breaking news
Slabs
-
జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రేపటి (సెప్టెంబర్ 22) నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమల్లోకి రానున్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం మిగులుతుందన్నారు ప్రధాని మోదీ. జీఎస్టీ 2.0పై ఆదివారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.మోదీ తన ప్రసంగంలో ‘రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలవుతున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఆదాయం మిగులుతుంది. జీఎస్టీ సంస్కరణలతో దేశంలో అందరికి మేలు జరుగుతోంది. జీఎస్టీ సంస్కరణలో భారత వృద్ధి రేటు మరింత పెరుగుతోంది. 2017లో జీఎస్టీ అద్యాయం మొదలైంది. అంతకుముందు ఎన్నోరకాల పన్నులు ఉండేవి.అంతకుముందు ఎన్నోరకాల పన్నులు ఉండేవి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా పన్నులు కట్టాల్సి వచ్చేది. గతంలో బెంగళూరులో వస్తువులు హైదరాబాద్‌కు వచ్చి అమ్ముకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. గతంలో టోల్,ట్యాక్స్‌లతో కంపెనీలు ఇబ్బంది పడేవి. ఆ ప్రభావం వినియోగదారులపై పడేది.2024లో గెలిచిన తర్వాత జీఎస్టీలపై ప్రాధాన్యం ఇచ్చాం. జీఎస్టీ సంస్కరణలతో అన్నీ వర్గాలతో మాట్లాడాం. వన్ నేషన్ - వన్ ట్యాక్స్ కలలను సాకారం చేశాం. జీఎస్టీ సంస్కరణలతో దేశం మరింత బలపడుతుంది. రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాం.ఈ చర్యలతో మధ్య తరగతి జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. అన్నీ రంగాల్లో సంస్కరణలు వస్తుంటాయి. కొత్త జీఎస్టీతో వస్తువుల ధరలు మరింత తగ్గుతాయి. కొన్నింటిపై పూర్తి మినహాయింపు ఉంటుంది. కొత్తజీఎస్టీతో పేద మధ్య తరగతి ప్రజలకు డబుల్ బోనంజా. నాగరిక దేవోభవన అనే నినాదంలో ముందుకు వెళ్తున్నాం. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం. టీవీ,ఫ్రిజ్,ఇంటి నిర్మాణంపై ఖర్చు తగ్గుతుంది’అని తెలిపారు. My address to the nation. https://t.co/OmgbHSmhsi— Narendra Modi (@narendramodi) September 21, 2025 -
22 వరకూ ఆగుదాం!
నగర వాసులకు బొనాంజా అందనుంది. దసరా, దీపావళి పండగ ఆనందాలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సవరణతో రెట్టింపు కానుంది. ఇటీవల కేంద్రం సవరించిన జీఎస్టీ శ్లాబులు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. గతంతో పోలిస్తే ఆటో మొబైల్స్, ఎల్రక్టానిక్ వంటి చాలా వరకు ఉత్పత్తుల ధరలు సుమారు 10 శాతం మేర తగ్గనున్నాయి. దీంతో వాహనాలు, టీవీలు, కార్లు, సెల్ఫోన్లు వంటి ఉత్పత్తుల కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఈ నెల 22 వరకూ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు ఈ– కామర్స్ సంస్థలు కూడా ఈ నెల 22 తర్వాతే ఆఫర్లను అందించేందుకూ సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లు, ఆన్లైన్ సంస్థల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. 18 నుంచి 5 శాతానికి..గతంలో జీఎస్టీలో ఐదు శ్లాబులు ఉండగా.. తాజాగా కేంద్రం వీటిని రెండింటికి కుదించింది. విలాసవంతమైన వస్తువులపై ప్రత్యేకంగా 10 శాతం జీఎస్టీ శ్లాబును విధించింది. ప్రస్తుతం అనేక ఉత్పత్తులపై జీఎస్టీ 28 శాతం వరకు ఉన్నాయి. 22వ తేదీ నుంచి ఈ స్లాబ్ 18 శాతానికి తగ్గనుంది. కొన్ని ఉత్పత్తులపై 18 శాతం నుంచి 5 శాతానికి కూడా తగ్గే అవకాశముంది. ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి ఎల్రక్టానిక్ వస్తువులతో పాటు కార్లు, బైక్ వంటి ఆటోమొబైల్స్ ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు నిత్యావసర సరుకులపై కూడా కేంద్రం జీఎస్టీని తగ్గించింది. జీఎస్టీ శ్లాబుల్లో మార్పులతో ఒకవైపు కొన్ని కంపెనీలు రేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో వినియోగదారులు మాత్రం రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలామంది షోరూమ్‌లకు వెళ్లి వస్తువులను చూస్తున్నారు. వాటి ఫీచర్లను పరిశీలిస్తున్నారు. కానీ కొనుగోలును మాత్రం ఈ నెల 22 తర్వాతే చేద్దామనే అభిప్రాయానికి వస్తున్నారని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. కొన్ని బ్రాండ్లు తాత్కాలికంగా ఆఫర్లు ప్రకటించినా అవి కస్టమర్లను ఆకట్టుకోలేకపోతున్నాయి. తగ్గనున్న వాహనాల ధరలు..