breaking news
Second semifinal
-
ఫైనల్‌కు 83 పరుగుల దూరంలో...
కల్యాణి (పశ్చిమ బెంగాల్): ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్ చేరేందుకు జమ్మూకశ్మీర్ జట్టుకు సువర్ణావకాశం లభించింది. మాజీ విజేత బెంగాల్ జట్టుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో జమ్మూకశ్మీర్ మరో 83 పరుగులు సాధిస్తే టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. బెంగాల్ నిర్దేశించిన 126 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 43 పరుగులు సాధించింది. జమ్మూకశ్మీర్ గెలవాలంటే మరో 83 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. అంతకుముందు మూడో రోజు బౌలర్ల హవా నడిపించారు. మూడో రోజు ఆటలో 17 వికెట్లు నేలకూలడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 198/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశ్మీర్ జట్టు 76.1 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌటైంది. చివరి వరుస బ్యాటర్లు ఆకిబ్ నబీ (54 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), యుధ్వీర్ సింగ్ (42 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. భారత బౌలర్, బెంగాల్ స్పీడ్‌స్టర్ మొహమ్మద్ షమీ 90 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. మిగతా రెండు వికెట్లు ముకేశ్ కుమార్‌కు దక్కాయి. 26 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన బెంగాల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. జమ్మూకశ్మీర్ పేస్ బౌలర్లు ఆకిబ్ నబీ, సునీల్ కుమార్, యు«ద్వీర్ సింగ్ ధాటికి బెంగాల్ 25.1 ఓవర్లలో కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. క్వార్టర్ ఫైనల్లో డబుల్ సెంచరీ, సెమీఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన బెంగాల్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి రెండో ఇన్నింగ్స్‌లో ‘సున్నా’కే వెనుదిరిగాడు. కెపె్టన్ అభిమన్యు ఈశ్వరన్ 5 పరుగులు చేశాడు. నబీ 36 పరుగులిచ్చి 4 వికెట్లు, సునీల్ కుమార్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు, యుధ్వీర్ సింగ్ 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి బెంగాల్‌ను దెబ్బ కొట్టారు. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్‌కు కూడా శుభారంభం లభించలేదు. ఓపెనర్లు శుభమ్ ఖజురియా (1), యావర్ హసన్ (6) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. శుభమ్ పుందిర్ (23 బ్యాటింగ్), వన్షజ్ శర్మ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రంజీ ట్రోఫీ చరిత్రలో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయర్, కెపె్టన్ పారస్ డోగ్రా, అబ్దుల్ సమద్ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో జమ్మూకశ్మీర్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే షమీ, ముకేశ్ కుమార్, షహబాజ్ అహ్మద్ బంతితో మెరిస్తే బెంగాల్ జట్టు కూడా విజయం ఆశించవచ్చు. సంక్షిప్త స్కోర్లు బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 328 ఆలౌట్; జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 302 ఆలౌట్; బెంగాల్ రెండో ఇన్నింగ్స్: 99 ఆలౌట్ (25.1 ఓవర్లలో) (షహబాజ్ అహ్మద్ 24, సూరజ్ జైస్వాల్ 14, అనుస్తుప్ 12, ఆకిబ్ నబీ 4/36, సునీల్ 4/27, యుధ్వీర్ 2/29), జమ్మూకశ్మీర్ రెండో ఇన్నింగ్స్: 43/2. -
యువ భారత్‌ను ఆపతరమా!
హరారే: అండర్–19 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న యువ భారత్ ఇదే జోరుతో ఫైనల్ చేరాలని ఆశిస్తోంది. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. ఫామ్ పరంగా చూసినా, మొత్తం టీమ్ ప్రదర్శన చూసినా ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత్‌ను అడ్డుకోవడం అఫ్గాన్‌కు సాధ్యమయ్యే పనైతే కాదు. అండర్–19 ప్రపంచకప్‌ల చరిత్రలోనే ఐదు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిరూపించుకున్న యువ భారత్... 2000, 2008, 2012, 2018, 2022 సరసన ఈ ఏడాదిని కూడా చేర్చాలని ఆరాటపడుతోంది. మన కుర్రాళ్లు ఆడుతున్న తీరు, గెలుస్తున్న వైనం చూస్తుంటే ఇదేమంత కష్టం కానేకాదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించింది. ఇలాంటి దుర్బేధ్యమైన భారత సేనను ఎదుర్కోవాలంటే అఫ్గానిస్తాన్ పెద్ద కసరత్తే చేయాలి. ఇక గెలవాలంటే మాత్రం ఓ సంచలనం నమోదవ్వాలి. అయితే ప్రత్యేకించి ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్ కూడా బాగా ఆడింది. భారత కుర్రాళ్లు ఐదు గెలిస్తే... అఫ్గాన్ కేవలం ఒకటి ఓడి, నాలుగు విజయాలతో సత్తా చాటుకుంది. ఇలాంటి మేటి ప్రదర్శన కనబరిచిన అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేయకూడదని ఆయుశ్ బృందానికి బాగా తెలుసు. ఆదమరుపు లేకుండా ఎప్పటిలాగే మరో మ్యాచ్ విజయం కోసం చెమటోడ్చాలని యువ బృందం పట్టుదలతో ఉంది. టీనేజ్ సంచలనం, ఓపెనింగ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సహా టాపార్డర్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నారు. ఆల్‌రౌండర్ విహాన్ మల్హోత్రా బ్యాట్‌తో, కెప్టెన్ ఆయుశ్ మాత్రే బంతితో ప్రత్యర్థి జట్ల పని పడుతున్నారు. వీరితో పాటు పేసర్లు హేనిల్ పటేల్, అంబరీశ్ నిప్పులు చెరుగుతుండటం బౌలింగ్ దళానికి వెన్నుదన్నుగా ఉంది. అఫ్గానిస్తాన్ కూడా మ్యాచ్‌మ్యాచ్‌కు రాటుదేలుతున్నప్పటికీ భారత్‌లాంటి ఆల్‌రౌండ్ సామర్థ్యమున్న జట్టును ఓడించాలంటే సర్వశక్తులు ఒడ్డినా సరిపోదేమో!