
సాక్షి, న్యూఢిల్లీ: రేపటి (సెప్టెంబర్ 22) నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమల్లోకి రానున్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం మిగులుతుందన్నారు ప్రధాని మోదీ. జీఎస్టీ 2.0పై ఆదివారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
మోదీ తన ప్రసంగంలో ‘రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలవుతున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఆదాయం మిగులుతుంది. జీఎస్టీ సంస్కరణలతో దేశంలో అందరికి మేలు జరుగుతోంది. జీఎస్టీ సంస్కరణలో భారత వృద్ధి రేటు మరింత పెరుగుతోంది. 2017లో జీఎస్టీ అద్యాయం మొదలైంది. అంతకుముందు ఎన్నోరకాల పన్నులు ఉండేవి.
అంతకుముందు ఎన్నోరకాల పన్నులు ఉండేవి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా పన్నులు కట్టాల్సి వచ్చేది. గతంలో బెంగళూరులో వస్తువులు హైదరాబాద్‌కు వచ్చి అమ్ముకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. గతంలో టోల్,ట్యాక్స్‌లతో కంపెనీలు ఇబ్బంది పడేవి. ఆ ప్రభావం వినియోగదారులపై పడేది.2024లో గెలిచిన తర్వాత జీఎస్టీలపై ప్రాధాన్యం ఇచ్చాం. జీఎస్టీ సంస్కరణలతో అన్నీ వర్గాలతో మాట్లాడాం. వన్ నేషన్ - వన్ ట్యాక్స్ కలలను సాకారం చేశాం. జీఎస్టీ సంస్కరణలతో దేశం మరింత బలపడుతుంది. రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాం.
ఈ చర్యలతో మధ్య తరగతి జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. అన్నీ రంగాల్లో సంస్కరణలు వస్తుంటాయి. కొత్త జీఎస్టీతో వస్తువుల ధరలు మరింత తగ్గుతాయి. కొన్నింటిపై పూర్తి మినహాయింపు ఉంటుంది. కొత్తజీఎస్టీతో పేద మధ్య తరగతి ప్రజలకు డబుల్ బోనంజా. నాగరిక దేవోభవన అనే నినాదంలో ముందుకు వెళ్తున్నాం. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం. టీవీ,ఫ్రిజ్,ఇంటి నిర్మాణంపై ఖర్చు తగ్గుతుంది’అని తెలిపారు.
My address to the nation. https://t.co/OmgbHSmhsi
— Narendra Modi (@narendramodi) September 21, 2025