breaking news
sivashankar
-
కొంపలు ముంచింది 'బెల్ట్‌షాపు మద్యమే'?
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ప్రమాదం జరిగిన రోజు పోలీసులు, అధికారులు భావించినట్లు బస్సు.. బైకర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి కారణం మద్యం మహమ్మారిగా తేలింది. బైకర్ శివ శంకర్ తన స్నేహితుడితో కలిసి బెల్ట్‌షాపులో పూటుగా మద్యం సేవించి బైక్ నడిపాడు. బస్సు ప్రమాదానికి 13 నిమిషాల ముందు బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడం, శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందడం, ఆ తర్వాత రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను బస్సు ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో పెను ప్రమాదం సంభవించి బస్సు దగ్ధమైంది. శివశంకర్‌తో పాటు బైక్ వెనుక కూర్చున్న అతని స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ప్రమాదానికి అసలు కారణం తేలింది. మొత్తం ప్రమాదాన్ని నిశితంగా విశ్లేషిస్తే.. ప్రభుత్వం నేషనల్ హైవే పక్కనే మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతివ్వడం, పల్లెల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్‌షాపుల్ని పెట్టించడమే కారణమని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశ వ్యాప్తంగా ప్రజల ఒళ్లు గగుర్పొడిచేలా చేసిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణం బెల్ట్ షాపులో మద్యం అని తేలింది. రాష్ట్రంలో 16 నెలలుగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ.. ఊరు, వాడ, గుడి, బడి, హైవే ఏదీ అనర్హం కాదన్నట్లు వెలిసిన మద్యం, బెల్ట్ షాపులు తప్పతాగి డ్రైవింగ్ చేసేందుకు ఉసిగొల్పుతున్నాయని స్పష్టమైంది. అర్ధరాత్రి పూట ఓ బెల్ట్ షాపులో పూటుగా మద్యం తాగి.. ఆపై పల్సర్ బైక్‌పై ప్రయాణిస్తూ వారు ప్రమాదానికి గురైందే కాక.. మరో 19 మంది నిండు ప్రాణాలు మంటగలవడానికి కారణం ప్రభుత్వ మద్యం పాలసీలోని విచ్చలవిడితనమేనని తేటతెల్లం చేసింది. ‘తప్పతాగి డ్రైవ్ చేసే వారు సూసైడ్ బాంబర్లు (ఆత్మాహుతి దళాలు).. టెర్రరిస్టులు.. ఉగ్రవాదుల కంటే ప్రమాదకం. వీరి వల్ల ఎన్ని ప్రాణాలైనా పోవచ్చు. ఎన్నో కుటుంబాలు వీధినపడే ప్రమాదం ఉంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి చేసే డ్రైవింగ్ వల్ల ఇతరులకే ఎక్కువ హాని జరుగుతుంది’ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇటీవల చెప్పిన మాటలను ప్రజలు సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇలా విచ్చలవిడిగా వేళాపాళా లేకుండా ఎక్కడబడితే అక్కడ మద్యం దొరికేలా చేసిన ప్రభుత్వమే ఈ ప్రమాదంలో అసలు ముద్దాయని నెటిజన్లు అదే సోషల్ మీడియా వేదికగా ఏకిపడేస్తుండటం వైరల్ అయ్యింది. 19 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోవడానికి మద్యం మహమ్మారే కారణమని తెలుసుకుని ప్రజలంతా నివ్వెరపోతున్నారు. మద్యం కుటుంబాలను చిదిమేస్తుందని చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష్య నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. 16 నెలలుగా ప్రభుత్వ పెద్దల స్వార్థానికి ఫలితం ఈ దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి తప్పతాగి బైక్‌పై ప్రయాణంకర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు ప్రమాదం ఘటనలో అసలు నిజాలు వెలుగు చూస్తున్నాయి. మద్యం మహమ్మారే ఈ ప్రమాదానికి అసలు కారణమని నిగ్గు తేలింది. కర్నూలు వాసి శివశంకర్, తుగ్గలి మండలం రాంపల్లి వాసి చాకలి ఎర్రిస్వామి అలియాస్ నాని ఇద్దరూ శుక్రవారం రాత్రి నేషనల్ హైవే పక్కనే ఉన్న లక్ష్మీపురంలో మద్యం సేవించారు. అర్ధరాత్రి వరకూ మద్యం సేవించిన తర్వాత ఎర్రిస్వామిని రాంపల్లిలో వదిలేందుకు రాత్రి 2 గంటలకు పూర్తి మద్యం మత్తులో శివశంకర్ పల్సర్ బైక్‌లో బయలు దేరాడు. వారిద్దరూ లక్ష్మీపురం నుంచి బయలు దేరారని జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారు. పెట్రోల్ కోసం కియా షోరూం ఎదురుగా ఉన్న శివప్రసాద్ ఫ్యూయల్ స్టేషన్‌కు అర్ధరాత్రి 2.22 గంటలకు 6వ పంప్ వద్దకు వెళ్లి ఆపాడు. పెట్రోలు కోసం సిబ్బందిపై కేకలు వేశారు. ఒకటో పంపు వద్దకు రావాలని సిబ్బంది చెప్పడంతో బైక్‌ను ఒంటిచేత్తో రౌండ్లు తిప్పి వేగంగా నడిపాడు. అక్కడే కిందపడిపోవాల్సింది తృటిలో తప్పించుకున్నాడు. రూ.300 పెట్రోలు పోయించుకుని 2.26 గంటలకు వెళ్లిపోయాడు. పెట్రోలు బంకు నుంచి సరిగ్గా 5.5 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత బైక్ అదుపు తప్పడంతో కుడి వైపు డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎగిరిపడిన శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎర్రిస్వామి డివైడర్ మధ్యలోని ఖాళీ స్థలంలో ఉన్న గడ్డిలో పడ్డాడు. దీంతో బతికిపోయాడు. వీరు లక్ష్మీపురంలోని ఓ బెల్ట్‌షాపులో మద్యం తీసుకుని, అర్ధరాత్రి వరకూ తాగి ఆ తర్వాత బైక్‌లో బయలుదేరినట్లు తెలుస్తోంది.రోడ్డుపై పడిపోయిన బైక్‌ను ఢీకొట్టడంతోనే..