వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన పుల్లూరి శ్రీకాంత్(39) చిన్న వయసులోనే నిర్మాణరంగంలో స్థిరపడ్డారు. శ్రీకాంత్ తాత, నానమ్మలు పుల్లూరి లక్ష్మీనారాయణ, అనసూర్యలు చిరువ్యాపారులు. వారి వారసత్వ వ్యాపారాన్ని మరింత పెంచుతూ శ్రీకాంత్ తల్లిదండ్రులు పుల్లూరి రాధా, కృష్ణమూర్తి స్థానికంగా హార్డ్‌వేర్ వ్యాపారాన్ని విస్తరించారు. ఆ వ్యాపారాన్ని ఆకాశమెత్తుకు చేర్చుతూ పారిశ్రామికవేత్తగా పీఎస్కే స్టీల్, పీఎస్కే సిమెంట్‌తోపాటు భవన నిర్మాణాలు, వంతెనలు, రోడ్లు, అపార్టుమెంట్లు, విల్లాల నిర్మాణాలకు అవసరమైన అన్ని వస్తువులను నేరుగా సరఫరా చేసే స్థాయికి చేరారు. నిజానికి ఈ వ్యాపార రంగంలో మార్వాడీ సేట్లు, ఉత్తర భారతానికి చెందిన బడా వ్యాపారులు స్థిరపడి ఉండగా.. వాళ్లకు ధీటుగా నమ్మకంగా.. శ్రీకాంత్ ఆ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్‌లో కంపెనీలో భాగస్వామిగా మారి సొంత బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్లుగా నిర్మాణ రంగంలో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరించారు.వందకు పైగా ఉద్యోగులుపీఎస్కే సంస్థలో వంద మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. నిర్మాణ రంగంలోని ప్రముఖ కంపెనీలకు హోల్‌సేల్‌గా మెటీరియల్ సరఫరా చేస్తూ వ్యాపారం సాగిస్తున్న శ్రీకాంత్ నెలకు రూ.50లక్షల నుంచి రూ.60లక్షల వేతనాలను తన వద్ద పనిచేసే ఉద్యోగులకు పంపిణీ చేస్తున్నారు. ‘అల్ఫా’ సర్కిల్ పేరుతో ప్రముఖులను, ప్రముఖ కంపెనీలను భాగస్వాములను చేస్తూ పరస్పర సహకారంతో వ్యాపారాన్ని విస్తరించేందుకు శ్రీకాంత్ శ్రీకారం చుట్టారు. ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల కలయికతో పీఎస్కే వ్యాపారం విస్తరించింది. ప్రస్తుతం ఏటా రూ.వందల కోట్ల మేరకు టర్నోవర్‌తో పీఎస్కే వ్యాపారం సాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీఎస్కే వ్యాపారాన్ని విస్తరించే లక్ష్యంతో శ్రీకాంత్ ముందుకు సాగుతున్నారు.అంచెలంచెలుగా..శ్రీకాంత్ ఒకేసారి తన వ్యాపారాన్ని పెంచుకోకుండా.. హైదరాబాద్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుని వ్యాపారాన్ని విస్తరించారు. రాష్ట్రవ్యాప్తంగా హోల్‌సేల్ హార్డ్‌వేర్ షాపులకు సిమెంట్, స్టీల్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ వ్యాపారాన్ని బెంగళూర్, వైజాగ్ పట్టణాలకు విస్తరించారు. స్టీల్, సిమెంట్ ఉత్పత్తి రంగాల్లో ఎంతో పేరున్న ప్రముఖ కంపెనీలతో పోటీ పడుతూ నమ్మకంతో ఉన్నత స్థితికి చేరారు. పీఎస్కే సంస్థ వ్యాపార రంగంలో స్థిరపడి ముందుకు సాగడంతో గ్లోబల్ ఐకాన్ అనే సంస్థ 2023లో శ్రీకాంత్‌కు డాక్టరేట్‌ను అందించింది. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న జీ–20 సదస్సులోనూ శ్రీకాంత్ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవితోపాటు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు, కాంట్రాక్టర్లతో ఉన్న సన్నిహిత సంబంధాలతో పీఎస్కే సంస్థ వ్యాపారాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ధార్మిక కార్యక్రమాల్లో, సామాజిక సేవలోనూ ముందున్నారు.లక్ష మందికి ఉపాధి లక్ష్యం2030 నాటికి దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించి లక్ష మందికి ఉపాధి కల్పించడమే నా లక్ష్యం. ఆ దిశగా పట్టుదలగా అడుగులు వేస్తున్నాను. ప్రముఖ కంపెనీల కొలాబ్రేషన్‌తో వ్యాపారాన్ని విస్తరిస్తున్నాను. ‘అల్ఫా సర్కిల్’ను ప్రపంచ వ్యాప్తం చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలగా అనుకున్నది సాధించడమే నా లక్ష్యం. ప్రస్తుతం వ్యాపారంలో ఎంతో బిజీగా ఉన్నాను. మరింత విస్తరించి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తా. – పుల్లూరి శ్రీకాంత్, పీఎస్కే సంస్థ వ్యవస్థాపకుడు -
