breaking news
stray dog menace
-
అడ్డుకుంటే ఊరుకునేది లేదు.. జంతు ప్రేమికులకు సుప్రీం కోర్టు తీవ్ర హెచ్చరికలు
దేశంలో కుక్క కాటు ఘటనలు, రేబిస్ మరణాలు పెరిగిపోతున్న వేళ.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనావాస ప్రాంతాల్లో వీధి కుక్కలు సంచరించడం ఎంతమాత్రం సురక్షితం కాదని అభిప్రాయపడింది. దేశ రాజధాని రీజియన్ నుంచి వీధి శునకాలను షెల్టర్లకు తరలించాలని ఆదేశిస్తూ.. ఈ క్రమంలో జంతు ప్రేమిక సంఘాలను తీవ్రంగా హెచ్చరించింది కూడా. రాజధాని రీజియన్‌లో పసికందులు, వృద్దులుపై వీధి కుక్కల దాడుల ఘటనలపై పలు మీడియా సంస్థలు ఇచ్చాయి. అందులో ఘటనలతో పాటు రేబిస్ బారిన పడి మరణించిన దాఖలాలను ప్రస్తావించాయి. ఈ కథనాల ఆధారంగా.. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. వీధి కుక్కలను నివాస ప్రాంతాల్లో సంచరించడం ఏమాత్రం యోగ్యం కాదని, వాటిని పట్టుకుని షెల్టర్లకు తరలించాలని, ఇందుకు 8 వారాల గడువు విధిస్తూ అధికార యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. ఏదైనా సంస్థలు ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో కేవలం కేంద్రం తరఫున వాదనలు మాత్రమే తాము వినదల్చుకుంటున్నామని, శునక ప్రియులు.. జంతు ప్రేమిక సంఘాల నుంచి పిటిషన్లను స్వీకరించబోమని స్పష్టం చేసింది. వీధికుక్కలను వీలైనంత త్వరగా పట్టుకుని సుదూర ప్రాంతాల్లో వదిలేయండి అని ఈ కేసులో అమీకస్ క్యూరీ అయిన గౌరవ్ అగర్వాలకు కోర్టు సూచించింది. ఈ క్రమంలో చర్యలను జంతు సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.కుక్క కాటుకు గురైన వాళ్ల కోసం, రేబిస్ బారిన మరణిస్తున్నవాళ్ల కోసం ఈ జంతు సంఘాలు ఏమైనా చేస్తున్నాయా? చనిపోయిన వాళ్లను బతికించి తెస్తున్నాయా?. ఇదేం మా కోసం చేస్తున్నది కాదు. ప్రజల కోసం చేస్తున్నది. కాబట్టి ఇందులో ఎలాంటి సెంటిమెంట్‌కు చోటు ఉండబోదు. ఈ ఆదేశాలను ప్రతిఘటించాలని చూస్తే సత్వర చర్యలు ఉంటాయి జాగ్రత్త’’ అని జస్టిస్ పార్దీవాలా వ్యాఖ్యానించారు. అదే సమయంలో వాటిని దత్తత తీసుకునే ప్రయత్నాలను అంగీకరించబోమని తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్‌లోని ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ పరిధిలోని అధికార యంత్రాగాలకు దూరంగా డాగ్ షెల్టర్లను నిర్మించాలని, వీధి కుక్కలను వెంటనే అక్కడికి తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
కుక్క కాటు.. ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం!