శివశంకర్ బైక్ పై నుంచి కిందపడిపోయిన తర్వాత గుండెలపై ఒత్తి బతికించేందుకు ఎర్రిస్వామి యత్నించాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని రోడ్డుకు ఎడమ వైపునకు లాగాడు. ఆ తర్వాత బైక్‌ను లాగేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బస్సు వేగంగా వస్తూ రోడ్డుపై మనిషి ఉండటం చూసి డ్రైవర్ హారన్ కొట్టడంతో ఎర్రిస్వామి పక్కకు పరుగెత్తాడు. మనిషి పక్కకు వెళ్లిపోయాడని అదే వేగంతో బస్సు వచ్చింది. అయితే మనిషి ముందు బైక్ ఉందనే సంగతి డ్రైవర్ లక్ష్మయ్య గుర్తించలేకపోయాడు. దీంతో బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బస్సు కింద బైక్ ఇరుక్కుపోయి, రోడ్డుపై రాపిడికి గురై మంటలు చెలరేగడం, బైక్ పెట్రోల్ ట్యాంకు పగలడంతో భారీగా మంటలు వ్యాపించడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ విషయాలను ఎర్రిస్వామి పోలీసుల విచారణలో స్వయంగా వెల్లడించాడు.బైక్‌పై రెండో వ్యక్తి ఉన్నట్లు ఎలా తెలిసిందంటే..ప్రమాద స్థలి సమీపంలో రోడ్డుకు ఓ వైపు శివశంకర్ శవం, బస్సు కింద బైక్ ఉంది. డ్రైవర్ కూడా బైక్‌ను ఢీకొట్టానని చెప్పాడు. దీంతో హోం మంత్రి నుంచి కలెక్టర్, ఎస్పీ వరకూ అందరూ ప్రమాదానికి ఇదే కారణమని నమ్మారు. అయితే పోలీసుల పరిశోదనలో అర్ధరాత్రి శివశంకర్ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవాలని యత్నించారు. అతడి ఆధార్ కార్డు ఆధారంగా తల్లి, సోదరుడిని గుర్తించి శివశంకర్ ఫోన్ నంబరు తెలుసుకుని కాల్ డేటా తీశారు. ఫోన్ చేస్తే శివశంకర్ ఫోన్ కూడా తుగ్గలి మండలం రాంపల్లిలో ఉంది. అది ఎర్రిస్వామి వద్ద ఉండటం గుర్తించారు. దీంతో ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఘటన జరిగిన తీరును ఎర్రిస్వామి స్పష్టంగా వివరించాడు. బైక్‌ను ఈడ్చుకుంటూ వెళ్లడం, కళ్లముందే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి దూకడం, ఆపై బస్సు తగలబడటం ఎర్రిస్వామి చూశాడు. ఘటన తర్వాత సీఐ అక్కడికి రావడం, ఫైర్ ఇంజన్‌ను రప్పించే ప్రయత్నాలు చేస్తుండటం. బస్సులో జనాలు అగ్నికి ఆహుతి అవ్వడం.. ఇదంతా తమ బైక్ వల్లే జరిగిందని, దీంతో తనకు ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనని భయపడి అక్కడి నుండి పారిపోయాడు.అబద్ధాలతో పోలీసులను మభ్యపెట్టిన డ్రైవర్ లక్ష్మయ్య ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే లక్ష్మయ్య వాస్తవం చెబితే తన తప్పుతోనే ప్రమాదం జరిగిందని తెలుస్తుందని పోలీసులకు అబద్ధాలు చెప్పాడు. తొలుత బైక్ వెళుతుంటే బస్సు ఢీకొట్టిందని, బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో రాపిడికి గురై మంటలు రేగి ప్రమాదం జరిగిందని చెప్పాడు. ఆపై బైక్ తనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఎదురుగా రావడంతో ప్రమాదం జరిగిందని చెప్పాడు. చివరకు ఎర్రిస్వామిని విచారించిన తర్వాత తిరిగి డ్రైవర్‌ను విచారిస్తే అసలు నిజం ఒప్పుకున్నాడు. బైక్ రోడ్డుపై పడి ఉందని, తాను గుర్తించలేక ఢీకొట్టానని చెప్పాడు. లక్ష్మయ్య వాస్తవం ముందే చెప్పి ఉంటే ప్రమాదానికి అసలు కారణం మద్యం మత్తులో వాహనాన్ని నడిపిన శివశంకరే కారణమని శుక్రవారమే తేలేది.ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు ప్రమాదంపై ఉలిందకొండ పోలీసు స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, డోన్ డీఎస్పీ శ్రీనివాసులు, కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబునాయుడుతో పాటు పలువురు సీఐలు, ఎస్ఐల బృందం ఘటన స్థలాన్ని పరిశీలించింది. ఎర్రిస్వామి చెప్పింది నిజమేనా.. ఎక్కడ కిందపడ్డారు.. బస్సు ఎన్నిమీటర్లు బైక్‌తో దూసుకొచ్చింది.. అనే అంశాలను పరిశీలించి రికార్డు చేశారు. శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరూ లక్ష్మీపురంలో మద్యం సేవించి మద్యం మత్తులోనే నేషనల్హైవే పైకి వచ్చినట్లు గుర్తించారు. మద్యం మత్తులోనే బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు తేల్చారు. అలాగే బస్సు నిర్మాణం, ఫిట్నెస్ను ఎంవీఐలు నాగరాజు నాయక్, సుధాకర్‌రెడ్డిల బృందం పరిశీలించింది. గతుకుల హైవే కూడా పెను ప్రమాదాలకు కారణమే!ఎన్హెన్–44లో గుత్తి నుంచి డోన్, కర్నూలు వరకు రోడ్డు పూర్తి అధ్వానంగా ఉంది. భారీగా గుంతలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్‌లు వేశారు. కొన్ని చోట్ల అలాగే ఉన్నాయి. కర్నూలు–డోన్ మధ్య భారీగా గుంతలు ఉన్నాయి. వర్షం వస్తే వీటిలో నీరు నిలబడి రోడ్డు కూడా కన్పించని పరిస్థితి. రాత్రి వేళల్లో బెంగళూరు–హైదరాబాద్‌కు బస్సులు, కార్లు, లారీలు వేల సంఖ్యలో ప్రయాణం చేస్తుంటాయి. గుంతల రోడ్డులో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదానికి గురవుతున్నాయి. కొంతమంది వాహనదారులు రోడ్డు బాగోలేదని టోల్ ఫీజు చెల్లించమని గొడవలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎన్‌హెచ్ అధికారులు రోడ్డు బాగుపై దృష్టి సారించాలి. ఆదాయం కోసం సుప్రీంకోర్టునే సవాల్ చేసిన మద్యం వ్యాపారులునేషనల్ హైవేలకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని 2016లో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా మద్యం వ్యాపారులు తమ వ్యాపారానికి ఇబ్బంది వస్తుందని ఆందోళన చెందారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అండతో మద్యం వ్యాపారులు సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేశారు. దీంతో తిరిగి సుప్రీం రివ్యూ చేసి 2017లో మరో తీర్పు ఇచ్చింది. నేషనల్ హైవే.. కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, జిల్లా, మండల కేంద్రాల మీదుగా వెళుతుంటే అక్కడ మాత్రం మద్యం షాపులు పెట్టుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఈ ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో నేషనల్ హైవేలు ఉంటే అక్కడ 220 మీటర్ల లోపు మద్యం దుకాణాలు పెట్టకూడదని చెప్పింది. దీంతో నేషనల్ హైవేలపై విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటయ్యాయి. నేషనల్ హైవేలకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో.. రోడ్డుపై మద్యం దుకాణం బోర్డు పెట్టి, సమీపంలో దుకాణం ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దీంతో మద్యం ప్రియులు మందు సేవించి హైవే ఎక్కుతున్నారు.