యూఏఈకి ఉచిత వీసాలు.. అబుదాబి కంపెనీ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్‌లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు అబుదాబిలోని ఏడీఎన్‌హెచ్ కంపెనీ (Abu Dhabi company) తెలంగాణలోని జీటీఎం సంస్థ ద్వారా ఉచితంగా వీసాలను (free visa) జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పలుమార్లు అనేకమందికి ఉచితంగా వీసాలు ఇచ్చిన ఈ సంస్థ..మరోసారి ఉచిత వీసాల జారీ కి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏడీఎన్‌హెచ్ కంపెనీ క్లీనింగ్, క్యాటరింగ్ రంగాల్లో యువతకు ఉపాధి కల్పిస్తోంది. ఈనెల 10న జగిత్యాలలో, 11న నిజామాబాద్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టు కలిగి ఉన్న యువకులకు అర్హత వయస్సు 21 నుంచి 38 ఏళ్ల వరకూ ఉండొచ్చని జీటీఎం సంస్థ చైర్మన్ చీటి సతీష్‌రావు ‘సాక్షి’తో చెప్పారు.బేసిక్ ఇంగ్లిష్ వచ్చి ఉండాలని, పచ్చబొట్టు కనబడకుండా ఉండాలని తెలిపారు. ఒరిజినల్ పాస్పోర్టుతో జగిత్యాల లేదా నిజామాబాద్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. ఎంపికైన వారికి రూ. 23 వేల వరకూ వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్టు వెల్లడించారు. ఎవరికీ నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు జీటీఎం సంస్థ నిజామాబాద్ (8686860999), ఆర్మూర్ (8332062299), జగిత్యాల (8332042299), సిరిసిల్ల (9347661522) నంబర్లలో సంప్రదించాలని సతీష్‌రావు సూచించారు. -
ఎట్టకేలకు సునీల్ అరెస్ట్
సాక్షి, నిజామాబాద్ : వాణిజ్యపన్నులశాఖలో పన్ను ఎగవేత కుంభకోణం కేసులో ఏ–2 నిందితుడు సునీల్‌ను సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన ట్యాక్స్‌కన్సల్టెంట్ శివరాజ్ కుమారుడైన ఈ సునీల్‌ను సోమవారం అర్ధరాత్రి నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు సీఐడీ అధికారులు హైడ్రామా నడిపారు. శివరాజ్‌తో పాటు, సునీల్ కూడా సుమారు మూడు నెలలుగా పరారీలో ఉన్నాడు. శివరాజ్‌ను గతనెల 23న అరెస్టు చూపించిన సీఐడీ అధికారులు, మరో నెల రోజుల అనంతరం సునీల్‌ను అరెస్టు చేయగలిగారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, కొందరు వ్యాపారులు కలిసి రూ.వందల కోట్లలో వ్యాట్, సీఎస్టీ ఎగవేశారు. ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, ఆయన కుమారుడు సునీల్‌లు ఈ కుంభకోణాన్ని నడిపారు. ఈ వ్యవహారంపై బోధన్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఫిబ్రవరి మొదటి వారంలో బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివరాజ్, సునీల్‌లతో పాటు, బోధన్ సీటీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏసీటీఓ విజయ్‌కృష్ణ, మరో ఇద్దరు సిబ్బంది హన్మాన్‌సింగ్, వేణుగోపాల్‌లపై కేసు నమోదైన విషయం విధితమే. ఈ కేసులో మిగిలిన నలుగురు ఇప్పటికే అరెస్టు కాగా, తాజాగా సునీల్ కూడా అరెస్టు అయ్యాడు.