సాధారణంగా దసరా, దీపావళి పండగ సీజన్లలో వాహనాలను కొనుగోలు చేయడం సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఆటో మొబైల్స్‌పై 28 శాతంగా జీఎస్టీ ఉండగా.. కొత్త జీఎస్టీ శ్లాబ్‌లో ఇది 18 శాతానికి తగ్గింది. ఏకంగా 10 శాతం మేర జీఎస్టీ తగ్గుతుంది. దీంతో మధ్యస్థాయి కారుపై రూ.1.5 లక్షల వరకు, బైక్‌పై రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య తగ్గింపు ఉండనుంది. దీంతో వాహన కొనుగోలుదారులు కొనుగోళ్లను మరో రెండు వారాల పాటు వాయిదా వేసుకుంటున్నారు. వాహన షోరూమ్‌లో గిరాకీ తగ్గడంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు షోరూమ్ నిర్వాహకులు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ముందస్తుగా బుకింగ్ చేసుకుని 22వ తేదీ తర్వాతే డెలివరీ చేసుకోవచ్చని భావిస్తున్నారు.ఏసీ, వాషింగ్ మెషీన్, టీవీలు సైతం.. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, డిష్వాషర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై కూడా కేంద్రం జీఎస్టీ శ్లాబ్‌ను తగ్గించింది. ఇప్పటివరకు వీటిపై 28 శాతం పన్ను విధించగా, ఇప్పుడవి 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోకి వెళ్లాయి. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా భారీగానే తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీవీలపై రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు, మొబైల్ ఫోన్లపై రూ.2 వేల నుంచి రూ.5 వేలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉండటంతో కొనుగోళ్ల వాయిదాకే జనం మొగ్గు చూపుతున్నారు.ఈ– కామర్స్ ఆఫర్లూ అప్పుడే..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ సంస్థలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ–కామర్స్ కొనుగోలుదారులు సైతం ఈ నెల 22 డెడ్‌లైన్ విధానానికే జై కొడుతుండటంతో.. కొన్ని సంస్థలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆఫర్లను సైతం నిలిపివేశాయి. దీంతో సాధారణంగా డైలీ, వీక్లీ ఆఫర్ల పేరుతో ఆన్లైన్ కస్టమర్లను ఆకర్షించే ఈ–కామర్స్ సంస్థలు.. తమ మెగా ఆఫర్లను ఈ నెల 22 తర్వాతే ప్రకటించాలని వ్యూహరచన చేస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత ‘బిగ్ బిలియన్ డేస్’, ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ వంటి పేర్లతో భారీ సేల్ నిర్వహించడానికి సిద్ధమవుతుండటం గమనార్హం.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడిగా లారీ ఎలిసన్ -
12 శాతం శ్లాబ్‌ను ఎత్తివేసే యోచనలో జీఎస్టీ?
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబులను హేతుబద్ధీకరించాలనే వాదనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం లేదా 12 శాతంగా ఉన్న శ్లాబ్‌ను పూర్తిగా తొలగించడం అనే కీలక ప్రతిపాదన చర్చలో ఉందని తెలుస్తుంది.ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ విధించే వస్తువుల్లో చాలా వరకు సాధారణ పౌరులు దైనందిన జీవితంలో ఉపయోగించే వస్తువులే కావడం గమనార్హం. మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు అధికంగా వినియోగించే ఉత్పత్తులు ఈ శ్లాబ్‌లో ఉన్నాయి. కేంద్ర పరిశీలనలో ఉన్న ప్రణాళికలో భాగంగా ఈ వస్తువులను తక్కువగా 5% పన్ను పరిధిలో వర్గీకరించాలని యోచిస్తోంది. తుది వినియోగదారులకు ఆయా వస్తువులను చౌకగా అందించాలనే లక్ష్యంతో ఈమేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.