breaking news
subrahmanya
-
టీడీపీ నేత గోదాం నుంచే గో మాంసం ప్యాకింగ్!
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతకు చెందిన గోదాంలో దాదాపు 200 టన్నుల గో మాంసం పట్టుబడిన సంచలన కేసు నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని చంద్రబాబు సర్కారు మళ్లీ తెరపైకి తెస్తోంది. లడ్డూ నెయ్యి కల్తీ అంటూ అనవసర రాద్ధాంతానికి దిగుతూ... గో మాంసం కేసును నీరుగార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రధాన అనుచరుడు, టీడీపీ కీలక నేత సుబ్రహ్మణ్య గుప్తాకు చెందిన విశాఖ శివారు శొంఠ్యాంలోని శ్రీ మిత్ర మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజీలోనే గోమాంసం దొరకడంతో చంద్రబాబు సర్కారు ఉలిక్కిపడింది. అంతే, ఆ వెంటనే అసలు ఏమీ లేని కల్తీ నెయ్యి కేసును మళ్లీ తెరపైకి తెచ్చింది. ఓవైపు విశాఖ గోదాం నుంచి అరబ్ దేశాలకు ఎగుమతికి సిద్ధం చేసిన 189 టన్నుల గో మాంసం దొరికిన కేసులో విచారణను జాప్యం చేస్తూ... మరోవైపు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు కూడా దర్యాప్తు ఇవ్వకుండా అడ్డుకుంటోంది. వాస్తవానికి నెల నుంచి సాగుతున్న ఈ గో మాంసం సీజ్ కేసులో విస్తుపోయే వాస్తవాలున్నాయి.అసలు ఏం జరిగిందంటే?అక్టోబరు 3న శ్రీ మిత్ర కోల్డ్ స్టోరేజీలో నిషేధిత పశుమాంసం ఉన్నట్లు విజిలెన్స్‌కు సమాచారం అందగా పశు సంవర్థక శాఖకు సమాచారం ఇచ్చి శాంపిల్స్ తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు ఆరు శాంపిల్స్ తీసి అక్టోబరు 5న ఫోరెన్సిక్‌కు పంపారు. గత నెలాఖరునే మెయిల్ ద్వారా రిపోర్టులు ఇచ్చారు. ఆరు శాంపిళ్లలో మూడింట్లో నిషేధిత గో మాంసం ఉన్నట్లుగా వెల్లడైంది. మిగిలిన రెండింట్లో ఎద్దు మాంసం, ఒకదాంట్లో గేదె మాంసం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో నిషేధిత గో మాంసం ఉందని విజిలెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఈ నెల 3న పశు సంవర్థక శాఖ, విజిలెన్స్, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులతో కలిసి విశాఖ ఆనందపురం పోలీసులు సోదాలు చేశారు. అనుమతుల్లేని 189 టన్నుల గో మాంసం ఇక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. దీన్ని 9,921 కంటైనింగ్ బాక్సుల్లో ప్యాక్ చేసి నిల్వ ఉంచారు. ఏ పత్రాలు లేకపోవడంతో కోల్డ్ స్టోరేజ్ మేనేజర్ అబ్దుల్ గఫూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోమాంసాన్ని సీజ్ చేశారు. ఇక ఇక్కడినుంచి చంద్రబాబు ప్రభుత్వం డ్రామాలు మొదలు పెట్టింది.ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని..అక్టోబరు 3వ తేదీన దాడులు జరిగి సీజ్ చేస్తే... 4వ తేదీ సాయంత్రం వరకు సమాచారం బయటకు రాలేదు. ఓవైపు సనాతన ధర్మం అంటూ హడావుడి చేస్తుండగా, రాష్ట్ర చరిత్రలోనే భారీఎత్తున నిషేధిత గోమాంసం పట్టుబడడంతో చెడ్డ పేరు వస్తుందని టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. బయటికి రాకుండా చేయాలని ప్రయత్నించారు. కానీ, స్థానికులు కొందరు శొంఠ్యాంలో గోమాంసం పట్టుబడిందని ప్రచారం చేయడంతో ఒక్కసారిగా గుప్పుమంది. చేసేదిలేక...4వ తేదీన పోలీసులు విషయాలను బహిర్గతం చేసి కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ రిజిస్టర్డ్ కంపెనీ మెష్ ఓవర్సీస్ సంస్థ ఈ పశుమాంసాన్ని తీసుకొచ్చినట్లు గుర్తించి అక్కడి డైరెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 8వ తేదీన పోస్టు ద్వారా ఫోరెన్సిక్ నివేదికలు పశుసంవర్థక శాఖకు చేరగా 10న ఆనందపురం పోలీస్‌స్టేషన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది.