breaking news
Smart Ration Card
-
ఇక ‘స్మార్ట్’గా రేషన్ కార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్దిదారుల గుర్తింపును మరింత పటిష్టం చేయడంతోపాటు నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేసేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డు (స్మార్ట్ రేషన్‌కార్డు)లో పలు భద్రతా ఫీచర్లను పొందుపరిచింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్డులో కనిపించే భద్రతా అంశాలతోపాటు సాధారణంగా గుర్తించలేని రహస్య భద్రతా గుర్తులు, స్పర్శ ద్వారా గుర్తించే సాంకేతికత, డిజిటల్ ధ్రువీకరణ వంటి పద్ధతులను కార్డులో వినియోగించారు. కార్డుపై తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన హోలోగ్రామ్‌ను ముద్రించారు. అలాగే జారీ చేసే అధికారి అయిన పౌరసరఫరాల కమిషనర్ అధికారిక సంతకాన్ని కూడా కార్డులో పొందుపరిచారు. దీంతో కార్డు ప్రామాణికతను నిర్ధారించడం, నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్దిదారుల గుర్తింపును బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. చేతితో తడిమితే తెలిసే అక్షరాలు ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’అనే పదాలను ఉబ్బెత్తుగా ముద్రించారు. చేతితో తడిమినప్పుడు ఈ అక్షరాలు స్పష్టంగా తెలుస్తాయి. అలాగే కార్డులో మైక్రో ప్రింటెడ్ టెక్సŠట్ను కూడా ఉపయోగించారు. అతి చిన్న పరిమాణంలో ఉండే ఈ అక్షరాలు సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించవు. పెద్దదిగా పరిశీలించినప్పుడు మాత్రమే చదవగలిగేలా ఉంటాయి. సాధారణ ప్రింటర్లతో నకిలీ చేయడం కష్టంగా ఉండటంతో ఇది యాంటీ–కాపీ భద్రతా అంశంగా పనిచేస్తుంది.‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’, ‘ఒరిజినల్’వంటి అక్షరాలతో ద్వంద్వ రహస్య చిత్రాలను పొందుపరిచారు. నిర్దిష్ట కోణంలో చూసినప్పుడు లేదా పెద్దదిగా పరిశీలించినప్పుడు మాత్రమే ఇవి కనిపిస్తాయి. కార్డు అసలైనదో కాదో నిర్ధారించేందుకు నిపుణులకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో వాటర్‌మార్క్‌ను కార్డులో పొందుపరిచారు. కార్డును వెలుతురుకు ఎదురుగా ఉంచినప్పుడు ఈ గుర్తు కనిపిస్తుంది. ప్రభుత్వ పత్రాల్లో సాధారణంగా ఉపయోగించే బలమైన ధ్రువీకరణ భద్రతా విధానాల్లో ఇది ఒకటి. అలాగే సాధారణ వెలుతురులో కనిపించని తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని అతినీలలోహిత (యూవీ) కాంతిలో కనిపించేలా ప్రత్యేక సిరాతో ముద్రించారు. యూవీ కాంతి కింద ఈ గుర్తు వెలుగుతుంది. దీంతో రహస్యంగా కార్డును తనిఖీ చేయడంతోపాటు యంత్రాల ద్వారా కూడా వేగంగా ధ్రువీకరించవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ కార్డులో లబ్దిదారుల వివరాలను భద్రంగా ధ్రువీకరించేలా ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. అదీకృత సాఫ్ట్వేర్ లేదా స్కానింగ్ వ్యవస్థల ద్వారా మాత్రమే ఇందులోని సమాచారాన్ని ధ్రువీకరించేలా రూపొందించారు. కార్డుకు సంబంధించిన సీరియల్ నంబర్ తదితర డిజిటల్ సమాచారాన్ని ఇందులో భద్రపరచవచ్చు. అ«దీకృత వ్యవస్థ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు మాత్రమే వివరాలను ధ్రువీకరించే అవకాశం ఉంటుంది. -
పంద్రాగస్టున స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార భద్రతకార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఏకకాలంలో కొత్తగా రూపొందించిన స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్టు మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన 1.05 కోట్ల లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) స్మార్ట్ రేషన్‌కార్డులను ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీఓ) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. లబ్ధిదారుల జాబితాల ఖరారు, రేషన్‌కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాటు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, ప్రచారం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం 15న సంగారెడ్డిలో స్ట్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ విషయాన్ని‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేవైసీ పూర్తి చేసిన కుటుంబాలకు మాత్రమే స్మార్ట్ రేషన్‌కార్డు వచ్చే అవకాశం ఉందని, ఇంటి ఇల్లాలు పేరిట, ఆమె ఫొటోతోనే స్మార్ట్ రేషన్‌కార్డు ఉంటుందని పౌరసరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. కేవైసీ ఆధారంగా ఆధార్‌కార్డుపై ఉన్న ఫొటోను స్మార్ట్ రేషన్‌కార్డుకు బదిలీ చేస్తారు. -
Delhi: రేషన్ కార్డులో కీలక మార్పులు!
భారతదేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలోనే బియ్యం, గోధుమలు వంటి నిత్యావసర ఆహార ధాన్యాలను అందించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులో ఉంది. అయితే.. ఈ వ్యవస్థలో కొన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో నకిలీ రేషన్ కార్డులు, ధాన్యం అక్రమ మళ్లింపు వంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు.. ప్రజలకు మరింత పారదర్శకమైన సేవలు అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం స్మార్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (Smart-PDS)ను అమలు చేయడానికి సిద్ధమవుతోంది.స్మార్ట్ పీడీఎస్ గురించిస్మార్ట్ పీడీఎస్ అనేది రేషన్ కార్డు సేవలు, ఆహార ధాన్యాల పంపిణీని పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించే కొత్త వ్యవస్థ. ఈ విధానంలో లబ్ధిదారులు తమ రేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలను స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. రేషన్ ఎప్పుడు విడుదలైంది, ఏ ఫెయిర్ ప్రైస్ షాప్‌కు చేరింది, ఎప్పుడు పంపిణీ చేస్తారు? వంటి సమాచారం కూడా సులభంగా అందుబాటులో ఉంటుంది.ఇప్పటి వరకు చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ స్మార్ట్ పీడీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం లేదా తొలగించడం, అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం వంటి సేవలన్నీ ఆన్లైన్లోనే పూర్తవుతాయి. దీంతో ప్రజల సమయం ఆదా కావడంతో పాటు.. కార్యాలయాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డులుప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులుగా మార్చనున్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు రేషన్ కార్డు నిజమైనదో.. కాదో? వెంటనే తెలుసుకోగలుగుతారు. దీనివల్ల నకిలీ రేషన్ కార్డులు, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉండటం వంటి అక్రమాలను సులభంగా గుర్తించి అరికట్టవచ్చు.ఫేషియల్ రికగ్నిషన్ఇప్పటి వరకు రేషన్ పంపిణీలో.. ప్రధానంగా వేలిముద్రల ఆధారంగా గుర్తింపు చేసేవారు. అయితే కొంతమంది వృద్ధులు, కూలీలు లేదా వేలిముద్రలు స్పష్టంగా లేని వ్యక్తులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. దీంతో వేలిముద్ర పనిచేయకపోయినా.. ముఖాన్ని స్కాన్ చేసి లబ్ధిదారుని గుర్తించి రేషన్ అందించవచ్చు. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు రేషన్ సులభంగా అందుతుంది.నకిలీ కార్డులు, అక్రమాలను అరికట్టడంక్యూఆర్ కోడ్, డిజిటల్ రికార్డులు, బయోమెట్రిక్, ముఖ గుర్తింపు వంటి సాంకేతికతల కలయికతో నకిలీ రేషన్ కార్డులను ఆరికట్టవచ్చు. డూప్లికేట్ నమోదులను తొలగించడం, సబ్సిడీ ధాన్యాలను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించకుండా నిరోధించడం వంటివి చేయవచ్చు. ఈ లక్ష్యంతోనే ప్రభుత్వ ఈ స్మార్ట్ రేషన్స్ కార్డ్స్ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి లావాదేవీ డిజిటల్ రూపంలో నమోదు కావడం వల్ల అధికారులు పంపిణీ వ్యవస్థను మరింత సమర్థంగా పర్యవేక్షించడానికి అనుకూలంగా ఉంటుంది.ఈ వ్యవస్థను అమలు చేసే ముందు ప్రభుత్వం 16 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రేషన్ కార్డు మేనేజ్మెంట్ సిస్టమ్ (RCMS) యాప్‌ను పరీక్షించి, అందులో ఉన్న సాంకేతిక లోపాలను గుర్తిస్తుంది. అంతే కాకుండా.. ఈ యాప్ సాధారణ ప్రజలు సులభంగా ఉపయోగించగలిగే విధంగా ఉందో లేదో కూడా పరిశీలిస్తుంది.ఇదీ చదవండి: అంత ఈజీ కాదు.. అందుకే కెనడా నుంచి వచ్చేశా! -
స్మార్ట్ రేషన్‌కార్డులో హీరోయిన్ ఫోటో..!
అన్నానగర్: స్మార్ట్ రేషన్‌కార్డులో కుటుంబ యాజమాని ఫోటో స్థానంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫోటో వచ్చింది. ఈ సంఘటన సేలంలో మంగళవారం కలకలం రేపింది. ఎన్నికల కమిషన్ సంస్థ అచ్చువేసి ఇచ్చే రేషన్‌కార్డులో పురుషుల పేరు స్థానంలో మహిళల పేరు, ఫోటోలు మార్పులు గతంలో అక్కడక్కడ చోటుచేసుకున్నాయి. ఈ తప్పిదాలను తొలగించటానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటూ వస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమిళ ప్రభుత్వం స్థానికులకు వినియోగం చేస్తూ వచ్చే స్మార్ట్ రేషన్‌కార్డులో కుటుంబ యజమాని ఒకరి ఫోటో స్థానంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫోటో మారి వచ్చిన ఘటన సేలంలో చోటుచేసుకుంది. వివరాలివి.. సేలం జిల్లా ఓమలూరు తాలుకా ఆర్సి చెట్టిపట్టి కమలాపురం ప్రాంతానికి చెందిన సరోజ. ఈమె పేరుతో కుటుంబ యజమాని అని ముద్రించి వచ్చిన కార్డులో సరోజ ఫోటోకి బదులుగా నటి కాజల్ ఫోటో వచ్చింది. మంగళవారం ఉదయం రేషన్‌కార్డును డీలర్ సరోజకి ఇచ్చేటప్పుడే దీనిని చెప్పి సరిచేసి ఇస్తామని ఇచ్చారు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు స్మార్ట్ కార్డు జారీ చేసిన సిబ్బందుల వద్ద వారు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ స్మార్ట్ రేషన్‌కార్డు ప్రస్తుతం వాట్సాప్‌లో రావటం ప్రారంభమైంది. ఇటువంటి సంఘటనలు మరలా రాకుండా ఉండేందుకు అధికారులు తగ్గిన చర్యలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు.