నేషనల్ హైవే పక్కనే భారీగా మద్యం దుకాణాలు⇒ ఈ ఫొటోలోని ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ హైదరాబాద్ – బెంగళూరు నేషనల్ హైవే పక్కనే ఉంది. హైవేపై అటు, ఇటూ వెళ్లే వారికి కన్పించేలా బిల్డింగ్‌పై భాగంలో ఈగల్ బార్ అని రాశారు. నేషనల్ హైవేపై వెళ్లే వాహనదారులు ఇక్కడ ఆగి మద్యం సేవించి మద్యం మత్తులో స్టీరింగ్ పట్టుకుని హైవే ఎక్కుతున్నారు. ⇒ ఈ ఒక్క బెల్ట్ షాపు, బార్ మాత్రమే కాదు.. ఏపీ–తెలంగాణ సరిహద్దులోని పుల్లూరు టోల్గేట్ నుంచి అనంతపురం జిల్లా సరిహద్దు పోతుదొడ్డి వరకు ఎన్‌హెచ్–44 పక్కన 10 మద్యం దుకాణాలు, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. పుల్లూరు నుంచి పోతుదొడ్డి వరకూ 88 కిలోమీటర్లు ఉంది. ఈ 88 కిలోమీటర్ల మధ్యలోని పల్లెల్లో బెల్ట్‌షాపులు ఎన్ని ఉన్నాయో లెక్కేలేదు! పైగా పెద్ద పంచాయతీల్లో రెండు నుంచి నాలుగు వరకు బెల్ట్‌షాపులు కూడా ఉన్నాయి. టీడీపీ నేతల కనుసన్నల్లో పల్లెల్లో బెల్ట్‌షాపులు పుట్టగొడుగుల్లా వెలిసినా ఆబ్కారీ అధికారులు నిస్సహాయంగా ఉన్నారు. పైగా టీడీపీ నేతలతో పాటు ఎక్సైజ్ అధికారులు ఆదాయ మార్గాలకు అలవాటు పడి తూగుతున్నారు. దీంతో నేషనల్ హైవే పొడవునా విచ్చలవిడిగా మద్యం దొరుకుతోంది. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అతిపెద్ద హైవే ఎన్‌హెచ్–44పై ఇలాంటి మద్యం దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉంటే ఏ స్థాయిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఇట్టే తెలుస్తోంది.ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్‌హెచ్–44 పక్కన ఉన్న మద్యం దుకాణాలునిరీక్షణ వైన్స్, పంచలింగాల త్రీపెగ్స్, శ్రీ చక్ర ఆస్పత్రి సమీపంలో, కర్నూలుజీవీఆర్ వైన్స్, చెన్నమ్మ సర్కిల్పీఆర్ వైన్స్, షరీన్ నగర్ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్సుంకులమ్మ వైన్స్, కృష్ణానగర్మధులోక్ వైన్స్, చిన్న టేకూరురేణుకా యల్లమ్మ వైన్స్, పెద్దటేకూరుమహేశ్ వైన్స్, ఉలిందకొండబాలాజీ వైన్స్, కంబాలపాడు సర్కిల్, డోన్మంజీర వైన్స్, కొత్తపల్లిఈ ఘటనతో ప్రభుత్వం మేల్కొంటుందా? బస్సు ప్రమాదానికి కారణమైంది లక్ష్మీపురంలోని ఓ బెల్ట్‌షాపు. ఎక్కడ బెల్ట్‌షాపులు ఉన్నా ఉపేక్షించమని చెబుతున్న సీఎం చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలోని ప్రతీ పల్లెలో విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు వెలిశాయని తెలియదా? ఆంధ్రప్రదేశ్‌లో బెల్ట్‌షాపు లేని పల్లె లేదంటే అతిశయోక్తి కాదు. రోడ్డుపై వెళ్లే వాహనదారుడు మందు కావాలంటే 10 నిమిషాల్లో మద్యం షాపు, బెల్ట్‌షాపు కన్పించే పరిస్థితి. దీంతోనే శివశంకర్ మద్యం తాగి బైక్ నడిపాడు.. అదుపు తప్పి చనిపోయాడు. తనతో పాటు మరో 19 మందిని బలితీసుకున్నాడు. నిజానికి బైకర్ సహా 20 మంది చావుకు అసలైన కారణం మద్యం.. బెల్ట్‌షాపు. ఈ రెండూ లేకపోతే బస్సు ప్రమాదం జరిగేది కాదు. 20 మంది చనిపోయేవారు కాదు. చనిపోయిన ఏడు రాష్ట్రాల్లోని వారి కుటుంబాలు ఈ రోజు హాయిగా నవ్వుతూ ఉండేవి. కేవలం ప్రభుత్వం, టీడీపీ నేతలు ఆదాయం కోసం విచ్చలవిడిగా నేషనల్ హైవేలపై మద్యం దుకాణాలు, పల్లెల్లో బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయడంతో మందు బాబులకు సులువుగా మద్యం దొరుకుతోంది. ఫలితంగా తప్పతాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ వల్లనే అని స్పష్టమైంది. నేతల ఆదాయం కంటే, ప్రజల ప్రాణాలు ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావించి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. -
మృత్యుశకటం
బస్సు డ్రైవర్ చేసిన తప్పు 19 మంది సజీవ దహనానికి కారణమైంది! నిద్రలో ఉన్న వారిని శాశ్వత నిద్రలోకి పంపింది. కొన్ని కుటుంబాలను చిదిమేసి శాశ్వత చీకట్లు నింపింది. ఘటనా స్థలిని చూసిన వారి కంట నీరు తెప్పించింది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలచి వేసింది. నిమిషాల వ్యవధిలో కొన్ని కుటుంబాలు, కొన్ని కుటుంబాల పెద్ద దిక్కులు, భవిష్యత్ ఆశలు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు,చావు కేకలతో ఎన్హెచ్ృ44 భీతిల్లింది. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా బొగ్గు, మసిగా మారాయి. ఈ భీతావహ ఘటన స్లీపర్ బస్సు ప్రయాణాలపై మరోమారు పెద్ద చర్చనే లేవనెత్తింది.సాక్షి ప్రతినిధి కర్నూలు/ కర్నూలు (హాస్పిటల్): హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ (స్కానియా) బస్సు (డీడీ 01ఎన్9490) శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... మొత్తం 44 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో హైదరాబాద్‌లో బయలుదేరిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 2.14 గంటలకు కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా దాటింది. 