చండీగఢ్: కుక్క కాటు కేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టులు సంచలన తీర్పు వెలువరించింది. కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని ధర్మాసనం తెలిపింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు రూ.10,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. కుక్క కాటు ఘటనల్లో 0.2 సెంటీమీటర్ల కోత పడితే రూ.20,000 బాధితునికి చెల్లించాలని ఆదేశించింది. కుక్క కాటు కేసులో దాఖలైన 193 కేసుల్లో న్యాయస్థానం విచారణ చేపట్టింది. వీధికుక్కల బెడదపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ అక్టోబర్‌లో వీది కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ని వెంబడించగా పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆ కారణంగా దేశాయ్ మరణించారని సంబంధిత ఆసుపత్రి ఇటీవల ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటన అనంతరం సోషల్ మీడియాలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున చర్చ సాగింది. పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో నమోదైన కుక్క కాటు కేసులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరింది. జంతువుల దాడి కేసుల్లో చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే.. వీది కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, అడవి, పెంపుడు జంతువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: Liquor Sale In Delhi: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
ఎంత ఘోరం? పసికందు పేగులు తీసిన వీధి కుక్క
నోయిడా: తల్లిదండ్రులు భవన నిర్మాణంలో కూలీ పనులు చేసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారి ఏడు నెలల పసికందుపై ఓ వీధి కుక్క దాడి చేసింది. పేగులు బయటకు తీయటంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లోటస్ బౌలేవార్డ్ సెక్టార్ 100లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి శునకాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్ సొసైటీలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూలీ పని చేసుకునే ఓ కుటుంబం తమ 7 నెలల పాపతో అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వీధి కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన శిశువును నోయిడాలోని యదార్థ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. పసికందు పేగులు బయటకు రావటం వల్ల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయనా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వీధి కుక్కలు దాడి చేయటం ఇదేం మొదటి సారి కాదని, ప్రతి 3-4 నెలలకోసారి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. నోయిడా అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. నోయిడా హౌసింగ్ సొసైటీ ముందు స్థానికుల ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఈ విషయంపై ఏఓఏ స్పందించారు. నోయిడా అథారిటీతో మాట్లాడామని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇదీ చదవండి: చీకటి గదిలో బంధించి, బలవంతంగా పెళ్లి -
మీ రాష్ట్రంలోనే అన్ని కుక్కలు ఎందుకున్నాయి: సుప్రీం
దేవుడి సొంత భూమిగా పేరున్న కేరళలో కుక్కల బెడద ఎందుకంత ఎక్కువగా ఉందని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. నిజంగానే ఆ రాష్ట్రంలో సమస్య చాలా తీవ్రంగా ఉందని, వెంటనే వాటిని నియంత్రించకపోతే ప్రజాభద్రతకు చాలా తీవ్రమైన ముప్పు పొంచి ఉంటుందని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదించింది. తాను చాలా రాష్ట్రాలకు వెళ్లానని, ఒడిషాలో గానీ, అసోంలో గానీ అసలు వీధికుక్కల బెడద చాలా తక్కువగా ఉంటుందని.. కేరళలోనే ఇది ఎందుకంత తీవ్రంగా ఉందో మనం తెలుసుకోవాల్సి ఉందని జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. నిజంగా సమస్య అంత తీవ్రంగానే ఉంటే.. కుక్కల బాధితులకు పరిహారం కూడా చెల్లించాలని జస్టిస్ అమితవ్ రాయ్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. గుజరాత్లో కూడా ఈ సమస్య ఇంతే తీవ్రంగా ఉందని ఈ కేసులో కోర్టుకు అమికస్ క్యూరీగా సహకరిస్తున్న సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే చెప్పారు. కుక్కకాటు బాధితులందరికీ పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని, అది మొదలుపెడితే చాలామంది వస్తారని కేరళ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది వి.గిరి అన్నారు. ఢిల్లీలో ప్రతి ఆరు నిమిషాలకు ఒక కుక్కకాటు ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైందని మరో న్యాయవాది వీకే బిజు తెలిపారు. తన భార్య వీధికుక్క కాటు వల్ల చనిపోయిందంటూ పిటిషన్ దాఖలుచేసిన జోస్ సెబాస్టియన్ తరఫున ఆయన వాదిస్తున్నారు. కేరళలో మహిళలు, పిల్లలపై వీధికుక్కల కాట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వీధికుక్కలకు కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టడం, రేబిస్ నియంత్రణ లాంటి చర్యలు చేపడితే కొంత ప్రయోజనం ఉంటుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో చెప్పాల్సిందిగా కోర్టులు కూడా అడిగాయని భారత జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యుబీఐ) తరఫున వాదించిన న్యాయవాది అంజలీశర్మ చెప్పారు.