గేదె మాంసానికి అనుమతి.. ఎగుమతి గో మాంసం సుబ్రహ్మణ్య గుప్తా గేదె మాంసం అని చెప్పి అనుమతులు పొంది కొంతకాలంగా అనధికారికంగా నిషేదిత గో మాంసం నిల్వ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన గో మాంసం సెప్టెంబర్ 24న ప్యాక్ అయి విశాఖ చేరుకుంది. ఇక్కడి నుంచి యూఏఈకి చెందిన సాదియా ఫుడ్స్ సంస్థతో కలిసి యూఏఈ, ఖతర్, కువైట్, బహ్రయిన్, సౌదీ అరేబియా, ఒమన్, వియత్నాంకు ఎగుమతి చేస్తుంటారు. కొంతకాలంగా ఈ అక్రమ వ్యాపారం జరుగుతోందని విజిలెన్స్ దర్యాప్తులో తేలింది.గో మాంసం కేసును తప్పుదారి పట్టించేందుకు కల్తీ నెయ్యి వ్యవహారంహిందుత్వాన్ని తామే ఉద్ధరిస్తున్నామంటూ... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి గోమాంసం పట్టుబడడం తీవ్ర సంకటంగా మారింది. దీంతో అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. భారీగా గోమాంసం పట్టుకున్నారన్న విషయం తెలిస్తే పరువు పోతుందని.. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం పేరుతో మరోమారు తప్పుడు ఆరోపణలు మొదలు పెట్టారు. మరోవైపు.. గోమాంసం కేసును తప్పుదారి పట్టించేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ విచారణకు బ్రేక్ వేసింది. మరోవైపు.. భారీగా నిషేదిత గోమాంసం.. కంటైనర్ల ద్వారా పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకేనని తెలుసుకున్న డీఆర్ఐ తమకు కేసును అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరగా తమ పోలీసులే విచారణ చేస్తారని వారిని అడ్డుకునేందుకు యత్నిస్తోంది. మరోవైపు.. గోడౌన్ యజమాని అయిన టీడీపీ నేతను తప్పించి.. కేవలం మెష్ ఓవర్సీస్ సంస్థదే తప్పు అన్నట్లుగా చిత్రీకరించి.. కేసుని క్లోజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.నన్నెందుకు అడుగుతారంటున్న సీపీ.!రాష్ట్రంలో ఇంత భారీగా గోమాంసం పట్టుబడి సంచలనం సృష్టించిన కేసు విచారణ ఎంతవరకు వచ్చిందనే విషయంపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీని ‘సాక్షి’ ప్రశ్నించగా.. సీఐని అడగమని బదులిచ్చారు. సీఐ స్పందించడం లేదని చెప్పగా.. ఏసీపీని.. ఆయనా కాదంటే డీసీపీని అడగండి.. నన్నెందుకు అడుగుతారంటూ మాట దాటవేశారు. ఇదంతా చూస్తుంటే కేసు విచారణకు బ్రేక్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఒత్తిడి తెస్తున్నదో అర్థమవుతోంది. ఆనందపురం సీఐ వాసునాయుడిని అడిగితే.. ఇంతకంటే ప్రాధాన్యమున్న కేసులు, ముఖ్యమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి.. వాటిపైనే దృష్టిసారించామని, ఆ తర్వాతే దీనిగురించి అని చెప్పడం గమనార్హం.మైనార్టీలను అడ్డం పెట్టుకుని...విశాఖలోని కోల్డ్ స్టోరేజీని సుబ్రహ్మణ్యగుప్తా ఉరఫ్ చిన్నా ఎనిమిదేళ్లుగా నడుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రొయ్యల ఎగుమతులు చేసే సమయంలో ప్రస్తుత బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రవర్మ భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. క్రమంగా నష్టాలు రావడంతో వర్మ తప్పుకొన్నారు. ఇతర వ్యాపారాలను సుబ్రహ్మణ్యగుప్తా కొనసాగిస్తున్నారు. బాపట్ల ఇస్లాంపేటకు చెందిన మైనార్టీల పేరుతో పశుమాంసం ఎగుమతులకు అనుమతులు పొందారు. తొలుత గల్ఫ్ దేశాలకు ఎద్దు, గేదె మాంసం ఎగుమతి చేసేవారు. నిషేధిత గో మాంసం ఎగుమతితో లాభాలు బాగా వస్తాయని అక్రమంగా ఎగుమతులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గుప్తాకు టీడీపీ నేతల మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, పెట్రోల్ బంకుల్లో భాగస్వామ్యం ఉందని చెబుతున్నారు.