మలేషియాలో మరో విమాన ప్రమాదం
ఎం హెచ్ 370 విమాన దుర్ఘటన కన్నీటి తడి ఆరకముందే మలేషియాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు.
మలేషియాలోని సుబాంగ్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక చిన్న విమానంలోని రెండు ఇంజన్లలో ఒకదానిలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో ఆ మాలిండో ఎయిర్ జెట్ విమానం పైలట్ సమయస్ఫూర్తితో మంటలు వస్తున్న ఇంజన్ ను వెంటనే ఆపివేశాడు. తరువాత విమానాన్ని తిరిగి ఎయిర్ పోర్టుకి క్షేమంగా తీసుకువచ్చాడు. ఈ విమానంలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారన్నది ఇంకా తెలియరాలేదు.