breaking news
Sri Lanka vs Oman
-
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ షనక చరిత్ర సృష్టించాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో ధనాధన్ దంచికొట్టి.. గతంలో తన పేరిట ఉన్న రికార్డు తానే బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక- ఒమన్ గురువారం నాటి మ్యాచ్‌లో ముఖాముఖి ఎదురుపడ్డాయి.కుశాల్ మెండిస్ అర్ధ శతకంపల్లెకెలె వేదికగా టాస్ గెలిచిన ఒమన్.. ఆతిథ్య శ్రీలంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో లంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక (13), కమిల్ మిశారా (8) నిరాశపరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ అర్ధ శతకంతో అలరించాడు.మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న కుశాల్.. ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ పవన్ రత్ననాయకె ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్ బాది 60 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ దసున్ శనక సుడిగాలి ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు.కేవలం 19 బంతుల్లోనే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షనక.. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా శ్రీలంక తరఫున పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గతంలో పుణె వేదికగా 2023లో టీమిండియాతో మ్యాచ్‌లో షనక 20 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.WHERE’S THE BALL?! 🚀Back-to-back sixes as the Sri Lankan skipper marches towards his fifty, leading from the front and steering SL towards a massive total 👏🔥ICC Men’s #T20WorldCup | #SLvOMA | LIVE NOW 👉 https://t.co/JscJZV8hFa pic.twitter.com/oH7vFDDqqJ— Star Sports (@StarSportsIndia) February 12, 2026ఇక ఒమన్‌తో తాజా మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న దసున్ షనక రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో 50 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో కమిందు మెండిస్ ఏడు బంతుల్లో 19, దునిత్ వెల్లలగే నాలుగు బంతుల్లో 6 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. ఈ ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఒమన్ బౌలర్లలో జితేన్ రామనంది రెండు, జే ఒడేరా, సూఫ్యాన్ మెహమూద్ తలా ఒక వికెట్ పడగొట్టారు.శ్రీలంక తరఫున టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీలు సాధించిన ఆటగాళ్లు వీరే🏏దసున్ షనక- 2026 వరల్డ్‌కప్‌లో ఒమన్ మీద 19 బంతుల్లో🏏దసున్ షనక- 2023లో టీమిండియా మీద 20 బంతుల్లో🏏మహేళ జయవర్దనే- 2007 వరల్డ్‌కప్‌లో కెన్యా మీద 21 బంతుల్లో🏏కుమార్ సంగక్కర- 2009లో టీమిండియా మీద 21 బంతుల్లో.చదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ! -
T20 WC: శ్రీలంకకు షాకిచ్చిన పసికూన!
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహక మ్యాచ్‌లో ఒమన్ శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి లంక-'ఎ' జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభంకానున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో సోమవారం నుంచి వార్మప్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీలంక-'ఎ' జట్టు మంగళవారం ఒమన్‌తో తలపడింది. కొలంబో వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 145 పరుగులకే పరిమితంఅయితే, ఒమన్ బౌలర్ల ధాటికి తాళలేక 145 పరుగులకే పరిమితమైంది. టాపార్డర్‌లో ఓపెనర్ సినెత్ జయవర్దన (9), వన్‌డౌన్ బ్యాటర్ పులిందు పెరిరా (9) విఫలం కాగా.. మరో ఓపెనర్ దుల్నిత్ సిగెర (20) ఫర్వాలేదనిపించాడు.మిగిలిన వారిలో గుణశేఖర (21), వనుజ సహాన్ (29) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి శ్రీలంక 145 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లో షా ఫైజల్, షకీల్ అహ్మద్, జే ఒడెరా రెండేసి వికెట్లు పడగొట్టగా.. నదీం ఖాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆమీర్ కలీమ్ ధనాధన్ అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులు సాధించింది. ఓపెనర్, 44 ఏళ్ల వెటరన్ ప్లేయర్ ఆమీర్ కలీమ్ (47 బంతుల్లో 80) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ వినాయక్ శుక్లా (24 బంతుల్లో 39 నాటౌట్) రాణించాడు. మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. లంక బౌలర్లలో వనుజ సహాన్ మూడు వికెట్లు కూల్చగా.. కెప్టెన్ లాహిరు సమరకూన్, కవిజ గమేజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: T20 WC 2026: ఆందోళనలో టీమిండియా!