2.30 గంటలకు టాయిలెట్ కోసం కర్నూలులో ఆపారు. కొంత మంది మాత్రమే బస్సు దిగారు. మిగిలిన వారంతా గాఢనిద్రలో ఉన్నారు. ఆ తర్వాత బయలుదేరిన బస్సు చిన్నటేకూరు దాటగానే 2.45 గంటలకు ఓ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న శివశంకర్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ప్రమాదం తర్వాత కూడా ఆపకుండా డ్రైవర్ బస్సును ముందుకు నడిపాడు. ఇదే పెను ప్రమాదానికి కారణమైంది. ఆ సమయంలో బస్సు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత ముందుకు వెళ్లిపోతే ప్రమాదం తమపైకి రాదని భావించిన డ్రైవర్ బస్సును వేగంగా నడిపారు. శివశంకర్ రోడ్డు పక్కన పడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో బస్సు బైక్‌ను 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఆ రాపిడికి మంటలు రేగాయి. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలిపోయి మంటలు చెలరేగాయి. బస్సు ఎడమ వైపు డోర్ల భాగంలో మంటలు కనిపించాయి. అప్పుడు డ్రైవర్ బస్సును ఆపాడు. డ్రైవర్ లక్ష్మయ్యతో పాటు మరో డ్రైవర్ వాటర్ బాటిళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈలోపు ముందు భాగంతోపాటు బస్సు మధ్య భాగంలో కూడా మంటలు వ్యాపించాయి. బైక్‌ను ఢీకొట్టడంతో బస్సు డోర్‌లోని సెన్సార్ వైర్లు తెగిపోయాయి. దీంతో డోర్ పూర్తిగా లాక్ అయి తెరుచుకోలేదు. దీంతో డ్రైవర్లు భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులోంచి దూకేశారు. మంటల ధాటికి దట్టమైన పొగ బస్సు మొత్తం కమ్ముకుంది. ఒకరి ముఖం మరొకరికి కన్పించని పరిస్థితి. పొగ, మంటల ధాటికి ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక ఆర్తనాదాలు పెట్టారు. క్షణాల్లో మంటలు డోర్ కర్టన్లు, బెడ్షీట్లు, బెడ్లకు అంటుకుని అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. కొందరు మాత్రం బస్సు అద్దాలు పగులగొట్టి కిందకు దూకి గాయాలతో బయటపడ్డారు. తక్కిన వారు ప్రమాదం నుంచి తప్పించుకోలేక అగ్నికి ఆహుతయ్యారు. బస్సు మొత్తం నిమిషాల వ్యవధిలో పూర్తిగా దగ్ధమైంది. జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులు ప్రమాద ఘటనను వీడియో, ఫొటోలు తీసి పోలీసు అధికారులకు పంపారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్‌తో మంటలను అదుపు చేశారు. డ్రైవర్లు సహా 27 మంది ప్రయాణికులు సురక్షితం హైదరాబాద్‌లో బస్సు ఎక్కడానికి 40 మంది టికెట్ బుక్ చేసుకున్నారు. వీరిలో ఒకరు వ్యక్తిగత కారణాలతో ప్రయాణం రద్దు చేసుకోవడంతో బస్సు ఎక్కలేదు. మిగతా 39 మందితోపాటు నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ లెక్కన 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆపై హైదరాబాద్ శివారు ప్రాంతం ఆరంఘర్‌లో టికెట్ ముందుగా బుక్ చేసుకోని ఒకరు బస్సు ఎక్కారు. ఇద్దరు డ్రైవర్లతో కలిపి బస్సులో 46 మంది ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే కర్ణాటకలోని బాగేపల్లిలో బస్సు దిగాల్సి ఉంది. మిగతా వారంతా బెంగళూరుకు వెళ్లాల్సిన వారే. వీరిలో ప్రమాదం తర్వాత 27 మంది ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాద సమయంలో అద్దాలు ధ్వంసం చేసి దూకడంతో పాదాలు, కాళ్లకు గాయాలయ్యాయి. కొంత మందికి తలపై కూడా చిన్నచిన్న గాయాలయ్యాయి. వీరిలో 23 మంది పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు కాగా.. మరో ఇద్దరు డ్రైవర్లు. తక్కిన 19 మంది చనిపోయారు. మృతుల్లో 17 మంది పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను పోలీసులు 108లో కర్నూలు జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇంకొందరు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు కర్నూలు సమీపంలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రయాణికుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు యాజమాన్యంపై 125 (ఎ), 106 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఉలిందకొండ పీఎస్ ఎస్ఐ ధనుంజయ తెలిపారు. బస్సు డ్రైవర్లు శివనారాయణ, మిరియాల లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని ప్రమాద ఘటనకు దారితీసిన కారణాలపై విచారిస్తున్నారు. పనికి వెళ్లొస్తానని అటే వెళ్లిపోయాడు..అమ్మా డోన్ వద్ద పని ఉందంట. మాట్లాడుకుని మళ్లీ వస్తానని రాత్రి పోయినోడు మళ్లీ రాకుండానే పోయినాడు...అంటూ ఆ తల్లి గంటల తరబడి మార్చురీ వద్ద విలపిస్తున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా కర్నూలు మండలం బి.తాండ్రపాడుకు గ్రామానికి చెందిన నాగన్న కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆయన భార్య యశోదమ్మ ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసింది. ఇందులో పెద్దవాడైన శ్రీహరి గౌండా పనిచేస్తుండగా చిన్నవాడైన శివశంకర్ గ్రానైట్ పనులకు వెళ్లేవాడు. శివశంకర్ ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా డోన్ వద్ద పని ఉందని మాట్లాడుకుని వస్తానని వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ తల్లికి ఫోన్ చేయలేదు. ఉదయం లేచే సరికి బైక్‌పై వెళుతూ బస్సు కింద పడి శివశంకర్ మృతిచెందాడని పోలీసులు చెప్పడంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. అద్దాలు పగలగొట్టినా బయటకు రాలేని పరిస్థితి స్లీపర్ కోచ్ బస్సులో లోయర్, అప్పర్ బెర్త్‌లు ఉన్నాయి. అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు అద్దాలు పగలగొట్టి సులభంగా బయటకు దూకారు. గాయాలతో బయటపడ్డారు. అప్పర్ బెర్త్ అద్దాలు ధ్వంసం చేస్తే బయటకు దూకేయొచ్చు. కానీ లోయర్ బెర్త్‌లో అద్దాలు ధ్వంసం చేసినా, ఐరన్ యాంగ్లర్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో మనిషి దూరలేని పరిస్థితి! అప్పర్ బెర్త్ లాగే, లోయర్ బెర్త్‌లు కూడా ఉండి ఉంటే అద్దాలు ధ్వంసం చేసి ఇంకొందరు కిందకు దూకి ప్రాణాలతో బయట పడే అవకాశం ఉండేది. