నేటి నుంచి జాతీయ క్రీడలు
ప్రారంభోత్సవానికి సచిన్ టెండూల్కర్
స్టార్ క్రీడాకారులు దూరం
తిరువనంతపురం: అనేకసార్లు వాయిదాలు పడుతూ వచ్చిన 35వ జాతీయ క్రీడలు ఎట్టకేలకు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. చివరిసారిగా 2011లో జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ క్రీడలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం ఈ క్రీడలు మూడేళ్ల క్రితమే జరగాలి. అయితే బుధవారం వరకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరగకపోవడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు క్రీడల ఆరంభ సమయానికి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాదని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రీడా చరిత్రలో తొలిసారిగా కేరళలోని ఏడు వేదికల్లో ఆయా పోటీలు జరుగనున్నాయి. గతంలో ఒకే వేదికలో పోటీలు జరిగేవి. స్థానిక గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో నేటి సాయంత్రం 35వ జాతీయ క్రీడల ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఆదివారం నుంచి వచ్చే నెల 14 వరకు పోటీలు జరుగుతాయి. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ‘బాక్సింగ్ ఇండియా’ తమ ఆటగాళ్లను ఈ గేమ్స్‌లో బరిలోకి దించడం లేదు. అథ్లెట్లు, అధికారులు కలిసి మొత్తం 10 వేల మంది క్రీడలకు హాజరుకానున్నారు.
► {Mీడల గుడ్‌విల్ అంబాసిడర్ హోదాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు.
► కొత్తగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో 40 వేల మంది ప్రేక్షకులు క్రీడలను తిలకించే అవకాశం ఉంది. 5 వేల మంది కళాకారులు ఆరంభ వేడుకల్లో పాల్గొంటున్నారు. దిగ్గజ అథ్లెట్స్ పీటీ ఉష, అంజూ బాబీ జార్జి క్రీడా జ్వోతిని వెలిగిస్తారు.
► సైనా నెహ్వాల్, గాయంతో బాక్సర్ విజేందర్ సింగ్, రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్‌లు ఈ గేమ్స్‌కు దూరమవుతున్నారు.
► తెలంగాణ తరఫున షూటర్ గగన్ నారంగ్, సర్వీసెస్ తరఫున విజయ్ కుమార్ పాల్గొననున్నారు.
► రాంచీ క్రీడల్లో 1,479 పతకాలు అందించగా ఈసారి మాత్రం వాటిని 1,369కి తగ్గించారు.
► ఈసారి పోటీల్లో బీచ్ హ్యాండ్‌బాల్, యాటింగ్ విభాగాలు లేవు.
► ఈక్వెస్ట్రియన్, సెపక్తక్రా, కరాటేలకు కొత్తగా చోటు కల్పించారు.
► {పత్యేక అతిథిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తదితరులు హాజరుకానున్నారు.
► ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 181, తెలంగాణ నుంచి 186 మంది సభ్యుల బృందాలు బరిలోకి దిగుతున్నాయి.