సీజ్ ద కోల్డ్ స్టోరేజ్ అని పవన్ ఎందుకు చెప్పలేదు?గోమాంసం అక్రమరవాణా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ నాయకుల అండదండలతోనే నడుస్తోంది. ఎవరి వాటా వాళ్లకు అందుతోంది. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడా లేనివిధంగా.. విశాఖలో స్వయంభూ దేవాలయాలకు దగ్గర్లో దొరికినా స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. ఇదంతా ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. హిందువుల మనోభావాల్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదు. గోమాంసం పట్టుబడడంపై ఇంకా స్పందించడం లేదంటే ఏమనుకోవాలి. పశుసంవర్థక శాఖ మంత్రి, హోం మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదు? సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు.? బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే సీజ్ ద షిప్ అని చెప్పిన ఆయన... సీజ్ ద కోల్డ్ స్టోరేజ్ అని ఎందుకు అనలేదు.? ప్రభుత్వం ఏమీ మాట్లాడనివ్వడం లేదా? – విజయశంకర్ ఫణీంద్ర, బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ -
తిరుమల గోశాల ఘటనపై సుబ్రమణ్య స్వామి సీరియస్
-
సోషియో ఫ్యాంటసీ చిత్రంగా 'జై శ్రీరామ'
నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవిశంకర్ దర్శ కత్వంలో ఆయన తనయుడు అద్వయ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సుబ్రహ్మణ్య’. ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ చిత్రాన్ని ప్రవీణ కడియాల, రామలక్ష్మిల సమర్పణలో తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మిస్తున్నారు.ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. హీరో ఓ బావిలోకి దూకి అక్కడ ఉన్న ఓ పురాతన పుస్తకాన్ని తీసుకురావడం, ఆ పుస్తకానికి కాపలాగా ఉన్నట్లుగా ఉన్నపాములు అతనిపై దాడి చేయడం, ఓ గుడి అతని బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించడం, జై శ్రీరామ అంటూ వాయిస్ ఓవర్ రావడం వంటివి టీజర్లో కనిపిస్తాయి. ఈ చిత్రం 2025లో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
Annapurni Subramaniam: నక్షత్ర విజ్ఞాన సిరి..
అంతరిక్షం అంటేనే అనేకానేక అద్భుతాలకు నెలవు. అన్నపూరణిలో అంతరిక్షంపై ఆసక్తి చిన్న వయసులోనే మొదలైంది. ఆరు బయట రాత్రి పూట ఆకాశంలో చుక్కలు చూస్తున్నప్పుడు ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన తనను కుదురుగా ఉండనివ్వలేదు. నక్షత్రమండలాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేలా చేసింది. నక్షత్రాలపై ఆసక్తి తనను విషయ జ్ఞానానికి మాత్రమే పరిమితం చేయలేదు. సైంటిస్ట్‌ను చేసింది.‘విజ్ఞాన శ్రీ’ అవార్డ్ అందుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్తగా ఉన్నతస్థానంలో నిలిపింది. అన్నపూరణి సుబ్రమణ్యం ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ) డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఈ సంస్థ భవిష్యత్ అంతరిక్ష యాత్రల కోసం అత్యాధునిక టెలిస్కోప్‌లు, పరికరాలను తయారు చేస్తుంటుంది. ఆస్ట్రోశాట్, ఆదిత్య–ఎల్1ల ఇన్స్ట్రుమెంటేషన్లో అన్నపూరణి పాలుపంచుకుంది.