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర పోలీసులు బస్సును పరిశీలించారు. ఇనుప కడ్డీలు మినహా బస్సులో ఏమీ మిగల్లేదు. నల్లటి మసి దిబ్బలు మాత్రమే కన్పించాయి. తెల్లవారిన తర్వాత కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్లా, డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు వైద్యాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. వీరి సమక్షంలో బూడిదను తొలగించి.. నల్లగా బొగ్గులా మారిన మాంసపు ముద్దలను అతి కష్టం మీద వెలికి తీశారు. మొత్తం 19 మృతదేహాలను ప్రత్యేక టెంట్లో ఉంచారు. వాటి నుంచి ఫోరెన్సిక్ అధికారులు డీఎన్ఏ పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. మృతదేహాలకు వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాలను కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 14 మంది మృతుల కుటుంబ సభ్యుల డీఎన్ఏ శాంపుల్స్ కూడా వైద్యులు సేకరించారు.బస్సు ఆపి ఉంటే ప్రమాదం తప్పేది బస్సు బైక్‌ను ఢీకొట్టిన వెంటనే నిలిపేసి ఉంటే అసలు ప్రమాదమే జరిగేది కాదు. బైక్‌పై ప్రయాణించే శివశంకర్ మాత్రమే చనిపోయేవాడు. అయితే, ప్రమాదం తమపైకి రాకుండా ఉండేందుకు డ్రైవర్ లక్ష్మయ్య బస్సును అదే వేగంతోనే నడిపాడు. దీంతో బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడం, 300 మీటర్ల మేర రోడ్డుకు రాపిడికి గురై పెట్రోలు ట్యాంకు పగలడం, మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించడంతో పెను ప్రమాదం సంభవించింది. కాగా, బస్సు ప్రమాద ఘటన అధికారులతో పాటు అందరినీ తీవ్రంగా కలచి వేసింది. నేషనల్ హైవేపై అటు, ఇటు వెళ్లే వాహనదారులు బస్సును, అందులో బూడిదైన మృతదేహాలను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు మృతదేహాలను వెలికి తీసి మాంసం ముద్దలను పక్కనే టెంట్‌లోకి తీసుకెళుతున్న దృశ్యాలను చూసి ఘటనాస్థలిలోని వ్యక్తులు చలించిపోయారు. పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ఓ మహిళ మృతదేహంపై మంగళసూత్రం దండ కనిపించింది. బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ వారి వివరాలు 1. అశ్విన్‌రెడ్డి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 2. ఎం.సత్యనారాయణ, ఖమ్మం– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 3. జి.సుబ్రహ్మణ్యం, కాకినాడ– కర్నూలు అశ్విని హాస్పిటల్లో చికిత్స 4. గుణసాయి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 5. ఆండోజు నవీన్‌కుమార్, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 6. నేలకుర్తి రమేష్, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస 7. శ్రీలక్ష్మి, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస 8. వేణు గుండ, ప్రకాశం జిల్లా– బెంగళూరు వెళ్లిపోయారు 9. శ్రీహర్ష, నెల్లూరు– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ 10. శివ, బళ్లారి–బెంగళూరు వెళ్లిపోయారు 11. గ్లోరియా ఎల్సాశామ్ కేరళ– బెంగళూరు వెళ్లిపోయారు 12. ఎంజి. రామరెడ్డి, తూర్పుగోదావరి– హైదరాబాద్ వెళ్లిపోయారు 13. జయసూర్య, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 14. ఉమాపతి, హైదరాబాద్–బెంగళూరు వెళ్లిపోయారు 15. పంకజ్, బీదర్– పోలీస్ స్టేషన్లో ఉన్నారు 16. చరిత్, హైదరాబాద్– బెంగళూరు వెళ్లారు 17. హారిక, బెంగళూరు– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 18. కీర్తి, హైదరాబాద్– హైదరాబాద్ వెళ్లారు 19. వేణుగోపాల్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా– హిందుపురం వెళ్లారు 20. ఆకాష్, బీదర్– కర్నూలులో ఉన్నారు 21. మహమ్మద్ ఖైజర్, బెంగళూరు– బెంగళూరు వెళ్లారు 22. జయంత్ కుశ్వల, హైదరాబాద్– కర్నూలులో ఉన్నారు 23. కె.అశోక్, రంగారెడ్డి జిల్లా– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ 24. జశ్విత, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస 25. అఖీర, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస 26. మిర్యాల లక్ష్మయ్య (డ్రైవర్)– పల్నాడు జిల్లా27. శివనారాయణ (డ్రైవర్)– ప్రకాశం జిల్లాకంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతోపాటు సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కర్నూల్ కలెక్టరేట్ 08518277305 కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి 9121101059, 9494609814, 9052951010 ఘటనాస్థలం 9121101061 పోలీసు కంట్రోల్ రూమ్ 9121101075మృతుల వివరాలుపేరు రాష్ట్రం 1. జి.ధాత్రి (27) పూనూరు, బాపట్ల, ఏపీ 2. జి.రమేష్ (31)3. అనూష (28) 4.శశాంక్ (7) 5.మన్విత (4) 6. కె. శ్రీనివాసరెడ్డి (39) రావులపాలెం ,ఆంధ్రప్రదేశ్ 7. చందన (23) తెలంగాణ8.సంధ్యారాణి (43) తెలంగాణ 9. అనూష (22) తెలంగాణ 10. గిరిరావు (48) తెలంగాణ 11.ఆర్గా బండోపాధ్యాయ(32) తెలంగాణ12. మేఘనాథ్ (25) తెలంగాణ13. ఫిలోమన్ బేబీ(64) కర్ణాటక14. కిషోర్‌కుమార్(41) కర్ణాటక15. ప్రశాంత్(32) తమిళనాడు16.యువన్ శంకర్‌రాజ్(22) తమిళనాడు 17. కె.దీపక్‌కుమార్ (24) ఒడిశా 18.అమృత్‌కుమార్ (18) బిహార్ 19.గుర్తు తెలియని వ్యక్తి (50) (ఆరంఘర్ వద్ద బస్ ఎక్కాడు) 20 శివశంకర్ (23, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి) బి.తాండ్రపాడు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాల వారీగా మృతుల సంఖ్యఆంధ్రప్రదేశ్ 7 తెలంగాణ 6 కర్ణాటక 2 తమిళనాడు 2 బిహార్ 1 ఒడిశా 1 గుర్తుతెలియని వ్యక్తి 1 -