ప్రభుత్వం 12% శ్లాబ్‌ను పూర్తిగా రద్దు చేసి ఆయా వస్తువుల్లో కొన్నింటిని ప్రస్తుతం దాని కంటే తక్కువగా ఉన్న 5% శ్లాబ్, కొన్నింటిని ఎక్కువగా 18% శ్లాబులోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్వరలో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రొటోకాల్ ప్రకారం మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందు 15 రోజుల నోటీసు అవసరం. అయితే ఈ నెలాఖరులో సమావేశాలు జరగవచ్చని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌కు పన్ను రేట్లలో మార్పులను సిఫారసు చేసే అధికారం ఉంది.ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’12 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోని వస్తువుల వివరాలు..ప్రాసెస్డ్ ఫుడ్: పాలు, జున్ను, వెన్న, నెయ్యి, ఫ్రోజెన్ మీట్.డ్రైఫ్రుట్స్, గింజలు: బాదం, పిస్తా, అంజీర, ఖర్జూరంనూనెలు: ఫిష్ ఆయిల్, లానోలిన్, పౌల్ట్రీ కొవ్వు.టెక్స్టైల్, దుస్తులు: రూ.1,000 కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు, సింథటిక్ నూలుఎలక్ట్రానిక్స్: మొబైల్ ఫోన్లు, ప్రింటర్లు, కంప్యూటర్ ఉపకరణాలుట్రావెల్ & హాస్పిటాలిటీ: బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం, నాన్ ఏసీ హోటళ్లునిర్మాణ సామగ్రి: సిరామిక్ టైల్స్, శానిటరీ వేర్ -
భారత్‌పై అన్ని దేశాల కన్ను
-
రైతులు మరియు స్టీల్ ప్లాంట్ పై బీజేపీ మొండి వైఖరి
-
పేదలు, మహిళల కోసం కొత్త పథకాలు
-
Income Tax Slabs : సామాన్యుడిపై పన్నుల భారం తగ్గించండి
-
జీఎస్టీ@365
సాక్షి, మెదక్ : ఒకే దేశం ఒకే పన్ను విధానం జీఎస్టీ(వస్తు సేవల పన్ను) అమలులోకి వచ్చి నేటికి ఏడాది. జూన్ 30వ తేదీ అర్ధరాత్రి అనగా జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చింది. ఆరంభంలో ప్రతిపక్ష పార్టీలతో పాటు వ్యాపార వర్గాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండ అమలు చేసింది. జీఎస్టీకి ముందు జిల్లాలో వ్యాట్(విలువ ఆధారిత పన్ను) అమలులో ఉండేది. దీని పరిధిలో 1,132 రకాల చెల్లింపుదారులు ఉండేవారు. జీఎస్టీ వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారుల సంఖ్య మరింత పెరిగింది. వివిధ రకాల ఉత్పత్తులపై పన్ను చెల్లించే వారి సంఖ్య 1,972కు చేరుకుంది. అదనంగా మరో 840 మంది వ్యాపారులు, వ్యాపార సంస్థలు వస్తు సేవల పన్న చెల్లింపు పరిధిలోకి వచ్చాయి. అన్ని రకాల వ్యాపారాల్లో 20 లక్షలకుపైగా ఆదాయం ఉన్న వ్యాపారులు, వ్యాపారసంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం జరిగింది. ఏడాది కాలంగా ప్రతి మూడు మాసాలకు ఒకమారు రిటర్న్‌లు ఫైల్‌చేస్తూ పన్నులు చెల్లిస్తున్నారు. వ్యాట్ అమలులో ఉన్నప్పుడు ప్రతినెలా పన్నుల రూపంలో సుమారు రూ.2 కోట్లు వచ్చేవి. అయితే జీఎస్టీ అమలు తర్వాత ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రతినెలా రూ.3 కోట్లకుగాపై పన్నులు వసూలు అవుతున్నాయి. దీంతో జిల్లాలో జీరో దందా తగ్గింది. అన్ని రాష్ట్రాల్లో ఒకే పన్ను విధానం అమలు అవుతుండటంతో పన్నుఎగవేత లేకుండా పోయింది. అలాగే ప్రజలకు చాలా ఉత్పత్తులు ఒకే ధరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గింది. కమర్షియల్ ట్యాక్స్ చెక్ పోస్టులు ఎత్తివేయడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తుల రవాణా వేగం పెరిగింది. వ్యాపారులకు ట్యాక్స్ చెల్లించటం సులువైంది. ఆన్లైన్లో చెల్లింపు విధానంతో వ్యాపారుల ఇబ్బందులు చాలా వరకు తగ్గాయి. అయితే జీఎస్టీపై అందరి వ్యాపారులకు ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాలేదు. దీని అమలులో ఇంకా కొన్ని ఇబ్బందులు నెలకొంటున్నాయి. పూర్తి స్థాయి నెట్వర్క్ లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యాపారులు, వ్యాపార సంస్థలు పన్నులు సక్రమంగా చెల్లిస్తుంది లేనిదీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గతంలో మాదిరిగా పర్యవేక్షించని పరిస్థితి నెలకొంది. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి దాడులు నిర్వహించాలన్నా.. నిబంధన ప్రతిబంధకంగా మారుతోంది. -
