breaking news
sri vari Laddus
-
వాస్తవాలను దాచిపెట్టి బాబు రాజకీయం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు వాస్తవాలను దాచిపెట్టి భక్తుల విశ్వాసాలతో రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ చంద్రబాబు దు్రష్పచార కుట్రలకు పాల్పడటాన్ని తప్పుబట్టారు. ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు లేదని సీబీఐ దాఖలు చేసిన చార్జిషిట్‌లో తేలడంతో ఆత్మరక్షణలో పడ్డ సీఎం, టీడీపీ–జనసేన నేతలు హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పుల్లయ్యతో కలిసి భూమన సోమవారం మీడియాతో మాట్లాడారు. దు్రష్పచారాన్ని నమ్మకపోవడంతో దాడులు.. యానిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం లేదని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో ఉందని చార్జిషీట్లో సీబీఐ చాలా స్పష్టంగా పేర్కొంది. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిపై కూడా ఎన్డీఆర్ఐ తన నివేదికలో జంతుకొవ్వు లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. 2024 జూలైలో నాటి ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీడీబీ నివేదికలో వెజిటబుల్ ఆయిల్ కలిపారని నివేదిక వచ్చిం దన్నారు.అనంతరం సెప్టెంబర్ 23న.. ఎన్డీఆర్ఐ రిపోర్టులో జంతు కొవ్వు కలిసిందని వచ్చిందంటూ చంద్రబాబు ఒత్తిడితో ఈవో మాట మార్చారు. ప్రజలు తమ దు్రష్పచారాన్ని నమ్మకపోవడంతో నెయ్యిలో కల్తీ దొంగలు అంటూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలతో దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ముఠా 3 వేల మంది రౌడీ మూకలతో అంబటి ఇంటిపై దాడికి దిగి హత్యాయత్నానికి పాల్పడింది. అసాంఘిక శక్తులను ఉసిగొల్పి పెట్రోలు బాంబులు విసిరి జోగి రమేశ్ నివాసానికి నిప్పంటించారు. రాష్ట్రమంతటా ఇదే విధ్వంసకర రాజకీయాలకు సన్నద్ధం అవుతున్నారు. బాబు హయాంలోనే భోలేబాబాకు అనుమతి.. నెయ్యిలో జంతుకొవ్వు కల్తీ జరగలేదని సీబీఐ నివేదికలో తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో అప్పటి పాలకమండలి అధ్యక్షుడు, సభ్యులు, ఉన్నతాధికారుల ప్రమేయం లేదని పేర్కొంది. టీడీపీ హయాం నుంచి ఉన్న కొద్ది మంది సాంకేతిక నిపుణులు నెయ్యి సరఫరాదారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని అదే నివేదికలో స్పష్టం చేసింది. భోలేబాబా డెయిరీ 2018 వరకు హర్‡్ష ఫ్రెష్ పేరుతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కంపెనీకి నెయ్యి సరఫరా టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు. కేజీ నెయ్యి రూ.291 చొప్పున సరఫరాకు అనుమతించారు. ఇక ప్రీమియర్ డెయిరీకి కూడా చంద్రబాబు హయాంలోనే అత్యధిక పర్యాయాలు నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భోలేబాబాను డిస్ క్వాలిఫై చేశాం. నాణ్యమైన నెయ్యిని సరఫరా చేసేలా కఠినమైన నిబంధనలు అనుసరించాం.టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా..సాహి, గిర్ లాంటి ఉత్తమ ఆవులను దాతల విరాళాల ద్వారా టీటీడీకి సమకూర్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. ఆవుల ఉత్పత్తి కేంద్రంలో పెయ్య దూడలు జని్మంచేలా, టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎన్డీడీబీ సహకారంతో అప్పటివరకు అందుబాటులో లేని బీటా సైట్స్ టెరాలసిస్ టెస్ట్ మిషనరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి టెండర్లు పిలిచాం.కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు వెనక్కి పంపినవి.. యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు చెబుతున్న నాలుగు ట్యాంకర్ల నెయ్యిని కూటమి ప్రభుత్వంలోనే వాడారు. అంటే మీరు చెబుతున్నట్లుగా.. మీ ప్రభుత్వ హయాంలోనే పందికొవ్వు నెయ్యితో తయారు చేసిన లడ్డూలు తయారు చేశారా? ఆ నాలుగు ట్యాంకర్లలో కలిసింది పందికొవ్వు కాదని సీబీఐ తేల్చి చెప్పినా.. చంద్రబాబు మాత్రం పదే పదే జంతు కొవ్వులు కలిశాయని ఆరోపణలు చేస్తున్నారు. మీ అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని హింసను ప్రేరేపించడం ఎంతవరకు సమంజసం? మీకంటే దైవ ద్రోహి ఇంకెవరు చంద్రబాబూ?. -
నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ వివాదం మీద దాఖలైన పటిషన్లపై సోమవారం సుప్రింకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారించనుంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యరి్థంచారు.ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని పిటిషన్లో విన్నవించారు.నిరాధారమైన తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించారు. ఎస్వోపీ ప్రకారం పరీక్షల్లో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నెయ్యిని మాత్రమే తిరుమల ప్రసాదానికి వినియోగించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఏదో ఒక చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు అభ్యరి్థంచారు. -
మరింత నాణ్యతతో శ్రీవారి లడ్డూ
శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో నాణ్యత మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఎం.జి.గోపాల్ గురువారం తిరుమలలో వెల్లడించారు. లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి నాణ్యతను మరింత పెంచుతామన్నారు. బాలాజీ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీ టెండర్ విధానంలో దశలవారిగా పారదర్శకతను అమలు చేస్తామన్నారు. అందుకోసం ఆ విధానంలో మార్పులు చేర్పులు చేపట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు ఎం.జి.గోపాల్ వివరించారు.