సంబంధం లేని ఎమ్మార్ కేసులో జగన్‌పై తప్పుడు రాతలు: శివశంకర్
సాక్షి, తాడేపల్లి: సంబంధం లేని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైయస్ జగన్‌ను ఏ1 నిందితుడు అంటూ ఈనాడు పత్రిక ప్రచురించిన తప్పుడు కథనాన్ని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆనందం కోసం రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ జర్నలిజాన్ని సమాధి చేస్తూ, వైఎస్సార్సీపీ పైన తప్పుడు రాతలు రాయడమే ఈనాడు లక్ష్యం అన్నట్లుగా పత్రికను నడుపుతున్నారని మండిపడ్డారు.ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైఎస్ జగన్ నిందితుడుగా ఉన్నట్లు ఒక్క ఆధారమైనా చూపగలరా అని ప్రశ్నించారు. న్యాయవాది, వ్యాపారిగా ఉన్న సునీల్ రెడ్డిని వైఎస్ జగన్‌కు సన్నిహితుడని, లిక్కర్ స్కాంలో నిందితుడుగా ఉన్నాడంటూ అర్థం లేకుండా పిచ్చిరాతలు రాసిన ఈనాడు ఒక్కసారైనా ఆయన గత ఐదేళ్లలో ఇక్కడకు వచ్చినట్లు, ఏదైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు నిరూపించగలరా అని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..‘‘ఎల్లో మీడియా ఈనాడులో బేతాళ కథల మాదిరిగా రోజుకో కొత్త కథను లిక్కర్ స్కాం అంటూ వండి వారుస్తున్నారు. వైఎస్ జగన్‌తో ఎవరైతే సన్నిహితులుగా ఉన్నారో వారిని అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ఈనాడు పత్రిక బాకా ఊదుతోంది. అన్ని విలువలను వదిలిపెట్టి, బురదచల్లడమే జర్నలిజంగా తన విధానాన్ని మార్చుకుంది. గతంలో రామోజీరావు ఉన్నప్పుడు ఎలా భజనచేశారో, దానికి మించి ఆయన కుమారుడు చెరుకూరి కిరణ్ మొత్తం పత్రికనే చంద్రబాబు పాదాక్రాంతం చేస్తూ, అత్యంత నీచమైన స్థాయికి దిగజారిపోయి, అబద్ధాలు, అభూతకల్పనలతో కథనాలను రాస్తున్నారు...దీనిలో భాగంగానే వైఎస్ జగన్‌కు నమ్మినబంటు, ఎమ్మార్ ప్రాపర్టీలో నిందితుడు సునీల్ రెడ్డి లిక్కర్ స్కాంలో కీలకం అంటూ ఒక కథనాన్ని వండివార్చారు. ఈ కథనంలో సునీల్ రెడ్డి ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఏ7 అయితే, దీనిలో వైఎస్ జగన్ ఏ1 అంటూ తన కథనంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ రాశారు. ఈనాడు కిరణ్ తన పత్రికను జర్నలిజం ప్రకారం నడుపుతున్నారా? లేక తన బ్రోకరిజం పాలసీ మేరకు నడుపుతున్నారా? ఎమ్మార్ కేసులో వైయస్ జగన్‌కు ఏం సంబంధం? కోర్టులో ఉన్న రికార్డుల ప్రకారం ఈ కేసులో ఏ1 బిభూ ప్రసాద్ ఆచార్య. అసలు ఈ కేసులో వైఎస్ జగన్ పేరు ఎక్కడ ఉందో చూపగలరా?..కనీస అవగాహన లేకుండా తప్పుడు కథనం రాశామని, మరుసటి రోజు అయినా సవరణ వేస్తారని చూశాం. కానీ వారి వైఖరి చూస్తుంటే, కావాలనే వైఎస్ జగన్‌పై బురదచల్లేందుకే ఈ కథనం రాశారని అర్థమవుతోంది. పైగా ఇదే కథనంలో వైఎస్ జగన్‌కు సునీల్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అంటూ రాశారు. సునీల్ అనే వ్యక్తి న్యాయవాది, వ్యాపారి. ఏనాడైనా ఆయన గత అయిదేళ్ళలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా ఇక్కడకు వచ్చారా? ఎక్కడైనా ఏదైనా వ్యవహారంలో జోక్యం చేసుకున్నారా? సూట్‌కేసు కంపెనీలను ఏర్పాటు చేశాడంటూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేశారో ఈనాడు పత్రిక చెప్పాలి...అత్యంత సన్నిహితుడు అంటే చంద్రబాబుకు నిత్యం భజన చేస్తూ పత్రికను నడిపించిన రామోజీరావు, ఆయన మరణం తరువాత ఆ స్థానంలో ఉన్న చెరుకూరి కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు. వీరు కదా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. సునీల్ రెడ్డి నివాసంలో సిట్ జరిపిన సోదాల్లో కీలక ఆధారాలు దొరికాయని, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు దొరికాయంటూ ఈనాడులో రాశారు. సిట్‌లోని ఏ అధికారి కీలక ఆధారాలు దొరికాయని చెప్పారో వెల్లడించాలి...గతంలో ఇదే లిక్కర్ స్కాంలో బంగారం, విదేశాల్లో ఫ్యాక్టరీలు, దుబాయ్‌లో ఆస్తులు ఇలా అనేక రకాలుగా ఊహాత్మక అంశాలను వార్తా కథనాలుగా రాశారు. ఈనాడు ఇలా దిగజారిపోయి రాస్తున్న తప్పుడు రాతలను చూస్తే, చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం జర్నలిజం విలువలను సమాధి చేసి, భజన చేయడమే తమ జీవితాశయంగా పత్రికను నడుపుతున్నారని అర్థమవుతోంది. లేని లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్‌ను దోషిగా చూపాలన్నదే వారి తాపత్రేయంగా కనిపిస్తోంది...ఈనాడు పత్రిక పేరును చంద్రనాడు అని మార్చుకుంటే బాగుంటుంది. ఇటువంటి తప్పుడు వార్తను ప్రచురించినందుకు ఈనాడు పత్రిక నిర్వాహకుడు చెరుకూరి కిరణ్ క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పటికే ఈనాడు పత్రికను ప్రజలు టిష్యూ పేపర్‌గా చూస్తున్నారు. దానిని టాయిలెట్ పేపర్ స్థాయికి తీసుకువెళ్ళేందుకు ఈనాడు కిరణ్ కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అబద్దపు రాతలపై చర్యలు తీసుకుంటామంటున్న సీఎం చంద్రబాబు, తన నమ్మినబంటు చెరుకూరి కిరణ్ ఈనాడులో రాస్తున్న అసత్య కథనాలపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని పుత్తా శివశంకర్ రెడ్డి పేర్కొన్నారు. -
మీ అన్నగా చెప్తున్నా అన్న.. నీ మాటలు ఏమయ్యాయి పవన్ ?