ఆ్రస్టేలియాపై గెలిచి ఫైనల్లో ఇంగ్లండ్మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. కెప్టెన్ థామస్ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ ఒలివర్ పీక్ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో శుక్రవారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ తలపడుతుంది. -
భారత్-ఇంగ్లండ్ సెమీస్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
టీ20 వరల్డ్‌కప్-2024లో రెండో సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. గయానా వేదికగా సెకెండ్ సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ఈ సెమీస్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ స్ధానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10:00 గంటలకు( భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు) ప్రారంభం కానుంది. ప్రస్తుతం గయానాలో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి కూడా ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం కురిసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. దీంతో గ్రౌండ్ స్టాప్ మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మ్యాచ్‌కు వర్షం కచ్చితంగా అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. కాగా తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. కానీ భారత్, ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్ ఉదయం జరగనుండటంతో నిర్ణీత సమయం కటాఫ్ లేకుండా పొడిగింపు మాత్రం ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే సూపర్–8 దశలో టాపర్‌గా నిలిచిన భారత్ ఫైనల్‌కు చేరుతోంది. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. -
FIFA World Cup Qatar 2022 Semi-Final: అందరి కళ్లు మొరాకో పైనే...
దోహా: అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ఊహకందని ప్రదర్శనతో అదరగొడుతున్న ఆఫ్రికా జట్టు మొరాకో మరో సంచలనం సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో మొరాకో తలపడనుంది. ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి ముఖాముఖి మ్యాచ్ కాగా... వేర్వేరు టోర్నీలలో ఈ రెండు జట్లు 11 సార్లు తలపడ్డాయి. 1963లో ఒక్కసారి ఫ్రాన్స్‌ను ఓడించిన మొరాకో ఆ తర్వాత ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. 2007 తర్వాత ఈ రెండు జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరుగుతుండటం విశేషం. ఎంబాపె, జిరూడ్, గ్రీజ్మన్, థియో హెర్నాండెజ్, చువమెని, గోల్‌కీపర్ హుగో లోరిస్లాంటి స్టార్ ఆటగాళ్లతో ఫ్రాన్స్ పటిష్టంగా ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో ఉన్న మొరాకో ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా దేశంగా రికార్డు నెలకొల్పింది. కెనడాతో మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్ మినహా ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా సమర్పించుకొని ఏకైక జట్టుగా మొరాకో నిలిచింది. గ్రూప్ దశలో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టును నిలువరించిన మొరాకో ఆ తర్వాత రెండో ర్యాంకర్ బెల్జియంపై... ప్రిక్వార్టర్ ఫైనల్లో 2010 విశ్వవిజేత స్పెయిన్‌పై... క్వార్టర్ ఫైనల్లో 2016 యూరో చాంపియన్ పోర్చుగల్‌ను ఓడించి తమను ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దని ఫ్రాన్స్‌కు హెచ్చరికలు పంపించింది. మొరాకో తరఫున యూసుఫ్ ఎన్ నెసిరి, అచ్రఫ్ హకీమి, హకీమ్ జియెచ్, సఫ్యాన్ అమ్రాబత్, గోల్‌కీపర్ యాసిన్ బోనో ప్రదర్శన మరోసారి కీలకం కానుంది. ఈ టోర్నీలో ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్‌పోస్ట్ లక్ష్యంగా కొట్టిన 39 షాట్లను గోల్‌కీపర్ యాసిన్ బోనో నిలువరించడం విశేషం. -
రంజీ ఫైనల్లో తమిళనాడు
కోల్‌కతా: రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. మహారాష్ట్రతో జరిగిన రెండో సెమీఫైనల్ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా తమిళనాడు తుది పోరుకు అర్హత సాధించింది. ఈనెల 8 నుంచి ముంబైలో ఫైనల్ జరుగుతుంది. అటు గతేడాది రన్నరప్ అయిన మహారాష్ట్ర చివరి రోజు ఆదివారం ప్రత్యర్థి బౌలింగ్ ముందు తేలిపోయింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో 142 ఓవర్లలో 454 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో తమిళనాడుకు 95 పరుగుల ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన తమిళనాడు ఆట ముగిసే సమయానికి 46.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 119 పరుగులు చేసింది.