కేరళలోని పాలక్కాడ్ విక్టోరియా కాలేజీలో చదువుకున్న అన్నపూరణి ‘స్టడీస్ ఆఫ్ స్టార్ క్లస్టర్స్ అండ్ స్టెల్లార్ ఎవల్యూషన్’ అంశంపై హీహెచ్డీ చేసింది. పీహెచ్డీ చేస్తున్న రోజులలో కవలూర్ అబ్జర్వేటరీ (తమిళనాడు) ఆమె ప్రపంచంగా మారింది. ఏ పరికరాన్ని ఎలా వినియోగించుకోవాలో లోతుగా తెలుసుకుంది. నక్షత్ర సమూహాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేసింది.‘పరిశోధన’కు కామా నే తప్ప ఫుల్స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంటుంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! ప్రస్తుత కాలంలో ‘స్పేస్–బేస్డ్ అస్ట్రోనమీపై యువతరం అమితమైన ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇది శుభసూచకం. స్పేస్ సైన్స్ ఎంతోమందికి అత్యంత ఆసక్తిగా మారింది. ఈ ఆసక్తే భవిష్యత్ పరిశోధనలకు పునాదిగా మారుతుంది’ అంటుంది అన్నపూరణి సుబ్రమణ్యమ్.‘పరిశోధన’కు కామానే తప్ప ఫుల్స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! -
శివకామ సుందరీదేవిగా అమ్మవారు
మర్కూక్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలో సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజు అత్యంత వైభవంగా కొనసాగింది. యాగంలో భాగంగా గురువారం రాజశ్యామల యంత్రపూజ కార్యక్రమాన్ని రుత్వికులు ఘనంగా నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములతో పాటు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌రావు, ఎమ్మెల్సీ కవిత యాగ క్రతువును పర్యవేక్షించారు. యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ యాగంలో మూడు లక్షలకు మించి రాజశ్యామల మూల మంత్రాలను హవనం చేశారు. అలాగే 11సార్లు శాలిని దుర్గ కవచ పారాయణం నిర్వహించారు. సర్వలోక సంరక్షణార్థం ఇంద్రసుక్త హోమం, నవగ్రహ సుక్త హోమం నిర్వహించారు. షాడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం నిర్వహించారు. -
చలించని భక్తికి ప్రతీక.. శూలాల వేడుక..
-నగరంలో సుబ్రహ్మణ్యస్వామి తిరువీధి ఉత్సవం -వంటిపై శూలాలు గుచ్చుకుని మొక్కు తీర్చుకున్న భక్తులు రాజమహేంద్రవరం కల్చరల్ : వంటికి పూచికపుల్ల తాకితేనే విలవిలలాడతారు కొందరు. అలాంటిది వారు శూలాలనే దేహంలోని వివిధ భాగాల్లో అవలీలగా గుచ్చుకున్నారు. ఆ శూలాలతోనే తిరువీధి ఉత్సవంలో అలవోకగా పాల్గొన్నారు. లాలాచెరువు బర్మాకాలనీలో వేంచేసి ఉన్న శ్రీసుబ్రహ్మణ్యస్వామి తిరువీధి ఉత్సవం నిబద్ధతతో భక్తులు సంతరించుకునే శక్తికి నిదర్శనంగా నిలిచింది. ఈనెల 3న ఆలయంలో ప్రారంభమైన స్వామివారి ఉత్తర ఫల్గునీ పౌర్ణమి మహోత్సవాల్లో భాగంగా ఈ వేడుక జరిగింది. ఆదివారం ఉదయం పుష్కరాలరేవులో కలశస్థాపన అనంతరం విశాఖ నుంచి వచ్చిన గురుస్వాముల పర్యవేక్షణలో మొక్కు ఉన్న భక్తులు శూలాలు గుచ్చుకుని తిరువీధి ఉత్సవంలో పాల్గొన్నారు. వారికి ఇతర భక్తులు పాదాభివందనం చేశారు. వందలాది భక్తుల శరవణఘోషతో ఉత్సవం పుష్కరాలరేవు, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, హోటల్ షెల్టాన్, శీలం నూకరాజు రోడ్డు, ఏవీ అప్పారావు రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ప్రత్యేకరథం అనుసరించింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, కార్యదర్శి సీహెచ్ మురళీకృష్ణ, కోశాధికారి నరసింహారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
