breaking news
small denomination problem
-
ATMలలో రూ.10 నోట్లు రానున్నాయా?
డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అయితే అదే సమయంలో చిన్న నోట్ల కొరత ఉన్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. కొన్నిసార్లు రూ.100 లేదా రూ.500 నోటుతో చిన్నపాటి కొనుగోళ్లు చేయాలనుకుంటే, దుకాణదారులు చిల్లర లేదని చెప్పే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఎక్కువ మంది ఆన్లైన్ చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల వినియోగం తగ్గింది.ఈ నేపథ్యంలో దేశంలో చిన్న నోట్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దేశంలో ఇప్పటికే రూ.10, రూ.20, రూ.50 నోట్లు సమృద్ధిగా చలామణిలో ఉన్నాయని తెలిపారు.సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే సమయంలో ఎక్కువగా రూ.500 నోట్లు, కొన్నిసార్లు రూ.100 లేదా రూ.200 నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చిన్న ఖర్చుల సమయంలో చిల్లర సమస్య ఎదురవుతోంది.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఏటీఎంలు చిన్న నోట్లను పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయలేదని మంత్రి వివరించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు.ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా “స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్లు” అనే యంత్రాలను పరీక్షిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు తీసుకునేటప్పుడు చిల్లర సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.చిన్న నోట్ల చలామణి ఎంత?ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.10 నోట్లు సుమారు రూ.439.4 కోట్లు, రూ.20 నోట్లు సుమారు రూ. 193.7 కోట్లు, రూ.50 నోట్లు సుమారు రూ.130.3 కోట్లు విలువైనవి ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 నోట్లు రూ.180 కోట్లు, రూ.20 నోట్లు రూ.150 కోట్లు, రూ.50 నోట్లు రూ.300 కోట్లు విలువైనవి చలామణిలో ఉన్నట్లు వెల్లడించారు. -
'చిల్లర' గల్లంతు!
రూపాయి రూపాయి నువ్వేంచేస్తావ్ అని అడిగితే.. హరిచంద్రుడి చేత అబద్దం ఆడిస్తా. భార్య భర్తల మధ్య చిచ్చు పెడతా. అన్న తమ్ముల మధ్య వైరం పెంచుతా అందట. నిజంగానే రూపాయి చిచ్చు రేపుతోంది. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రూపాయి కోసం గొడవలే. డబ్బుపై మోజుతో జనం కొట్టుకుంటున్నారని పొరబడకండి. చిల్లర పైసలు కరువు రావడంతో జనం వాటి కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. చెలామణిలో ఉన్న నాణాలు ఏమైపోతున్నాయన్న అనుమానం కలుగుతోంది. నాణెల కొరతతో దేశంలో 'చిల్లర' గొడవలు ఎక్కువవుతున్నాయి. సామాన్యులను 'చిల్లర' సమస్య సతమతం చేస్తోంది. నాణెల కొరత నిత్యం గొడవలకు దారి తీస్తోంది. కొనుగోళ్లు-అమ్మకాలు, ప్రయాణాలు-వ్యవహారాల్లో చిల్లర సమస్య తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వినియోగదారులు, వర్తకులు, సామాన్యులను చిల్లర కొరత కుదేలు చేస్తోంది. 50 పైసలు, రూపాయి, 2, 5 రూపాయిల నాణెలు తరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర సమస్యతో రోజువారీ జీవితంలో తలనొప్పులు తప్పడం లేదు. గత కొద్ది నెలలుగా వేధిస్తున్న చిల్లర మాంద్యం అన్ని వర్గాల వారిని ప్రభావితం చేస్తోంది. నాణెలు లభ్యత తగ్గిపోవడంతో రోజువారీ వ్యవహారాలు, వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా సన్నకారు వర్తకులు, నిత్యం ప్రయాణాలు చేసే వారిని చిల్లర సమస్య వెంటాడుతోంది. వందకు చిల్లర కావాలంటే 10 రూపాయిలు సమర్పించుకోవాల్సి వస్తోంది. నాణెల తయారీని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) తగ్గించేయడం ఈ సమస్యకు ప్రధాన కారణం. చాలా మంది తమ దగ్గరే ఎక్కువ నాణెలు ఉంచుకోవడం కూడా చిల్లర లోటుకు దారితీస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నాణెలు అరుదైన వస్తువుల జాబితాలో చేరడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నాణెల పంపిణీని రిజర్వు బ్యాంకు పక్కాగా అమలు చేస్తే చిల్లర సమస్య పరిష్కారమవుతుంది. చిల్లర గల్లంతు కాకుండా చర్యలు చేపట్టాలి. కాయిన్స్ ఏటీఎంలు పెట్టి చిల్లర లోటును భర్తీ చేయాలి. డిమాండ్‌కు అనుగుణంగా నాణెల తయారీ చేపడితే 'చిల్లర' గొడవలు సద్దుమణుగుతాయి. జనానికి తిప్పలు తప్పుతాయి.