-
శివశంకర్ కృషితోనే న్యాయశాఖలో బడుగులకు ప్రాతినిధ్యం
గన్ ఫౌండ్రి: నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా స్వయంకృషితో పి.శివశంకర్ ఉన్నత స్థాయికి చేరుకున్నారని పలువురు ప్రముఖులు కొనియాడారు. అణగారిక వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి శివశంకర్ మరో అంబేడ్కర్ అని అభివర్ణించారు. గురువారం ఇక్కడి రవీంద్రభారతిలో ‘ఉత్తుంగ తరంగాలకు ఎదురీదిన ఓ విజేత జీవితావిష్కరణ’పేరిట కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ ఆత్మకథ గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ న్యాయశాఖలో బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కోసం అప్పట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి పి.శివశంకర్ తీసుకున్న నిర్ణయాలు ఎన్నో మార్పులు తీసుకు వచ్చాయని గుర్తుచేశారు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తరఫున సుప్రీంకోర్టులో పలు కేసులలో న్యాయవాదిగా శివశంకర్ అద్భుతంగా వాదించి ఆమెపై వచ్చిన ఆరోపణలను కొట్టివేయించగలిగారని గుర్తుచేశారు. కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ మాట్లాడుతూ కేంద్ర న్యాయ, మానవ వనరుల శాఖల మంత్రిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని కీర్తించారు. ఆయన ఆత్మకథ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని అన్నారు. నిరుపేద బాల్యం నుంచి అనేక ఆటుపోట్లను అధిగమిస్తూ ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్న శివశంకర్ విజయప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. ఆయనతో అప్పట్లో పనిచేసినటువంటి అనుభవాలు, జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడ, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రాంచందర్‌రావు, రఘువీరారెడ్డి, శివశంకర్ సతీమణి లక్ష్మి, కుమారుడు డాక్టర్ వినయ్, పుస్తక తెలుగు అనువాదకర్త వల్లీశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
నరసరావుపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నరసరావుపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతీ అభ్యర్థి ఉద్యోగ అర్హత సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియ కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం రాత్రికే పలు జిల్లాల నుంచి నిరుద్యోగ యువత పెద్దఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, కల్నల్ పునీత్, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం కె.వినాయకం తదితరులు పాల్గొన్నారు. -
ఆరు నెలల బిడ్డను మంత్రి పాదాల వద్ద ఉంచి.. డ్రైవర్ కన్నీటి పర్యంతం!
సాక్షి, చైన్నె: ఆరు నెలల బిడ్డను మంత్రి పాదాల వద్ద ఉంచి తనను తేనికి బదిలీ చేయాలని ఓ డ్రైవర్ పట్టుబట్టడం కోయంబత్తూరు రవాణా సంస్థలో కలకలం రేపింది. వివరాలు.. కోయంబత్తూరులో బుధవారం రవాణ శాఖ మంత్రి శివశంకర్ కార్యక్రమం జరిగింది. ఇందులో కొత్త భవనాల ప్రారంభోత్సవం, కారుణ్య నియామక ఉత్తర్వులు, పది, ప్లస్–2లో రాణించి రవాణా కార్మికుల పిలల్లకు సత్కారం జరిగింది. ఈ సందర్భంగా వేదిక మీదకు వచ్చిన ఓ డ్రైవర్ హఠాత్తుగా ఆరు నెలల తన బిడ్డను మంత్రి పాదాల వద్ద ఉంచాడు. తాను సైతం పాదాభివందనం చేసే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన మంత్రి ఆ చంటి బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నారు. అతడి చర్యలతో మంత్రి షాక్‌కు గురయ్యాడు. చివరకు తన వేదనను మంత్రికి వివరించాడు. కోయంబత్తూరులో తాను ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తూ వచ్చినట్టు పేర్కొన్నారు. 'பணியிட மாறுதல் வேண்டும்' தன் குழந்தையுடன் அமைச்சர் சிவசங்கர் காலில் விழுந்து கோரிக்கை வைத்த ஓட்டுநர் #Kovai | #Coimbatore |#MinisterSivasankar | #Driver pic.twitter.com/cCLm8RJHAb — PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) August 16, 2023 ఇటీవల తన భార్య బిడ్డకు జన్మనిచ్చి మరణించినట్లు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలను తాను చూసుకోలేని పరిస్థితి ఉందని, దీంతో స్వగ్రామం తేనిలో ఉన్న తన తల్లికి అప్పగించానని పేర్కొన్నాడు. చిన్న పిల్లలను చూసుకునేందుకు అవకాశం కల్పించాలని, తనను కోయంబత్తూరు నుంచి తేనికి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని వేడుకున్నారు. అతడి విజ్ఞప్తిని స్వీకరించిన మంత్రి పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
ఒక ఊరికథ..మంచిపని ఊరకే పోలేదు...ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇచ్చింది