పురాణగాథల సమన్వయహారం ‘శ్రీసుబ్రహ్మణ్య స్వామి చరిత్ర’
– ఘనంగా గ్రంథ సమీక్షా సమావేశం – పాల్గొన్న సాహితీ దిగ్గజాలు రాజమహేంద్రవరం కల్చరల్ : ‘‘కుమారస్వామి జననం గురించి వివిధ పురాËణాలు, కావ్యాలలో స్వల్ప వైరుద్ధ్యాలు ఉన్నాయి. ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి ‘ శ్రీ సుబ్రహ్మణ్య చరిత్ర’ గ్రంథంలో ఈ వైరుద్ధ్యాలకు చక్కని సమన్వయం సాధించారు. అన్ని విధాలా మణి ‘సమన్వయచక్రవర్తి బిరుదానికి అర్హుడు.’’ అని రామాయణ రత్నాకర డాక్టర్ కేసాప్రగడ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం శ్యామలానగర్ రామాలయం సెంటర్లో వక్కలంక శ్రీరామచంద్రమూర్తి గృహంలో శ్రీగాయత్రీ సత్సంగం ఆధ్వర్యంలో జరిగిన గ్రంథ సమీక్షా సమావేశంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. కొన్ని వేదమంత్రాలను స్వరయుక్తంగా చదవడానికి దంతాలు అడ్డువస్తాయని అందుకనే సుబ్రహ్మణ్యస్వామి నాగేంద్రుడిగా అవతరించి వేదమంత్ర స్వరాన్ని కాపాడారని అన్నారు. గ్రంథంలో అనేక ఉపయుక్తమైన మంత్రాలను, శ్లోకాలను రచయిత పొందుపరిచారని, ఇందులో పేర్కొన్న షష్టీస్తోత్రం చదివితే, శిశువులకు బాలారిష్టాలు తొలగిపోతాయని ఆయన అన్నారు. సభకు అధ్యక్షత వహించిన భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు మాట్లాడుతూ ‘షణ్మత’ (6) స్థాపకుడైన ఆదిశంకరులు‘ పంచాయతన’(5) పూజలను ఎలా ప్రవేశపెట్టారని మనకు ఒక సందేహం రావచ్చు, పూజ సమయంలో వెలిగించే దీపమే సుబ్రహ్మణ్య స్వామి అని ఆయన వివరించారు. గణపతి, కుమారస్వాములు పుత్ర తత్త్వాన్ని తెలియజేస్తే, శివపార్వతులు మాతాపితరుల తత్త్వాన్ని లోకానికి తెలియజేస్తున్నారని అన్నారు. కుమారస్వామిని ఆరాధిస్తే, శివపార్వతులను, లక్ష్మీనారాయణులను ఆరాధించిన ఫలితం లభిస్తుందన్నారు. పాత్రికేయుడు వీఎస్ఎస్ కృష్ణకుమార్ స్వాగత వచనాలు పలికారు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత చింతలపాటి శర్మ, అవధాన అష్టాపద తాతా సందీప్, శతావధాన విశారద ఫుల్లాభట్ల నాగశాంతిస్వరూపలు గ్రంథకర్తను అభినందించారు. డాక్టర్ బీవీఎస్ మూర్తి, ఎర్రాప్రగడ రామకృష్ణ, పెమ్మరాజు గోపాలకృష్ణ, ఓరుగంటి గురుప్రసాద శర్మ, పలువురు సాహితీవేత్తలు హాజరయ్యారు. -
మల్లవరం.. సుబ్రహ్మణ్యేశ్వరుడి నిలయం
చాగంటి కోటేశ్వరరావు గొల్లప్రోలు : ఆలవెల్లి మల్లవరం ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వరుడి నిలయమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మల్లవరంలోని ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన మంగళవారం దర్శించారు. ఆలయ కమిటీ పెద్దలు, పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ముఖద్వారం, కడిమిశెట్టి అప్పారావు, అన్నపూర్ణ దంపతులు జ్ఞాపకార్థం కడిమిశెట్టి కుమారభాస్కరెడ్డి కుటుంబ సభ్యులు నిర్మించిన యాత్రికుల వసతిగృహాన్ని ఆయన ప్రారంభించారు. ఉత్సవానికి తయారు చేసిన తెప్ప, నెమలి వాహనాన్ని పరిశీలించారు. ఆలయంలో హోమశాల నిర్మాణానికి రూ.10,116 విరాళం అందజేశారు. అనంతరం ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. మల్లవరంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడు విభూధితో నిత్యం ప్రకాశిస్తున్నాడన్నారు. ఇక్కడ స్వామివారికి విశేష శక్తి ఉందన్నారు. స్వామివారిని పూజిస్తే సంతానం కలుగుతుందన్నారు. ప్రతిఏటా ఇక్కడ షష్ఠి ఉత్సవాలకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.


