breaking news
Samakka - Jatara
-
జన సంద్రంగా మారిన మేడారం.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతర నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. శుక్రవారం వేకువ జామున సమక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు భక్త జనం పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో వేలాది వాహనాలు తరలి వస్తుండగా.. కిలోమీటర్ల మేరన ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేడారం వీధులన్నీ సమక్క, సారలమ్మ నామఃస్మరణలతో మారుమోగుతోంది. తమను, తమవాళ్లను చల్లంగా చూడాలంటూ వన దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకోంటున్నారు. రేపు సాయంత్రం సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. ఈ నేపథ్యంలోఈ రెండ్రోజుల్లో లక్షల మంది జాతరకు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది. వీఐపీల తాకిడి..మేడారం మహాజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తులాభారం వేసి తల్లులకు నిలువెత్తు బంగారం(బెల్లం) పంచిపెడుతున్నారు. తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.పోలీసుల ఓవర్ యాక్షన్వీఐపీ భద్రత పేరుతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఉదయం నుంచి స్పెషల్ గేట్ ద్వారా వందలాది పోలీసులు సమ్మక్క- సారలమ్మ గద్దెల వైపు వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తల్లుల దర్శనం కావడం లేదు. గద్దెల ప్రాంగణమంతా పోలీసులే ఉండడంతో.. అడ్డు తొలగాలని స్థానిక అధికారులు పదే పదే మైకుల్లో చెప్తున్నారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. వీఐపీలు అరకోరగా వస్తున్నప్పటికీ.. వాళ్ల భద్రత పేరిట పోలీసులు అతికి దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సమ్మక్క తల్లి నామస్మరణతో..చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే జాతర ప్రధాన ఘట్టం గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమై.. రాత్రి 9:58గంటలకు గద్దెపై సమ్మక్క తల్లిని ప్రతిష్ఠించే వరకు ఉద్విగ్నభరితంగా సాగింది. అడవి తల్లి రాక కోసం భక్తులంతా కన్నార్పకుండా చిలకలగుట్ట వైపు చూశారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కతల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక్క ఉదుటున గుట్ట దిగారు. మిగిలిన పూజారులు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా, అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఏకే–47 తుపాకీతో 4 విడతలుగా గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. -
జనసంద్రంగా మేడారం.. భారీగా ట్రాఫిక్‌జామ్
సాక్షి, హైదరాబాద్: మేడారం మహా జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు సాగే సంరంభంలో.. ఇవాళ పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్టించడంతో అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం సమక్క గద్దె మీదకు చేరనుంది. జాతర నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకే లక్షల మంది జాతరకు తరలి వస్తున్నారు. మేడారం పరిసర ప్రాంతాలు భక్త జనంతో కిక్కిరిసిపోయింది. జాతర మొదలు కావడంతో ఒక్కసారిగా పోటెత్తారు. ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, బస్సులు.. ఇలా వాహనాల్లో తరలి వస్తున్నారు. దీంతో బుధవారం వేకువ జామున సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. పోలీసులు రంగంలోకి దిగారు. ఇటు జంపన్న వాగు వద్ద ఇసుకేస్తే రాలని జనం కనిపిస్తున్నారు. మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి బుధవారం మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారు. గురువారం సాయంత్రం మేడారం సమీపంలోని చిలుకలగుట్ట నుంచి కుంకుమభరిణె రూపంలో సమ్మక్కను తీసుకువచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మను భక్తకోటి దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం జనదేవతల వనప్రవేశంతో మహాజాతర పరిసమాప్తి అవుతుంది.నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు భారీ సంఖ్యలో మేడారం వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లే.. మహోత్తర ఘట్టానికి తగ్గట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మహా జాతర నేపథ్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. 13వేల మంది పోలీసులు, 42వేల మంది వివిధ శాఖల అధికారులతో జాతర నిర్వహణ జరగనుంది.రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల పదికిలోమిర్ల పరిధిలో తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, వీధిదీపాల ఏర్పాటు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పండుగైన మేడారం గిరిజన జాతరను మంత్రి సీతక్క దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇటు వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి జాతరకు సుమారు రెండు కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మేడారం పనుల్లో టెండ‘రింగ్’
=పనులన్నింటికీ ఎక్సెస్‌తో దాఖలు =ప్రభుత్వంపై రూ. 8లక్షల అదనపు భారం జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: మేడారం సమక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా చేపట్టే 24పనుల కో సం నిర్వహించిన టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్ అయ్యారు. తాగునీటి పైప్లైన్ల నిర్మాణం, మరుగుదొడ్ల వద్ద నీటి సౌకర్యంతో పాటు జా తర సమయంలో వీటి నిర్వహణ చూసేందుకు రూ. 211లక్షల వ్యయంతో 24పనులు చేపట్టనున్నారు. వీటి కోసం నిర్వహించిన టెండర్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ పనులు దక్కించుకునేందుకు 163 షెడ్యూళ్లను కాంట్రాక్టర్లు కొనుగోలు చేశారు. మొత్తం 24 పనులకు 69 షెడ్యూళ్లు మాత్రమే దాఖలయ్యాయి. ఒక్కొక్క పనికి రెండు, మూడు చొప్పున టెండ ర్లు దాఖలయ్యాయి. టెండర్లు తెరిచిన వాటిలో 3.5 నుంచి 4.5శాతం ఎక్కువతో వేసిన వారికి టెండర్లు దక్కినట్లు హన్మకొండ డివిజన్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఎక్సెస్ టెండర్లతో 24పనులకు సుమారు రూ.8 లక్షల వరకు అదనపు భారం ప్రభుత్వంపై పడుతుంది. చక్రం తిప్పిన నాయకులు... ఆర్డబ్ల్యూఎస్ టెండర్లు వేసేందుకు ముందు గా షెడ్యూళ్లను పొందేందుకు చోటామోటా కాంట్రాక్టర్లు సుమారు 600కు పైగా డీడీలు తీసినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న తాడ్వాయి మండలానికి చెందిన రాజకీయ నేతలు స్థానికులకు అవకాశం ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీంతో కాంట్రాక్టర్లు, నాయకుల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఇందులో షెడ్యూల్ కోసం తీసిన డీడీలను సేకరించి ఒకరి వద్ద పెట్టారు. ప్రతి షెడ్యూల్‌కు గుడ్‌విల్ చెల్లించేందుకు సుమారు రూ.20లక్షల వరకు పనులు చేసే కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో షెడ్యూల్ ఒక్కంటికి రూ.1500ల చొప్పున గుడ్‌విల్ చెల్లించి పనులన్నీ కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు తెలిసింది. గుడ్‌విల్ కింద రూ.10లక్ష లు, మిగిలిన డబ్బులు నేతలు పార్టీల వారీగా పంపకాలు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారంలో పనులు ప్రారంభిస్తాం.. టెండర్ల ప్రక్రియ పూర్తయినందున ఎక్సెస్ వేసిన కాంట్రాక్టర్లతో చర్చించి వారం రోజుల్లో పనులు ఫైనల్ చేస్తామని ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. మేడారం పరిసర ప్రాంతాల్లో వరి పంట ఉన్నందున కోతలు పూర్తయిన తర్వాత మరుగుదొడ్లు, పైపులైన్ల నిర్మాణం చేపట్టే అవకాశాలున్నాయన్నారు. ఈలోగా జంపన్నవాగులో ఉన్న 9 ఇన్ఫిల్లరేషన్ బావుల్లో పూడిక తీత చేపట్టనున్నట్లు తెలిపారు. గత జాతర వరకు సుమారు 250 బోర్లు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నదని, వాటిని గుర్తించి మరమ్మతులు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ జాతర సందర్భంగా నిర్మించే మరుగుదొడ్ల వివరాలు, వేసే బోర్లను గూగుల్‌లో గుర్తించే విధంగా అన్లైన్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.