బాలాసోర్ జిల్లా(ఒడిశా) బస్తా బ్లాక్‌లోని అంబక్చౌ అనే గ్రామం అది. ఊరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. కరువు కావచ్చు కరోనా కావచ్చు మరేదైనా కష్టం కావచ్చు. ఉపాధి కష్టమయ్యేది. ఊళ్లోని మగవాళ్లు పనుల కోసం పట్టణాలు వెదుక్కుంటూ వెళ్లేవాళ్లు. అలా పట్టణాలకు వెళ్లి కొత్త అలవాట్లు నేర్చుకొని కష్టపడిన సొమ్మును మద్యానికి తగలేసిన వారు కూడా ఉన్నారు. ఇక ఆ ఊళ్లో మహిళల విషయానికి వస్తే ఊరు దాటిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ఇంటిపనులు పూర్తయిన తరువాత, ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ‘మనం ఎందుకు వ్యాపారం మొదలుపెట్టకూడదు!’ అన్నారు ఒకరు. కొందరు నవ్వారు. కొందరు ఆలోచించారు. ఆ మాట ఈ మాట పూర్తయిన తరువాత అందరూ ఒక ఆలోచనకు వచ్చారు. ఆవులను కొనాలని. తాము కూడబెట్టుకున్న డబ్బు, అప్పు చేసిన సొమ్ముతో 13 మంది మహిళలు కలిసి 10 ఆవులను కొనుగోలు చేశారు. ‘శివశంకర్’ పేరుతో స్వయంసహాయక బృందంగా ఏర్పడ్డారు. ‘వాటిని మేపడానికే మీ జీవితం సరిపోతుంది’ అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. బృందంలోని సభ్యులలో చాలామంది భర్తల మూలంగా ఇబ్బంది పడ్డారు. భర్తలు భరించలేదు! ‘వాళ్ల మాటలు విని డబ్బు తగలేస్తావా?’ అంటాడు ఒక భర్త. ‘ఇంత డబ్బు నీ దగ్గర ఉందని ఎప్పుడూ చెప్పలేదేం’ అని ఈసడిస్తాడు ఒక భర్త. అయితే వారు వేటికీ చలించలేదు. మొదట పాలవ్యాపారం. ఆ తరువాత పెరుగు, నెయ్యి, వెన్న... మొదలైనవి అమ్మడం మొదలుపెట్టారు. ఆ ఊళ్లోనే కాదు... చుట్టు పక్కల ఊళ్లో నుంచి కూడా పాల ఉత్పత్తులు కొనడానికి వచ్చేవాళ్లు. ఆ తరువాత...రసగుల్లతో పాటు ఆ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘చెన’లాంటి స్వీట్ల తయారీ మొదలుపెట్టారు. సమీప పట్టణమైన బాలాసోర్‌లో ఈ స్వీట్లను అమ్మే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ‘పట్టణాల్లో మీ పల్లె మిఠాయిలు ఎవరు కొంటారు? అక్కడ పెద్ద పెద్ద స్వీట్‌షాప్‌లు ఉంటాయి’ అని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు కొందరు. అయితే వారు వెనక్కి తగ్గలేదు. స్వీట్ హిట్æ ‘శివశంకర్ స్వీట్’ సూపర్ హిట్ అయింది! బాలాసోర్‌లోనే కాదు బధ్రక్, మహారాజ్‌గంజ్... మొదలైన పట్టణాలతో పాటు పశ్చిమబెంగాల్‌కు కూడా విస్తరించింది స్వీట్ల వ్యాపారం. ‘మొదట్లో భయమేసి వెనక్కి తగ్గుదాం అనుకున్నాను. కాని ఆతరువాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కొనసాగాను. శివశంకర్ బృందంలో నేను కూడా భాగం అయినందుకు గర్విస్తున్నాను’ అంటుంది మాలతి. ‘వారి మాటల్లోని నిజాయితీ, వారి ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తుంది. ఎక్కడా కల్తీ ఉండదు. నాణ్యంగా ఉంటాయి’ అంటున్నాడు బాలాసోర్‌కు చెందిన వైద్యుడు చందన్. ఇది అతడి మాట మాత్రమే కాదు ఎంతోమంది మాట. అందుకే ‘శివశంకర్’ పాల ఉత్పత్తులకు మంచి పేరు వచ్చింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉపయోగించడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఒక మంచిపని ఊరకే పోదు! ఎన్నో ఊళ్లకు స్ఫూర్తిని ఇస్తుందని గెలుపుజెండా ఎగరేసి నిరూపించారు పదమూడు మంది మహిళలు. -
జస్టిస్ శివశంకర్ మరిన్ని పుస్తకాలు రచించాలి
సాక్షి, అమరావతి: న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఉపయుక్తంగా జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు మరిన్ని పుస్తకాలు రచించాలని, ఆయన కలం ఆగకూడదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి ఆకాంక్షించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకాన్ని మంగళగిరిలో గురువారం సీజే గోస్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీజే అరూప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ.. ఇటీవల జస్టిస్ శివశంకర్ తనను పుస్తక ఆవిష్కరణకు ఆహ్వానించారన్నారు. ‘ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకానికి తొలి పాఠకుడిని తానేనని చెప్పారు. న్యాయవ్యవస్థలోని వివిధ అంశాలను వివరణాత్మకంగా ఈ పుస్తకం ద్వారా అందించారన్నారు. శివశంకర్ పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. ఓ మంచి పుస్తకం పది మంది స్నేహితులతో సమానమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి తెలిపారు. ఈ పుస్తకం న్యాయవాద వృత్తిలోకి వచ్చే భవిష్యత్ తరాలకు టార్చ్‌బేరర్ వంటిది అన్నారు. శివశంకర్, తాను ఇద్దరు గోదావరి జిల్లాలకు చెందినవారమేనని పేర్కొన్నారు. శివశంకర్ రాసిన వర్డ్స్, ప్రిన్సిపిల్స్, ప్రెసిడెంట్స్ పుస్తకం న్యాయవాదులతోపాటు, న్యాయమూర్తులకు కూడా ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఆయన గతంలో రాసిన పుస్తకాలు న్యాయ వ్యవస్థపై సమాచారంతోపాటు జ్ఞానాన్ని అందించాయని న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జొయ్‌మాల్య బాగ్చి, దుర్గాప్రసాదరావు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సీఐ బాధ్యతలు స్వీకరణ
అనంతపురం సెంట్రల్ : నాలుగో పట్టణ సీఐగా శివశంకర్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూం(పీసీఆర్)లో పనిచేస్తున్న ఈయనను జిల్లాకు బదిలీ చేసిన విషయం విదితమే. ఆదివారం డీఐజీ, ఎస్పీ, డీఎస్పీలను కలిసిన అనంతరం ఆయన నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు.