జీఎస్టీ చాలా క్లిష్టమైందే..కానీ
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో జీఎస్టీ జిఎస్టి శ్లాబులను కుదించే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. అంతేకాదు 12 శాతం, 18 శాతం పన్ను శ్లాబులను సైతం కాలక్రమేణా విలీనం చేసే అవకాశాలున్నాయన్న సంకేతాలనందించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ‘ఇక్ఫాయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లుర్నింగ్’లో ప్రసంగించిన సుబ్రమణియన్ జీఎస్టీ అమలు ఒక విప్లవాత్మక ఆర్థిక సంస్కరణగా అభివర్ణించారు. తదుపరి ఆరు నుంచి తొమ్మిది నెలల్లో వ్యవస్థ స్థిరపడతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జిఎస్టి చట్టం వచ్చే 6-9 నెలల కాలంలో స్థిరత్వం సాధించనుందని, ఇతర దేశాలకు సైతం మార్గదర్శకం కానుందని సుబ్రమణియన్ పేర్కొన్నారు. కొత్త పరోక్ష పన్నుల విధానంలో నిలకడ వచ్చాక పన్ను శ్లాబులను కుదించే ప్రక్రియ ప్రారంభం కావచ్చన్నారు. భవిష్యత్లోపెట్రోల్, డీజిల్‌ను జిఎస్టి పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ర్టాల అంగీకారమే కీలకమని అన్నారు. అయితే, భారత్‌లాంటి పెద్ద దేశంలో ఒకే జిఎస్టి రేటు మాత్రం సాధ్యపడకపోచ్చని పేర్కొన్నారు. జిఎస్టి పోర్టల్‌లో రిటర్నులు ఫైలింగ్ వ్యవస్థల్లో కొన్ని సాంకేతిక అవాంతరాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాలు భిన్న ఐటీ వ్యవస్థలను కలిగి ఉన్న నేపథ్యంలో జిఎస్టి సిస్టమ్ కొంత సంక్లిష్టంగా మారిందన్నారు. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక అవాంతరాలు గురించి అడిగినప్పుడు వ్యవస్థ ఎంత క్లిష్టంగా ఉందో మీకు చెప్పలేను. ఇంకా బాగా చేయగలిగి ఉండే బావుండేదని తాను భావిస్తున్నానన్నారు. కానీ జీఎస్టీ కౌన్సిల్ ఈ అంశాలన్నింటినీ పరిశీలించి సరైన చర్య తీసుకుంటోంది అది ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిఎస్టిలో 5, 12, 18, 28 శాతం ఇలా నాలుగు పన్ను శ్లాబులుండగా, ఇటీవలి కౌన్సిల్ సమావేశాల్లో జీఎస్టీ స్లాబుల్లో పలు మార్పులు చేపట్టిన సంగతి తెలిసిందే. -
కూలుతున్న శ్లాబ్‌లు
గచ్చిబౌలి/మాదాపూర్: నగరంలో నిర్మాణంలో ఉన్న శ్లాబ్‌లు కూలుతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ప్రమాదాల్లో కూలీల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. నిర్మాణ సంస్థలు మాత్రం ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలేదు. తాజాగా... సోమవారం మాదాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం స్లాబ్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు, ఒక సైట్ ఇంజినీర్ గాయపడ్డాడు. మరో ఇద్దరు కూలీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాలు... మాదాపూర్ కాకతీయహిల్స్‌లో రెండు వేల చదరపు గజాల స్థలాన్ని అయ్యన్న ఇన్ఫ్రా ప్లాటినా కన్స్ట్రక్షన్ సంస్థ డెవలప్మెంట్కు తీసుకుంది. సెల్లార్, స్టిల్ ప్లస్ ఐదు అంతస్తులు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందింది. ఇప్పటికే సెల్లార్ శ్లాబ్ వేశారు. సోమవారం తెల్లవారుజామున 2వ శ్లాబ్ వేస్తున్నారు. కాంక్రీట్‌ను చదును చేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్‌తో పాటు పిల్లర్ నెలకొరిగాయి. దీంతో శ్లాబ్‌పై ఉన్న నలుగురు కూలీల్లో వెంకట్‌రెడ్డి(25), అప్పన్న(35) అనే ఇద్దరు పక్కకు దూకడంతో స్వల్ప గాయాలయ్యాయి. జూనియర్ ఇంజినీర్ సునీల్(26) శ్లాబ్‌పై నుంచి జారీ పడటంతో గాయపడ్డాడు. వెంకట్‌రెడ్డి, అప్పన్నలు మాదాపూర్‌లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వెంటనే డిశ్చార్జి అయ్యారు. క్షతగాత్రులను వెస్ట్ జోనల్ కమిషనర్ బీబీ గంగాధర్ రెడ్డి, ఉప కమిషనర్ మమత పరామర్శించారు. కాగా, ఈ ప్రమాదంలో బిల్డర్‌పై ఐపీసీ 237 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు వూదాపూర్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.